దేశంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో ఒకటైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీ-హెచ్), గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం 'సమ్మర్ అండర్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ఎక్స్‌పోజర్' (ష్యూర్-2026) పేరుతో ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని కల్పిస్తోంది. పరిశోధనా రంగంలో ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఇది ఒక అద్భుతమైన వేదిక.

ఈ నేపథ్యంలో ఈ ఐఐటీ హైదరాబాద్ ఇంటర్న్‌షిప్ 2026కి సంబంధించిన కీలక వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఐఐటీ హైదరాబాద్ ఇంటర్న్‌షిప్ 2026- ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తు ప్రారంభం: ఫిబ్రవరి 28, 2026
దరఖాస్తుకు ఆఖరి తేదీ: మార్చ్ 10, 2026
ఫలితాల ప్రకటన (తాత్కాలికంగా): ఏప్రిల్ 15, 2026
ఇంటర్న్‌షిప్ ప్రారంభం: మే 15, 2026
ఐఐటీ హైదరాబాద్ ఇంటర్న్‌షిప్ 2026- సీట్ల వివరాలు, స్టైఫండ్..
ఈ ఏడాది మొత్తం 250 సీట్లను కేటాయించగా, అందులో 100 సీట్లు మహిళా విద్యార్థినుల కోసం ప్రత్యేకించారు. ఐఐటీ హైదరాబాద్ ఇంటర్న్‌షిప్ 2026 వ్యవధిని బట్టి స్టైఫండ్ ఈ కింది విధంగా ఉంటుంది:
రెండు నెలల పూర్తి కాలానికి: రూ. 15,000
ఒకటిన్నర నెల కాలానికి: రూ. 10,000
ఒక నెల కాలానికి: రూ. 7,500
(గమనిక: పైన పేర్కొన్న స్టైఫండ్ మినహా ఇతర అలవెన్సులు లేదా ప్రయోజనాలు ఉండవు.)
ఐఐటీ హైదరాబాద్ ఇంటర్న్‌షిప్ 2026- అర్హత ప్రమాణాలు..
ఈ అవకాశం కేవలం ఐఐటీ హైదరాబాద్ వెలుపల చదువుతున్న విద్యార్థులకు మాత్రమే. దరఖాస్తుదారులు ఈ కింది అర్హతలను కలిగి ఉండాలి:
కోర్సులు: మొదటి సంవత్సరం ఎంఎస్సీ (మ్యాథ్స్/ఫిజిక్స్/కెమిస్ట్రీ/బయాలజీ) లేదా ఎంఏ విద్యార్థులు; రెండు లేదా మూడవ సంవత్సరం బీటెక్/ బీడీఈఎస్ విద్యార్థులు; మూడు లేదా నాలుగవ సంవత్సరం ఇంటిగ్రేటెడ్ బీటెక్- ఎంటెక్ విద్యార్థులు.
{{/usCountry}}కోర్సులు: మొదటి సంవత్సరం ఎంఎస్సీ (మ్యాథ్స్/ఫిజిక్స్/కెమిస్ట్రీ/బయాలజీ) లేదా ఎంఏ విద్యార్థులు; రెండు లేదా మూడవ సంవత్సరం బీటెక్/ బీడీఈఎస్ విద్యార్థులు; మూడు లేదా నాలుగవ సంవత్సరం ఇంటిగ్రేటెడ్ బీటెక్- ఎంటెక్ విద్యార్థులు.
{{/usCountry}}అకాడమిక్ మెరిట్: అభ్యర్థులు తమ విభాగంలో టాప్ 20 శాతం ర్యాంక్‌లో ఉండాలి (సీజీపీఏ/శాతం ఆధారంగా). దీనిని సంబంధిత కాలేజీ ప్రిన్సిపల్ లేదా హెడ్ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూషన్ ధృవీకరించాలి.
స్థితి: ఐఐటీ హైదరాబాద్ ఇంటర్న్‌షిప్ 2026 దరఖాస్తు చేసే సమయంలో, ఇంటర్న్‌షిప్ పూర్తయ్యే వరకు రెగ్యులర్ విద్యార్థిగా కొనసాగుతూ ఉండాలి.
విధానం: ఇది పూర్తిగా ఆఫ్‌లైన్ ఇంటర్న్‌షిప్. ఆన్‌లైన్ లేదా పార్ట్-టైమ్ ఆప్షన్లు లేవు.
ఐఐటీ హైదరాబాద్ ఇంటర్న్‌షిప్ 2026- ఎంపిక ప్రక్రియ..
ఐఐటీ హైదరాబాద్ ఇంటర్న్‌షిప్ 2026 దరఖాస్తులను స్వీకరించిన తర్వాత అధికారులు ప్రాథమిక స్క్రూటినీ నిర్వహిస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఎంపికలో ఈ కింది అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు:
అకాడమిక్ రికార్డులు, క్లాస్ ర్యాంక్.
రెగ్యులర్ సిలబస్ కాకుండా అదనంగా చేసిన ప్రాజెక్టులు/పనులు.
ఒలింపియాడ్స్, నేషనల్ టాలెంట్ సెర్చ్ వంటి పోటీ పరీక్షల్లో సాధించిన విజయాలు.
ఇంటర్వ్యూలో కనబరిచిన ప్రతిభ.
ఐఐటీ హైదరాబాద్ ఇంటర్న్‌షిప్ 2026- దరఖాస్తు చేయడం ఎలా?
ఆసక్తి గల విద్యార్థులు ఐఐటీ హైదరాబాద్ అధికారిక వెబ్‌సైట్ iith.ac.in సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారికి కేవలం ఈమెయిల్ ద్వారానే సమాచారం అందుతుంది. అలాగే తుది జాబితాను వెబ్‌సైట్‌లోని ఎస్ఆర్సీ ఆఫీస్ వెబ్‌పేజీలో (News/Announcements విభాగం) ఉంచుతారు.
మరిన్ని వివరాల కోసం ఐఐటీ హైదరాబాద్ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాల్సి ఉంటుంది.
డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.