Electric scooter : విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్- ధర రూ. 1లక్ష లోపే!
Vida electric scooter : భారత టూవీలర్ దిగ్గజం హీరో మోటోకార్ప్, ఎలక్ట్రిక్ వాహన రంగంలో తన పట్టును మరింత పెంచుకునేందుకు సిద్ధమైంది. సామాన్యులకు అందుబాటులో ఉండే ధరలో, అంటే రూ. లక్ష లోపే ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసే ప్లాన్‌లో ఉంది. వివరాల్లోకి వెళితే..
Budget electric scooter : హీరో మోటోకార్ప్ తన ఎలక్ట్రిక్ విభాగం ‘విడా’ ద్వారా సరికొత్త విప్లవానికి తెరలేపే ప్లాన్‌లో ఉంది! ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరల అడ్డంకిని తొలగిస్తూ, 3.8 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో ఫిక్స్‌డ్ బ్యాటరీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సంస్థ పరిచయం చేయబోతోంది. దీని ధర రూ. 1లక్షలోపే ఉండే అవకాశం ఉంది. ఇది కేవలం ఒక లాంచ్ మాత్రమే కాదు, భారత ఈవీ రంగంలో ఒక కీలక మలుపుగా నిపుణులు భావిస్తున్నారు.

ఈ మోడల్ ఆగస్ట్ 2026 నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. పెట్రోల్ స్కూటర్ల నుంచి ఈవీల వైపు మళ్లాలనుకునే మధ్యతరగతి వినియోగదారులే లక్ష్యంగా ఈ వాహనం రానుంది. కాగా దీని రేంజ్, ఫీచర్లు వంటి వివరాలపై రానున్న రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
భారీ పెట్టుబడులు.. అత్యాధునిక సాంకేతికత
హీరో మోటోకార్ప్ రాబోయే ఆర్థిక సంవత్సరానికి (ఎఫ్వై27) గాను రూ. 1,500 కోట్లకు పైగా మూలధన వ్యయం (క్యాపెక్స్) చేయాలని నిర్ణయించింది. ఈ నిధులను కేవలం వాహన తయారీకే కాకుండా, కనెక్టెడ్ వెహికల్ ప్లాట్‌ఫారమ్స్, జనరేటివ్ ఏఐ ఆధారిత కస్టమర్ ఇంటర్‌ఫేస్, ఫ్లెక్స్-ఫ్యూయల్ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అభివృద్ధికి కూడా ఖర్చు చేయనుంది. అదనంగా, దక్షిణాదిలో ఒక సెకండరీ ‘పాత్’ సెంటర్ ఏర్పాటు కోసం రూ. 700 కోట్లు కేటాయించింది.
ఆంధ్రప్రదేశ్‌లో తయారీ హబ్.. పెరగనున్న సామర్థ్యం!
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ ప్లాంట్ హీరో ఈవీ వ్యూహంలో కీలక పాత్ర పోషించనుంది.
గత ఆర్థిక సంవత్సరంలో 1.48 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేయగా, ఎఫ్వై27 నాటికి దీనిని 2.8 లక్షల యూనిట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
విడా బ్రాండ్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏకంగా 6.6 లక్షల యూనిట్లకు చేర్చాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.
నెలకు ఈవీ తయారీ సామర్థ్యాన్ని ఇప్పటికే 15,000 నుంచి 25,000 యూనిట్లకు పెంచారు, రాబోయే వారాల్లో ఇది మరో 50% పెరిగే అవకాశం ఉంది.
మార్కెట్లో ‘విడా’ దూకుడు..
2026 ఆర్థిక సంవత్సరంలో విడా బ్రాండ్ అద్భుతమైన పనితీరును కనబరిచింది. దాదాపు 1.44 లక్షల యూనిట్ల రిజిస్ట్రేషన్లతో 10.3 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది. ముఖ్యంగా ఏప్రిల్ 2026లో ఏడాది ప్రాతిపదికన 129 శాతం వృద్ధిని సాధించి, టాప్-5 ఎలక్ట్రిక్ వాహనాల బ్రాండ్లలో అత్యంత వేగంగా ఎదుగుతున్న బ్రాండ్‌గా నిలిచింది.
కేవలం స్కూటర్లే కాకుండా, 2027 నాటికి ‘లింక్స్’ అనే పేరుతో ఆఫ్-రోడ్ ఎలక్ట్రిక్ బైక్, ‘యుబెక్స్’ అనే మరో మోడల్‌ను కూడా లాంచ్ చేయనుంది.
పెట్రోల్ వాహనాల విభాగంలో కూడా డెస్టినీ, జూమ్ వంటి మోడళ్ల ఉత్పత్తిని పెంచుతూ, తన సమీప ప్రత్యర్థి హోండాపై 3.1 లక్షల యూనిట్ల ఆధిక్యాన్ని హీరో మోటోకార్ప్ ప్రదర్శిస్తోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


