ఐడీబీఐ బ్యాంక్ (IDBI Bank) మెజారిటీ వాటాలను ప్రైవేట్ సంస్థకు విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర దుమారం రేపుతోంది. ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆందోళన బాట పట్టిన ఐడీబీఐ బ్యాంక్ ఉద్యోగులకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో అక్టోబర్ 29న బ్యాంక్ ఉద్యోగులకు ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు. తీవ్ర నష్టాల్లో ఉన్న బ్యాంకును లాభాల బాట పట్టించిన ఉద్యోగుల శ్రమను పక్కనపెట్టి, బ్యాంకును ప్రైవేట్ పరం చేయడం వెనుక గల కారణాలను రాహుల్ ప్రశ్నించారు.
"ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేట్ యాజమాన్యం చేతుల్లోకి వెళితే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు దక్కాల్సిన రిజర్వేషన్ హక్కులు తుడిచిపెట్టుకుపోతాయి. ఇప్పటికే బలహీనపడిన సర్వీసు నిబంధనలు తమ చివరి రక్షణ కవచాన్ని కూడా కోల్పోతాయి" అని రాహుల్ గాంధీ లేఖలో తీవ్ర ఆందోళన వ్యక్తపరిచారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే నిలిపివేసి, పార్లమెంటరీ పర్యవేక్షణలో సమగ్ర సమీక్ష చేపట్టాలని 'యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ ఐడీబీఐ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్' డిమాండ్ చేస్తున్న తరుణంలో రాహుల్ గాంధీ లేఖ విడుదల కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
లాభాల్లోకి తెచ్చినా ప్రైవేటీకరణేనా?
ఏడేళ్ల క్రితం తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన ఐడీబీఐ బ్యాంకును పునర్నిర్మించడంలో ఉద్యోగుల పాత్ర ప్రశంసనీయమని రాహుల్ గాంధీ కొనియాడారు. గతేడాది ఈ బ్యాంక్ రూ. 9,000 కోట్లకు పైగా నికర లాభాన్ని గడించిందని ఆయన గుర్తు చేశారు. అంతటి ఘనమైన ఆర్థిక పురోగతిని సాధించిన ప్రభుత్వ రంగానికి చెందిన సుదృఢమైన సంస్థను విదేశీ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా 2003లో పార్లమెంట్‌లో ఇచ్చిన హామీని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. నాటి కేంద్ర ఆర్థిక మంత్రి జస్వంత్ సింగ్ మాట్లాడుతూ, ఐడీబీఐలో ప్రభుత్వ వాటా కనీసం 51 శాతం తగ్గకుండా చూస్తామని పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేశారని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత విక్రయ ఒప్పందం ప్రకారం కేంద్ర ప్రభుత్వం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) తమ మెజారిటీ వాటాలను భారీగా తగ్గించుకుని, యాజమాన్య హక్కులను ప్రైవేట్ కొనుగోలుదారుకు అప్పగిస్తున్నాయని ధ్వజమెత్తారు.
ఉద్యోగుల ఆందోళన
కెనడాకు చెందిన బిలియనీర్ ప్రేమ్ వత్సకు చెందిన 'ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్' (Fairfax Financial Holdings) అనుబంధ సంస్థకు ఐడీబీఐ బ్యాంక్ మెజారిటీ వాటాలను విక్రయించడాన్ని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ ఐడీబీఐ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ తీవ్రంగా ఖండించింది. ఈ విక్రయ ప్రక్రియను తక్షణమే నిలిపివేసి, పారదర్శకతతో వ్యవహరించాలని డిమాండ్ చేసింది. మారుతున్న మార్కెట్ పరిస్థితుల మధ్య ఈ నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని ఫోరమ్ కన్వీనర్ దేవిదాస్ తుల్జాపూర్కర్ వ్యాఖ్యానించారు.
