IIT Hyderabad Internship 2026 : నెలకు రూ. 15వేల వరకు స్టైఫండ్‌తో ఐఐటీ హైదరాబాద్‌లో ఇంటర్న్‌షిప్..
IIT Hyderabad SURE : ఐఐటీ హైదరాబాద్ ప్రతిష్టాత్మక 'SURE-2026' సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు గరిష్టంగా రూ. 15,000 వరకు స్టైఫండ్ లభిస్తుంది. మార్చి 10వ తేదీ దరఖాస్తుకు ఆఖరి గడువు. పూర్తి అర్హతలు, ఎంపిక విధానం ఇక్కడ తెలుసుకోండి..
దేశంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో ఒకటైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీ-హెచ్), గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం 'సమ్మర్ అండర్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ఎక్స్‌పోజర్' (ష్యూర్-2026) పేరుతో ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని కల్పిస్తోంది. పరిశోధనా రంగంలో ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఇది ఒక అద్భుతమైన వేదిక.

ఈ నేపథ్యంలో ఈ ఐఐటీ హైదరాబాద్ ఇంటర్న్‌షిప్ 2026కి సంబంధించిన కీలక వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఐఐటీ హైదరాబాద్ ఇంటర్న్‌షిప్ 2026- ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తు ప్రారంభం: ఫిబ్రవరి 28, 2026
దరఖాస్తుకు ఆఖరి తేదీ: మార్చ్ 10, 2026
ఫలితాల ప్రకటన (తాత్కాలికంగా): ఏప్రిల్ 15, 2026
ఇంటర్న్‌షిప్ ప్రారంభం: మే 15, 2026
ఐఐటీ హైదరాబాద్ ఇంటర్న్‌షిప్ 2026- సీట్ల వివరాలు, స్టైఫండ్..
ఈ ఏడాది మొత్తం 250 సీట్లను కేటాయించగా, అందులో 100 సీట్లు మహిళా విద్యార్థినుల కోసం ప్రత్యేకించారు. ఐఐటీ హైదరాబాద్ ఇంటర్న్‌షిప్ 2026 వ్యవధిని బట్టి స్టైఫండ్ ఈ కింది విధంగా ఉంటుంది:
రెండు నెలల పూర్తి కాలానికి: రూ. 15,000
ఒకటిన్నర నెల కాలానికి: రూ. 10,000
ఒక నెల కాలానికి: రూ. 7,500
(గమనిక: పైన పేర్కొన్న స్టైఫండ్ మినహా ఇతర అలవెన్సులు లేదా ప్రయోజనాలు ఉండవు.)
ఐఐటీ హైదరాబాద్ ఇంటర్న్‌షిప్ 2026- అర్హత ప్రమాణాలు..
ఈ అవకాశం కేవలం ఐఐటీ హైదరాబాద్ వెలుపల చదువుతున్న విద్యార్థులకు మాత్రమే. దరఖాస్తుదారులు ఈ కింది అర్హతలను కలిగి ఉండాలి:
కోర్సులు: మొదటి సంవత్సరం ఎంఎస్సీ (మ్యాథ్స్/ఫిజిక్స్/కెమిస్ట్రీ/బయాలజీ) లేదా ఎంఏ విద్యార్థులు; రెండు లేదా మూడవ సంవత్సరం బీటెక్/ బీడీఈఎస్ విద్యార్థులు; మూడు లేదా నాలుగవ సంవత్సరం ఇంటిగ్రేటెడ్ బీటెక్- ఎంటెక్ విద్యార్థులు.
అకాడమిక్ మెరిట్: అభ్యర్థులు తమ విభాగంలో టాప్ 20 శాతం ర్యాంక్‌లో ఉండాలి (సీజీపీఏ/శాతం ఆధారంగా). దీనిని సంబంధిత కాలేజీ ప్రిన్సిపల్ లేదా హెడ్ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూషన్ ధృవీకరించాలి.
స్థితి: ఐఐటీ హైదరాబాద్ ఇంటర్న్‌షిప్ 2026 దరఖాస్తు చేసే సమయంలో, ఇంటర్న్‌షిప్ పూర్తయ్యే వరకు రెగ్యులర్ విద్యార్థిగా కొనసాగుతూ ఉండాలి.
విధానం: ఇది పూర్తిగా ఆఫ్‌లైన్ ఇంటర్న్‌షిప్. ఆన్‌లైన్ లేదా పార్ట్-టైమ్ ఆప్షన్లు లేవు.
ఐఐటీ హైదరాబాద్ ఇంటర్న్‌షిప్ 2026- ఎంపిక ప్రక్రియ..
ఐఐటీ హైదరాబాద్ ఇంటర్న్‌షిప్ 2026 దరఖాస్తులను స్వీకరించిన తర్వాత అధికారులు ప్రాథమిక స్క్రూటినీ నిర్వహిస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఎంపికలో ఈ కింది అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు:
అకాడమిక్ రికార్డులు, క్లాస్ ర్యాంక్.
రెగ్యులర్ సిలబస్ కాకుండా అదనంగా చేసిన ప్రాజెక్టులు/పనులు.
ఒలింపియాడ్స్, నేషనల్ టాలెంట్ సెర్చ్ వంటి పోటీ పరీక్షల్లో సాధించిన విజయాలు.
ఇంటర్వ్యూలో కనబరిచిన ప్రతిభ.
ఐఐటీ హైదరాబాద్ ఇంటర్న్‌షిప్ 2026- దరఖాస్తు చేయడం ఎలా?
ఆసక్తి గల విద్యార్థులు ఐఐటీ హైదరాబాద్ అధికారిక వెబ్‌సైట్ iith.ac.in సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారికి కేవలం ఈమెయిల్ ద్వారానే సమాచారం అందుతుంది. అలాగే తుది జాబితాను వెబ్‌సైట్‌లోని ఎస్ఆర్సీ ఆఫీస్ వెబ్‌పేజీలో (News/Announcements విభాగం) ఉంచుతారు.
మరిన్ని వివరాల కోసం ఐఐటీ హైదరాబాద్ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాల్సి ఉంటుంది.
డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper












