Budget SUVs : 2026లో అతి తక్కువ ధరకే లభిస్తున్న టాప్-5 ఎస్​యూవీలు ఇవే..

భారత ఆటోమొబైల్ రంగంలో ఎస్​యూవీల హవా నడుస్తోంది. పటిష్టమైన నిర్మాణం, భద్రతా ప్రమాణాలు మెండుగా ఉండటంతో కొనుగోలుదారులు వీటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియాలో టాప్​-5 అఫార్డిబుల్​ ఎస్​యూవీల వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Feb 11, 2026, 07:30:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతదేశంలో కార్ల ప్రియుల చూపు ఇప్పుడు ఎస్​యూవీల వైపు మళ్లింది. రోడ్లపై రాజసం, హై గ్రౌండ్ క్లియరెన్స్, ఎక్కడానికి- దిగడానికి సులువుగా ఉండటం, పటిష్టమైన నిర్మాణం, భద్రతా ప్రమాణాలు మెండుగా ఉండటంతో సామాన్యులు సైతం వీటిని ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్​యూవీలు తక్కువ పన్నులు, అద్భుతమైన ఫీచర్లతో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలో లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత మార్కెట్​లో లభిస్తున్న 5 అత్యంత చౌకైన ఎఎస్​యూవీల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టాటా పంచ్ ఎస్​యూవీ..
టాటా పంచ్ ఎస్​యూవీ..

ఇండియాలో టాప్​-5 చౌకైన ఎస్​యూవీలు..

1. టాటా పంచ్

ప్రస్తుతం ఇండియాలో అత్యంత చౌకైన ఎస్​యూవీగా ‘టాటా పంచ్’ కొనసాగుతోంది. దీని ప్రారంభ ధర రూ. 5.59 లక్షలు. 2026 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో టాటా మోటార్స్ ఈ కారు ప్రారంభ ధరను ఏకంగా రూ. 40,000 తగ్గించడం విశేషం.

ఫీచర్స్: కొత్తగా 120 హెచ్​పీ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను పరిచయం చేశారు.

ఆప్షన్లు: ఇందులో 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ (పెట్రోల్ అండ్​ సీఎన్జీ) కూడా అందుబాటులో ఉంది. మాన్యువల్, ఏఎంటీ గేర్ బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.

2. నిస్సాన్ మాగ్నైట్

స్టైలిష్ లుక్, బడ్జెట్ ధరలో లభించే మరో అద్భుతమైన ఎస్​యూవీ ఈ నిస్సాన్ మాగ్నైట్. దీని ప్రారంభ ధర రూ. 5.62 లక్షలు.

ఇంజిన్: ఇందులో 1.0 లీటర్ పెట్రోల్, టర్బో-పెట్రోల్ ఇంజిన్లు ఉన్నాయి.

ప్రత్యేకత: సీఎన్జీ వేరియంట్‌లో ఏఎంటీ గేర్‌బాక్స్‌ను అందిస్తున్న అతికొద్ది కార్లలో ఇదీ ఒకటి. డీలర్ ద్వారా బిగించే సీఎన్జీ కిట్ సౌకర్యం కూడా ఉంది.

3. హ్యుందాయ్ ఎక్స్​టర్​

హ్యుందాయ్ నుంచి వచ్చిన ఎంట్రీ లెవల్ ఎస్​యూవీ ఈ ఎక్స్​టర్​. తక్కువ ధరలో ఎక్కువ వేరియంట్లు (సుమారు 30) కోరుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.

దీని ప్రారంభ ధర రూ. 5.64 లక్షలు.

పవర్: 1.2 లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది.

వైవిధ్యం: పెట్రోల్ (83 హెచ్​పీ), సీఎన్జీ (69 హెచ్​పీ) ఆప్షన్లు ఉన్నాయి. 5-స్పీడ్ మాన్యువల్, పెట్రోల్ వెర్షన్‌లో ఏఎంటీ గేర్‌బాక్స్ లభిస్తుంది.

4. రెనాల్ట్​ కైగర్

2025లో సరికొత్త హంగులతో మార్కెట్​లోకి వచ్చిన రెనాల్ట్​ కైగర్, నేటికీ చౌకైన కార్ల జాబితాలో ఒకటిగా కొనసాగుతోంది.

దీని ప్రారంభ ధర రూ. 5.76 లక్షలు.

వేరియంట్లు: 72 హెచ్​పీ పెట్రోల్ ఇంజిన్ (మాన్యువల్/ ఏఎంటీ), 100 హెచ్​పీ టర్బో-పెట్రోల్ ఇంజిన్ (మాన్యువల్/ సీవీటీ) ఆప్షన్లు ఉన్నాయి.

సీఎన్జీ: పెట్రోల్ వెర్షన్ కంటే రూ. 79,500 అదనంగా చెల్లిస్తే డీలర్ లెవల్ సీఎన్జీ కిట్‌ను కూడా పొందవచ్చు.

5. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్

మారుతీ సుజుకీ బాలెనో ఆధారంగా రూపొందించిన ఫ్రాంక్స్ ఎస్​యూవీ క్రాసోవర్​.. స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకుంటోంది. బ్రెజా కంటే ఇది మరింత మోడ్రన్‌గా కనిపిస్తుంది.

దీని ప్రారంభ ధర రూ. 6.85 లక్షలు.

ఇంజిన్: పెట్రోల్, టర్బో-పెట్రోల్, సీఎన్జీ ఆప్షన్లలో లభిస్తుంది.

పొదుపు: ఇదే తరహా ఫీచర్లున్న టయోటా టైజర్ కంటే దీని ప్రారంభ ధర రూ. 40,000 తక్కువగా ఉండటం విశేషం.

*పైన చెప్పిన ధరలన్నీ ఎక్స్​షోరూం ప్రైజ్​లు అని గుర్తుపెట్టుకోవాలి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More