బుధవారం (ఆగస్టు 5) ఉదయం కమోడిటీ మార్కెట్లలో బంగారం, వెండి కళకళలాడాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికన్ డాలర్ ఇండెక్స్ క్షీణించడం, ముడిచమురు ధరలు దిగిరావడంతో లోహాల కొనుగోళ్లకు డిమాండ్ పెరిగింది. మరోవైపు నేడు వెలువడనున్న ఆర్‌బీఐ ద్రవ్యపతిన విధాన నిర్ణయంపై మదుపర్లు దృష్టి సారించారు.
ఎంసీఎక్స్‌లో రేట్లు ఎలా ఉన్నాయంటే?

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బుధవారం ఉదయం 9:10 గంటల సమయంలో:
బంగారం: అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.56% పెరిగి 10 గ్రాములకు ₹1,45,110 వద్ద నమోదైంది.
వెండి: సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ దాదాపు 1% లాభపడి కిలోకు ₹2,23,690 వద్ద ట్రేడయింది.
డాలర్, క్రూడ్ పతనం కలిసొచ్చింది
డాలర్ ఇండెక్స్ 0.10% తగ్గి 99.77 వద్దకు చేరింది. డాలర్ క్షీణించడం వల్ల ఇతర కరెన్సీల రూపంలో బంగారం కొనుగోలు చేసేవారికి భారం తగ్గింది.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 1% కంటే ఎక్కువ తగ్గి బ్యారెల్‌కు $78 సమీపానికి చేరింది. హార్ముజ్ జలసంధిని త్వరలోనే తెరుస్తామని, లేకపోతే ఇరాన్‌పై కఠిన చర్యలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించినప్పటికీ, దౌత్యపరమైన చర్చల నేపథ్యంలో చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి.
ఆర్‌బీఐ పాలసీపైనే కళ్లు
యూఎస్ ఫెడరల్ రిజర్వ్ తన సమీక్షలో వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచిన సంగతి తెలిసిందే. అదే బాటలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా పయనిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఉదయం 10 గంటలకు విధాన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఆర్‌బీఐ రెపో రేటును 5.25% వద్దే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.
"ఈసారి ఆర్‌బీఐ నిర్ణయంలో కేవలం వడ్డీ రేట్ల కంటే ద్రవ్యోల్బణం, మార్కెట్లో ద్రవ్య లభ్యత (Liquidity), అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై ఆర్‌బీఐ కామెంట్లు ఎలా ఉండబోతున్నాయనేది అత్యంత కీలకం" అని ఐఎన్‌విఅస్సెట్ పిఎమ్ఎస్ బిజినెస్ హెడ్ హర్షల్ దసానీ తెలిపారు.
నేడు గమనించాల్సిన కీలక స్థాయిలు (Trading Levels)
{{/usCountry}}"ఈసారి ఆర్‌బీఐ నిర్ణయంలో కేవలం వడ్డీ రేట్ల కంటే ద్రవ్యోల్బణం, మార్కెట్లో ద్రవ్య లభ్యత (Liquidity), అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై ఆర్‌బీఐ కామెంట్లు ఎలా ఉండబోతున్నాయనేది అత్యంత కీలకం" అని ఐఎన్‌విఅస్సెట్ పిఎమ్ఎస్ బిజినెస్ హెడ్ హర్షల్ దసానీ తెలిపారు.
నేడు గమనించాల్సిన కీలక స్థాయిలు (Trading Levels)
{{/usCountry}}పృథ్వీఫిన్ మార్ట్ కమోడిటీ రీసెర్చ్ విశ్లేషకుడు మనోజ్ కుమార్ జైన్ అంచనా ప్రకారం..
అంతర్జాతీయ మార్కెట్: బంగారానికి $4,120, $4,089 వద్ద మద్దతు (Support), $4,184, $4,222 వద్ద నిరోధం (Resistance) ఉన్నాయి. వెండికి $59.10, $58.40 వద్ద మద్దతు, $61.60, $62.80 వద్ద నిరోధం ఉన్నాయి.
ఎంసీఎక్స్ బంగారం: మద్దతు ధరలు ₹1,43,350 - ₹1,42,600. నిరోధక స్థాయిలు ₹1,45,000 - ₹1,45,550. ₹1,43,500 వద్ద కొనుగోలు చేసి స్టాప్ లాస్ ₹1,42,000 కింద ఉంచాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.
ఎంసీఎక్స్ వెండి: మద్దతు ధరలు ₹2,20,000 - ₹2,17,700. నిరోధక స్థాయిలు ₹2,23,000 - ₹2,25,500.
ఎల్కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ జతీన్ త్రివేది ప్రకారం, రూపాయి మారకపు విలువ ఆధారంగా ఎంసీఎక్స్ బంగారం సమీప కాలంలో ₹1,42,500 నుంచి ₹1,44,500 శ్రేణిలో కదలాడే అవకాశం ఉంది.