Upcoming cars in India : భారత ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా ఉన్న హ్యుందాయ్ మోటార్ ఇండియా.. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు రెండు సరికొత్త ఎస్‌యూవీలను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇందులో ఒకటి ప్రస్తుతం యూరోప్‌లో సేల్‌లో ఉన్న ‘బేయన్’పై ఆధారపడిన మిడ్-సైజ్ ఎస్యూవీ కాగా, రెండోది స్థానికంగా అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్యూవీ. ఇప్పుడందరి ఫోకస్ ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీపై పడింది. ముఖ్యంగా వెన్యూ, క్రెటా మోడళ్ల మధ్య ఉన్న భారీ ధర, సైజు వ్యత్యాసాన్ని భర్తీ చేయడమే ఈ దీని ప్రధాన లక్ష్యం. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
డిజైన్, పరిమాణం..

ఈ కొత్త మోడల్ 4 మీటర్ల కంటే తక్కువ పొడవు ఉండి మారుతీ ఫ్రాంక్స్‌కు పోటీగా వస్తుందని గతంలో భావించారు. కానీ, తాజా సమాచారం ప్రకారం ఈ హ్యుందాయ్ బేయన్ ఆధారిత ఎస్యూవీ 4.2 మీటర్ల పొడవుతో ఉండనుంది.
లుక్: హ్యుందాయ్ లేటెస్ట్ "సెన్సువస్ స్పోర్టినెస్" డిజైన్ లాంగ్వేజ్‌తో, బాక్సీ ఆకారంలో మరింత ఎత్తుగా కనిపిస్తుంది.
ఫీచర్లు: స్ల్పిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, ఐస్-క్యూబ్ ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, హై-మౌంటెడ్ డీఆర్ఎల్స్ దీనికి ప్రీమియం లుక్ ఇస్తాయి. అలాగే 16- ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్, కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్లతో ఇది ముస్తాబవుతోంది.
తొలిసారిగా డ్యూయల్ సిలిండర్ సీఎన్జీ..
హ్యుందాయ్ నుంచి రాబోతున్న ఈ 'Bc4i' (కోడ్ నేమ్) ఎస్‌యూవీలో అత్యంత ఆసక్తికరమైన అంశం దీని పవర్‌ట్రెయిన్. 4 మీటర్ల కంటే ఎక్కువ పొడవున్న హ్యుందాయ్ కార్లలో సీఎన్జీ వేరియంట్‌తో వస్తున్న మొదటి మోడల్ ఇదే కానుంది. ఇందులో టాటా కార్ల తరహాలో 'డ్యూయల్ సిలిండర్' సెటప్‌ను అందించనున్నారు, దీనివల్ల బూట్ స్పేస్ (డిక్కీ)లో ఎక్కువ స్థలం లభిస్తుంది.
ఇది నేరుగా మార్కెట్లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న మారుతీ సుజుకీ విక్టోరిస్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది.
ఇంజిన్, ట్రాన్స్మిషన్..
{{/usCountry}}ఇది నేరుగా మార్కెట్లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న మారుతీ సుజుకీ విక్టోరిస్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది.
ఇంజిన్, ట్రాన్స్మిషన్..
{{/usCountry}}ఈ ఎస్‌యూవీలో వివిధ రకాల ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది:
1.5ఎల్ పెట్రోల్: 114బీహెచ్పీ పవర్, 144ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్, సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జత చేస్తారు.
టర్బో పెట్రోల్: పనితీరును మెరుగుపరిచేందుకు 1.5ఎల్ టర్బో లేదా సరికొత్త 1.2ఎల్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వచ్చే ఛాన్స్ ఉంది.
డీజిల్: కస్టమర్ల డిమాండ్ మేరకు డీజిల్ వేరియంట్ కూడా లైన్-అప్‌లో చేరవచ్చు.
టెక్నాలజీ, సేఫ్టీ..
మారుతీ సుజుకీ అనుసరిస్తున్న మల్టిపుల్ ఎస్యూవీ స్ట్రాటజీని (విక్టోరిస్, గ్రాండ్ విటారా) ఇప్పుడు హ్యుందాయ్ కూడా అమలు చేస్తోంది. ఈ కొత్త మిడ్ సైజ్ ఎస్‌యూవీలో అత్యాధునిక ఇంటీరియర్‌తో పాటు అత్యున్నత భద్రత కోసం అడాస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్లను కూడా చేర్చనున్నారు. కోల్పోయిన మార్కెట్ వాటాను తిరిగి దక్కించుకోవడమే లక్ష్యంగా హ్యుందాయ్ ఈ ఎత్తుగడ వేస్తోంది.
ఈ మోడల్ 2027 మార్చ్‌లోపు లాంచ్ అవ్వొచ్చని తెలుస్తోంది.