హ్యుందాయ్ మోటార్ ఇండియా తన ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిని విస్తరించే పనిలో వేగంగా నిమగ్నమైంది. ఈ ఏడాది ప్రారంభంలో ముంబైలో కనిపించిన హ్యుందాయ్ కొత్త సబ్-4 మీటర్ ఎస్‌యూవీ.. తాజాగా గోవా వీధుల్లో ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ప్రత్యక్షమైంది. ఈ కొత్త ఈవీకి సంబంధించిన ఆసక్తికరమైన వివరాలు ఇక్కడ ఉన్నాయి..
హ్యుందాయ్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు..
ధరల వ్యత్యాసాన్ని తగ్గించే వ్యూహం-

ప్రస్తుతం హ్యుందాయ్ విక్రయిస్తున్న ఈవీల మధ్య ధరలో భారీ వ్యత్యాసం ఉంది.
క్రెటా ఎలక్ట్రిక్: రూ. 18.02 లక్షల నుంచి రూ. 24.70 లక్షలు (ఎక్స్-షోరూమ్).
ఐయోనిక్ 5 : రూ. 46.30 లక్షలు (ఎక్స్-షోరూమ్).
వీటిన్నా తక్కువ ధరలో, సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఈ కొత్త సబ్-4 మీటర్ ఈవీని హ్యుందాయ్ తీసుకురాబోతోంది.
హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ కారు- భారతదేశంలోనే స్వయంగా అభివృద్ధి..
ఈ కొత్త ఈవీకి ఒక ప్రత్యేకత ఉంది! ఇది పూర్తిగా భారతదేశంలోనే గ్రౌండ్-అప్ నుంచి అభివృద్ధి చేసిన మొదటి హ్యుందాయ్ ఎలక్ట్రిక్ వాహనం కావచ్చని తెలుస్తోంది. అయితే, ఇది ప్రత్యేకమైన 'బోర్న్ ఎలక్ట్రిక్' ప్లాట్‌ఫారమ్‌పై వస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు.
హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ కారు- డిజైన్, ఫీచర్లు..
{{/usCountry}}ఈ కొత్త ఈవీకి ఒక ప్రత్యేకత ఉంది! ఇది పూర్తిగా భారతదేశంలోనే గ్రౌండ్-అప్ నుంచి అభివృద్ధి చేసిన మొదటి హ్యుందాయ్ ఎలక్ట్రిక్ వాహనం కావచ్చని తెలుస్తోంది. అయితే, ఇది ప్రత్యేకమైన 'బోర్న్ ఎలక్ట్రిక్' ప్లాట్‌ఫారమ్‌పై వస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు.
హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ కారు- డిజైన్, ఫీచర్లు..
{{/usCountry}}టెస్టింగ్ సమయంలో కనిపించిన వివరాల ప్రకారం.. కియా సైరోస్ తరహాలో ఈ కారు బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంది.
ఎక్స్‌టీరియర్: మెరుగైన ఎయిరోడైనమిక్స్, ఎఫీషియన్సీ కోసం ప్రత్యేకమైన 'ఎయిరో-ఇన్‌స్పైర్డ్' అలాయ్ వీల్స్‌ను దీనికి అమర్చారు.
ఇంటీరియర్: క్యాబిన్‌లో సరికొత్త డ్యూయల్-స్క్రీన్ లేఅవుట్ (ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ కోసం) ఉండే అవకాశం ఉంది.
కనెక్టివిటీ: వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే ఫీచర్లు ఉంటాయి.
స్టీరింగ్ వీల్: వేన్యూ, వెర్నా మోడళ్లలో చూసినట్లుగా, హ్యుందాయ్ లోగోకు బదులుగా 'నాలుగు చుక్కలు' (Morse code for 'H') కలిగిన త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్ ఇందులో ఉండవచ్చు.
హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ కారు- పోటీ..
ఈ ఈవీని 2026కి చివరి నాటికి లేదా 2027లో లాంచ్ చేసేందుకు సంస్థ ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. భారత మార్కెట్లో విడుదలైన తర్వాత, ఇది ప్రధానంగా టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఈవీలతో తలపడనుంది.
ఈ హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ కారు పేరు, ధరతో పాటు ముఖ్యమైన రేంజ్ వంటి వివరాలపై సంస్థ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. రానున్న రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.