Honda Prelude : 20ఏళ్ల తర్వాత రీ-ఎంట్రీ ఇస్తున్న హోండా ప్రెల్యూడ్! అదిరే డిజైన్‌తో..
Honda upcoming cars in India : తన లెజెండరీ ‘ప్రెల్యూడ్’ని ఇండియాలోకి తిరిగి తీసుకురావాలని హోండా సంస్థ ప్లాన్ చేస్తోంది. వచ్చే నెలలోనే దీని లాంచ్ ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ హోండా ప్రెల్యూడ్ విశేషాలను ఇక్కడ చూసేయండి..
Honda Prelude India launch : భారత ఆటోమొబైల్ మార్కెట్లో తన పట్టును మళ్లీ బిగించేందుకు జపాన్ దిగ్గజం హోండా భారీ స్కెచ్ వేసింది. 2030 నాటికి దేశంలో 10 కొత్త మోడళ్లను విడుదల చేయాలనే లక్ష్యంలో భాగంగా, తన ఐకానిక్ మోడల్ ‘హోండా ప్రెల్యూడ్’ని మళ్లీ రంగంలోకి దించుతోంది. సుమారు రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత, సరికొత్త హైబ్రిడ్ అవతారంలో ఈ కారు ఇండియన్ రోడ్లపై సందడి చేయనుంది! వివరాల్లోకి వెళితే..

20 ఏళ్ల తర్వాత రీ-ఎంట్రీ!
హోండా ప్రెల్యూడ్ అంటే ఒకప్పుడు గ్లోబల్ మార్కెట్లో ఒక క్రేజ్! ఇప్పుడు ఇది ఆరొవ జనరేషన్ మోడల్‌గా రూపుదిద్దుకుంది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయాలు ప్రారంభించుకున్న ఈ టూ-డోర్ కూపే కారును, హోండా భారత్‌కు సీబీయూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూపంలో దిగుమతి చేయనుంది. అంటే విదేశాల్లో తయారైన కారును నేరుగా ఇక్కడికి తీసుకొచ్చి విక్రయిస్తారు.
హోండా ప్రెల్యూడ్- డిజైన్, డైమెన్షన్స్..
ఇది కేవలం 4,520 ఎంఎం పొడవు ఉన్న కాంపాక్ట్ టూ-డోర్ కూపే. ఇందులో 2+2 సీటింగ్ లేఔట్ ఉంటుంది.
గ్రౌండ్ క్లియరెన్స్: దీని గ్రౌండ్ క్లియరెన్స్ కేవలం 135 ఎంఎం మాత్రమే. ఇది భారతీయ రోడ్లపై ఉండే స్పీడ్ బ్రేకర్ల వద్ద డ్రైవర్లకు కొంచెం సవాలుగా మారవచ్చు.
సీటింగ్: వెనుక సీట్లు చిన్నపిల్లలకు మాత్రమే సౌకర్యవంతంగా ఉంటాయి. ముందు సీట్లలో కూర్చునే వారికి మాత్రం స్పోర్టీ ఫీల్, పూర్తి కంఫర్ట్ లభిస్తుంది.
హోండా ప్రెల్యూడ్- హైబ్రిడ్ ఇంజిన్: పవర్, మైలేజ్..
హోండా సివిక్ ఈ:హెచ్‌ఈవీలో వాడిన బలమైన హైబ్రిడ్ సాంకేతికతనే ఇందులోనూ ఉపయోగించారు.
ఇంజిన్: 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్, రెండు ఎలక్ట్రిక్ మోటార్ల కలయిక.
పవర్: పెట్రోల్ ఇంజిన్ 139 హెచ్‌పీ పవర్‌ని ఇస్తుండగా, ఎలక్ట్రిక్ మోటార్ అదనంగా 181 హెచ్‌పీ పవర్‌ని, 315 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది.
పర్ఫార్మెన్స్: ఇది కేవలం 8.2 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 188 కి.మీ.
మైలేజ్: ఈ కారు లీటరుకు 23.6 కి.మీ అద్భుతమైన మైలేజీని ఇస్తుంది. ఒకసారి ట్యాంక్ ఫుల్ చేస్తే ఏకంగా 944 కి.మీ వరకు ప్రయాణించవచ్చు.
హోండా ప్రెల్యూడ్- స్పెషల్ ఫీచర్: వర్చువల్ 8-స్పీడ్ గేర్‌బాక్స్
ఈ హోండా ప్రెల్యూడ్‌లో మరో విశేషం S+ Shift టెక్నాలజీ! ఇందులో సంప్రదాయ గేర్‌బాక్స్ ఉండదు. కానీ, ఇది 8-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌ను వర్చువల్ పద్ధతిలో అనుకరిస్తుంది. డ్రైవర్లు ప్యాడిల్ షిఫ్టర్ల ద్వారా గేర్లు మారుస్తున్న ఫీలింగ్‌ను పొందవచ్చు, ఇది డ్రైవింగ్ అనుభవాన్ని మరింత ఉత్సాహంగా మారుస్తుంది.
హోండా ప్రెల్యూడ్- ధర, లాంచ్ వివరాలు
హోండా ప్రిల్యూడ్ కూపే భారత్‌లో సుమారు రూ. 75 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో ఈ మే 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రీమియం సెగ్మెంట్‌లో తన ఉనికిని చాటుకోవడానికి హోండా ప్లాన్ చేస్తున్న గ్లోబల్ మోడళ్లలో ఇది మొదటిది కానుంది.
కాగా ప్రెల్యూడ్ లాంచ్, ధర, ఫీచర్లపై సంస్థ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


