2026 న్యూ ఇయర్ వేడుకల కోసం వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు.. ఇక చాటింగ్ మరింత కలర్‌ఫుల్!
2026 నూతన సంవత్సర వేడుకల కోసం వాట్సాప్ సరికొత్త ఫీచర్లను పరిచయం చేసింది. యానిమేటెడ్ స్టిక్కర్లు, వీడియో కాల్స్‌లో ఫైర్వర్క్స్ ఎఫెక్ట్స్, కాన్ఫెట్టి రియాక్షన్లతో యూజర్ల సంభాషణలు ఇక మరింత ఉత్సాహంగా సాగనున్నాయి.
మీ 2026 న్యూ ఇయర్ వేడుకలను మరింత గొప్పగా మార్చేందుకు సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ రెడీ అయ్యింది. ప్రతి ఏటా న్యూ ఇయర్ రోజునే వాట్సాప్‌లో మెసేజ్‌లు, కాల్స్ రికార్డు స్థాయిలో జరుగుతుంటాయి. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని, యూజర్లు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకునే క్షణాలను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు 2026 స్పెషల్ ఫీచర్లను సంస్థ విడుదల చేసింది. వాటి గురించి ఇక్కడ తెలుసుకోండి..

వాట్సాప్ ఫీచర్స్- చాట్స్, కాల్స్‌తో కొత్త హంగులు..
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాడే మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’.. 2026కి స్వాగతం పలుకుతూ వాట్సాప్ కొన్ని పరిమిత కాల ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది.
ప్రత్యేక స్టిక్కర్ ప్యాక్: ‘2026’ థీమ్‌తో కొత్త స్టిక్కర్లను వాట్సాప్ విడుదల చేసింది. వీటిని వ్యక్తిగత చాట్స్ లేదా గ్రూపుల్లో పంపి కొత్త ఏడాది శుభాకాంక్షలను వినూత్నంగా తెలియజేయవచ్చు.
వీడియో కాల్స్‌లో ఫైర్వర్క్స్: ఇప్పుడు వీడియో కాల్స్ మాట్లాడుతుండగానే స్క్రీన్‌పై బాణసంచా (fireworks), కాన్ఫెట్టి, నక్షత్రాల యానిమేషన్లను ప్లే చేయవచ్చు. కాల్ కట్ చేయకుండానే ఎఫెక్ట్స్ మెనూ ద్వారా వీటిని అప్లై చేసే వీలుంది.
కాన్ఫెట్టి రియాక్షన్లు: మీరు ఎవరికైనా ‘కాన్ఫెట్టి’ ఎమోజీతో రియాక్షన్ ఇచ్చినప్పుడు, చాట్ స్క్రీన్ మొత్తం యానిమేషన్‌తో కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. వేగంగా విష్ చేయడానికి ఇది చక్కని ఆప్షన్.
వాట్సాప్ స్టేటస్‌లో యానిమేషన్ సపోర్ట్..
వాట్సాప్ స్టేటస్ ఫీచర్‌లో తొలిసారిగా యానిమేటెడ్ స్టిక్కర్లను తీసుకొచ్చింది ఈ మెటా ఆధారిత సంస్థ. యూజర్లు తమ స్టేటస్‌లో 2026 లేఅవుట్‌ను ఎంచుకుని, యానిమేటెడ్ ఎలిమెంట్లను జోడించవచ్చు. ఒక్కో చాట్ ఓపెన్ చేయకుండా, అందరికీ ఒకేసారి స్టైలిష్‌గా విష్ చేయాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
గ్రూప్ ప్లానింగ్ ఇక సులభం..
కొత్త ఏడాది పార్టీలు, గెట్-టు-గెదర్లు ప్లాన్ చేసే వారి కోసం గ్రూప్ చాట్లలో ప్రత్యేక టూల్స్ అందుబాటులోకి వచ్చాయి.
ఈవెంట్స్: గ్రూప్ చాట్‌లోనే ఈవెంట్ క్రియేట్ చేసి, దాన్ని పైన పిన్ చేయవచ్చు. ఎంతమంది వస్తున్నారు? ఎక్కడ కలుస్తున్నారు? వంటి వివరాలను దీని ద్వారా ట్రాక్ చేయవచ్చు.
పోల్స్ అండ్ లైవ్ లొకేషన్: పార్టీలో ఏం తినాలి? ఏ యాక్టివిటీ చేయాలి? వంటి విషయాలపై గ్రూపులో ఓటింగ్ (Polls) నిర్వహించుకోవచ్చు. అలాగే, అందరూ నిర్ణీత ప్రాంతానికి చేరుకునేలా లైవ్ లొకేషన్ ఫీచర్ సాయపడుతుంది.
వాయిస్ అండ్ వీడియో మెసేజ్‌లు: పార్టీకి రాలేని వారు కూడా వేడుకల్లో భాగం అయ్యేలా రియల్ టైమ్ వీడియో మెసేజ్‌లు పంపే సౌకర్యాన్ని వాట్సాప్ గుర్తు చేసింది.
మరి ఈ వాట్సాప్ 2026 న్యూయర్ ఫీచర్స్‌ని ఉపయోగించుకుని మీ కుటుంబం లేదా స్నేహితులతో వేడుక చేసుకునేందుకు మీరు సిద్ధమా?
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