{{/usCountry}}కెనడాకు చెందిన బిలియనీర్ ప్రేమ్ వత్సకు చెందిన 'ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్' (Fairfax Financial Holdings) అనుబంధ సంస్థకు ఐడీబీఐ బ్యాంక్ మెజారిటీ వాటాలను విక్రయించడాన్ని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ ఐడీబీఐ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ తీవ్రంగా ఖండించింది. ఈ విక్రయ ప్రక్రియను తక్షణమే నిలిపివేసి, పారదర్శకతతో వ్యవహరించాలని డిమాండ్ చేసింది. మారుతున్న మార్కెట్ పరిస్థితుల మధ్య ఈ నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని ఫోరమ్ కన్వీనర్ దేవిదాస్ తుల్జాపూర్కర్ వ్యాఖ్యానించారు.
{{/usCountry}}బ్యాంకుకు ఉన్న ఆస్తులు, సంస్థాగత సామర్థ్యం, కస్టమర్లతో ఉన్న బంధం, భవిష్యత్ రాబడులు, వ్యూహాత్మక ప్రాముఖ్యతను సరిగ్గా లెక్కించకుండా తక్కువ ధరకు కట్టబెడుతున్నారనే ఆందోళనను ఫోరమ్ వ్యక్తం చేసింది. బ్యాంక్ ఆస్తులు, రియల్ ఎస్టేట్ మూల్యాంకన పద్ధతులను (Valuation Methodology), ఏ ప్రాతిపదికన ప్రభుత్వం ఈ ధరకు అంగీకరించిందో బహిర్గతం చేయాలని కోరింది. అలాగే కొనుగోలుదారు యజమాన్య వ్యవస్థ, ఆర్థిక సామర్థ్యం, రెగ్యులేటరీ రికార్డులను పారదర్శకంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది.
"ఒక ప్రముఖ భారతీయ బ్యాంక్ యాజమాన్య బదిలీలో ప్రజలకు జవాబుదారీతనం వహించడానికి కేవలం నిబంధనల ఆమోదాలు సరిపోవు" అని ఫోరమ్ స్పష్టం చేసింది. ఐడీబీఐని బ్యాంకింగ్ కంపెనీగా మార్చినప్పుడు ఇచ్చిన హామీకి, ప్రస్తుత విక్రయ నిర్ణయానికి ఉన్న పొంతనపై ప్రభుత్వం పార్లమెంట్‌కు, ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది.
రిజర్వేషన్లు, ఉద్యోగ భద్రతపై ప్రభావం
ఈ విక్రయ నిర్ణయం బ్యాంకింగ్ వ్యవస్థ సామాజిక బాధ్యతలపై, ఉద్యోగుల సేవా నిబంధనలపై, రిజర్వేషన్ విధానాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఐడీబీఐ బ్యాంకులో ప్రస్తుతం మొత్తం 19,108 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన వారు 9,500 మంది ఉన్నారు. వీరితో పాటు 6,911 మంది మహిళా ఉద్యోగులు, 884 మంది దివ్యాంగులు బ్యాంకులో సేవలు అందిస్తున్నారు.
ప్రైవేట్ యాజమాన్యానికి బాధ్యతలు అప్పగించే ముందే వెనుకబడిన వర్గాల ప్రయోజనాలు, ఉద్యోగ భద్రత, వర్తించే సేవా నిబంధనలు, ఆర్థిక చేరిక (Financial Inclusion) వంటి సామాజిక బాధ్యతలను పరిగణనలోకి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.
రూ. 52,878 కోట్ల విక్రయ డీల్ వివరాలు
అక్టోబర్ 14న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఐడీబీఐ బ్యాంకులోని 60.72 శాతం నియంత్రణ వాటాను విక్రయించేందుకు ఆమోదం లభించింది. ఈ లావాదేవీ మొత్తం విలువ రూ. 52,878 కోట్లు (సుమారు 5.56 బిలియన్ డాలర్లు). ఈ ఒప్పందం ప్రకారం కేంద్ర ప్రభుత్వం తనకున్న 30.48 శాతం వాటాను (సుమారు రూ. 26,620 కోట్లు), ఎల్ఐసీ తనకున్న 30.24 శాతం వాటాను (సుమారు రూ. 26,440 కోట్లు) కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ సంస్థకు విక్రయించనున్నాయి.