...
...
Next Story

Affordable electric car : హ్యుందాయ్ నుంచి బడ్జెట్​ ఎలక్ట్రిక్​ కారు- టాటా పంచ్​ ఈవీకి పోటీగా..

Hyundai Electric cars : టాటా పంచ్​ ఈవీకి పోటీగా హ్యుందాయ్​ సంస్థ త్వరలోనే ఒక ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని తీసుకురాబోతోంది. ఇది మార్కెట్​లో అఫార్డిబుల్​ ఈవీ సెగ్మెంట్​లో చేరుతుందని సమాచారం. వివరాల్లోకి వెళితే..

Published on: Apr 19, 2026, 14:00:43 IST
Advertisement

Budget electric cars in India : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామిగా ఉన్న టాటా మోటార్స్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు హ్యుందాయ్ ఇండియా సిద్ధమైంది. 'HE1i' అనే కోడ్ నేమ్‌తో ఒక సరికొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని హ్యుందాయ్ అభివృద్ధి చేస్తోంది. 2027 నాటికి భారత రోడ్లపైకి రానున్న ఈ ఎలక్ట్రిక్ కారు.. ముఖ్యంగా టాటా పంచ్ ఈవీని టార్గెట్ చేస్తూ వస్తోంది.

హ్యుందాయ్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు..
హ్యుందాయ్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు..

గతేడాది జరిగిన ఇన్వెస్టర్ డే సమావేశంలో హ్యుందాయ్ తన ఎలక్ట్రిక్ వాహన రోడ్‌మ్యాప్‌ను వెల్లడించింది. ఇందులో భాగంగా భారత్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన బడ్జెట్ ఈవీని తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ కారుకు సంబంధించిన డిజైన్, ఇంజనీరింగ్, తయారీ పూర్తిగా మన దేశంలోనే జరగనుంది. తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ ప్లాంట్ దీనికి ప్రధాన ఉత్పత్తి కేంద్రంగా మారనుంది.

హ్యుందాయ్​ బడ్జెట్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ- డిజైన్, లుక్..

తాజాగా బయటకు వచ్చిన స్పై చిత్రాల ప్రకారం.. ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ చూడటానికి బాక్సీ షేప్‌లో, చాలా బలంగా కనిపిస్తోంది. దీని ప్రధాన ఫీచర్లు ఇవే:

ఎక్స్‌టీరియర్: నిలువుగా ఉండే బాడీ లాంగ్వేజ్, భారీ వీల్ ఆర్చ్‌లు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, స్పోర్టీ రియర్ స్పాయిలర్.

లైటింగ్: వెనుక భాగంలో డాటెడ్ ప్యాటర్న్‌తో కూడిన ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి.

ప్లాట్‌ఫారమ్: ఇది హ్యుందాయ్ అధునాతన 'E-GMP (K)' ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉండవచ్చని సమాచారం.

Electric Scooter : సింగిల్​ ఛార్జ్​తో హైదరాబాద్​ టు ద్వారకా తిరుమల! రేంజ్​లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్​ తోపు..

హ్యుందాయ్​ బడ్జెట్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ- ఇంటర్నేషనల్ మోడల్స్ ప్రభావం?

ఈ హ్యుందాయ్​ బడ్జెట్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ లోపల భాగంలో భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్టడ్ కార్ టెక్నాలజీ ఉండే అవకాశం ఉంది. స్పై షాట్స్ ప్రకారం, ఇందులో 360-డిగ్రీ కెమెరా సెటప్ కూడా ఉంది.

బ్యాటరీ: వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా దీనిని రెండు వేరియంట్లలో (స్టాండర్డ్, లాంగ్ రేంజ్) విడుదల చేసే అవకాశం ఉంది.

పోటీ: ఇది కేవలం టాటా పంచ్ ఈవీకి మాత్రమే కాకుండా, మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఈవీ, రెనాల్ట్ రాబోయే కాంపాక్ట్ ఈవీలకు కూడా పోటీనిస్తుంది.

ఈ హ్యుందాయ్​ బడ్జెట్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ లాంచ్​, ధర, రేంజ్ వంటి వివరాలపై సంస్థ అధికారికంగా స్పందించాల్సి ఉంది.

తరచుగా అడిగే ప్రశ్నలు -

1. హ్యుందాయ్ HE1i ఎప్పుడు లాంచ్ అవుతుంది?

అధికారిక సమాచారం ప్రకారం, ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని 2027లో మార్కెట్​లోకి విడుదల చేయనున్నారు.

2. దీని ధర ఎంత ఉండవచ్చు?

టాటా పంచ్ ఈవీకి పోటీగా వస్తోంది కాబట్టి, దీని ధర రూ. 10 లక్షల నుండి రూ. 15 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండే అవకాశం ఉంది.

3. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎంత దూరం వెళ్తుంది?

ఇది రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తోంది. లాంగ్ రేంజ్ వేరియంట్ సుమారు 350-400 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే అవకాశం ఉందని అంచనా.

4. ఈ కారు ఎక్కడ తయారవుతుంది?

హ్యుందాయ్ తన తమిళనాడు (శ్రీపెరంబుదూర్) ప్లాంట్‌లో ఈ కారును తయారు చేయనుంది. దీని కోసం స్థానికంగా లభించే బ్యాటరీలను వాడనున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe