...
...
Next Story

ఎనర్జీ సెక్టార్‌లో కనువిందు చేస్తున్న భారీ చాన్స్.. మదుపరులకు ఇది పండగే

భారత ఎనర్జీ సెక్టార్ పెట్టుబడుల విప్లవానికి వేదికవుతోంది. కేవలం విద్యుత్ ఉత్పత్తికే పరిమితం కాకుండా, రాబోయే దశాబ్దంలో దాదాపు రూ. 30 నుంచి రూ.40 లక్షల కోట్ల మేర భారీ మూలధన వ్యయం (Capex) జరగనుందని కోటక్ మ్యూచువల్ ఫండ్ ఫండ్ మేనేజర్ మందార్ పవార్ తెలిపారు. ఆయన అందించిన ప్రత్యేక విశ్లేషణ.

Published on: Sep 8, 2026, 16:31:28 IST
Advertisement

భారతదేశ విద్యుత్తు రంగం దేశ చరిత్రలోనే అతిపెద్ద పెట్టుబడుల చక్రంలోకి అడుగుపెడుతోంది. గతంలో మాదిరిగా ఇది కేవలం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రస్తుతం జరుగుతున్న మార్పు చాలా విస్తృతమైనది, అత్యంత లోతైనది. పెరిగిన విద్యుత్ డిమాండ్, స్వచ్ఛమైన ఇంధనం (Clean Energy) వైపు వేగంగా మళ్లుతున్న అడుగులు, వీటితో పాటు దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా వ్యవస్థను (Transmission & Distribution - T&D) బలోపేతం చేయాల్సిన అత్యవసర పరిస్థితులు ఈ రంగాన్ని పరుగులు తీస్తున్నాయ్‌.

టక్ మ్యూచువల్ ఫండ్ ఫండ్ మేనేజర్ మందార్ పవార్
టక్ మ్యూచువల్ ఫండ్ ఫండ్ మేనేజర్ మందార్ పవార్

ఇటీవల జరిగిన 'భారత్ ఎలక్ట్రిసిటీ సమ్మిట్ 2026'లో విద్యుత్ మంత్రిత్వ శాఖ ఒక సంచలన విషయాన్ని అంచనా వేసింది. రాబోయే రెండు దశాబ్దాల్లో దేశీయ విద్యుత్ రంగానికి ఏకంగా రూ.200 లక్షల కోట్ల (సుమారు 2 ట్రిలియన్ డాలర్లు) పెట్టుబడులు అవసరమవుతాయని స్పష్టం చేసింది. దీర్ఘకాలికంగా చూస్తే ఇది ఎంతటి భారీ లక్ష్యమో అర్థమవుతుంది. అయితే వివిధ పారిశ్రామిక అధ్యయనాల ప్రకారం, కేవలం రాబోయే దశాబ్దంలోనే పవర్ జనరేషన్, ట్రాన్స్‌మిషన్, పునరుత్పాదక ఇంధనం, ఎనర్జీ స్టోరేజ్, గ్రిడ్ ఆధునీకరణ రంగాల్లో దాదాపు రూ.30 లక్షల కోట్ల నుంచి రూ.40 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వెల్లువెత్తనున్నాయి. ఇది గత దశాబ్దంలో వచ్చిన పెట్టుబడుల కంటే రెట్టింపు. ఈ మార్పు భారత పారిశ్రామిక రంగాన్నే పూర్తిగా మార్చివేసే అవకాశం ఉంది.

విద్యుత్ డిమాండ్‌లో మైలురాళ్లు

ఈ భారీ అవకాశానికి అసలైన చోదక శక్తి మన దేశంలో నిరంతరం పెరుగుతున్న విద్యుత్ డిమాండ్. వేగవంతమైన పట్టణీకరణ, పారిశ్రామిక ప్రగతి, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడం, డేటా సెంటర్లు, డిజిటల్ మౌలిక వసతుల విస్తరణ కారణంగా భారత్‌లో విద్యుత్ వినియోగం ప్రపంచంలోనే అత్యధిక వేగంతో పెరుగుతోంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (CEA) దీర్ఘకాలిక అంచనాల ప్రకారం.. 2035-36 నాటికి దేశంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ (Peak Power Demand) 450 గిగావాట్లకు (GW) చేరుకోనుంది. ఇటీవలే రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ 270 గిగావాట్లకు చేరిన విషయం తెలిసిందే.

విద్యుత్ రంగంలో పెట్టుబడులంటే కేవలం సోలార్ ప్యానెళ్లు, పవన్ విద్యుత్ టర్బైన్లు మాత్రమే కాదు. ఏ పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టు నిర్మించినా, ఆ విద్యుత్ వినియోగదారులకు చేరాలంటే సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ట్రాన్స్‌మిషన్ లైన్లు, స్టోరేజ్ వ్యవస్థలు అత్యంత కీలకం. జాతీయ విద్యుత్ ప్రణాళిక (National Electricity Plan) అంచనా ప్రకారం, పునరుత్పాదక ఇంధనం ఎక్కువగా ఉత్పత్తి అయ్యే రాష్ట్రాల నుంచి విద్యుత్ అవసరం ఉన్న ప్రాంతాలకు కారిడార్లు నిర్మించడానికి, కేవలం ట్రాన్స్‌మిషన్ రంగంలోనే రూ.9 లక్షల కోట్లకు పైగా ఖర్చు కానుంది.

ఇది పవర్ సప్లై చైన్ వ్యాప్తంగా సరికొత్త డిమాండ్‌ను సృష్టిస్తోంది. ఒకవైపు గ్రీన్ ఎనర్జీ సామర్థ్యాన్ని పెంచుతూనే, మరోవైపు వ్యవస్థ స్థిరత్వం కోసం సాంప్రదాయ థర్మల్ పవర్ కెపాసిటీని కూడా కొనసాగిస్తుండటంతో విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు (Power Generators) నూతన వృద్ధి బాట పట్టాయి. పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు (Utilities) ప్రభుత్వ నియంత్రణల మద్దతు, స్మార్ట్ గ్రిడ్లు, స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో ఊరట లభిస్తోంది. ఇక ట్రాన్స్‌ఫార్మర్లు, స్విచ్‌గేర్లు, కేబుళ్లు సరఫరా చేసే ఎక్విప్‌మెంట్ తయారీదారులు భారీ ఆర్డర్లతో దూసుకుపోతున్నారు.

ఎనర్జీ స్టోరేజ్.. గ్రీన్ హైడ్రోజన్ హవా

పునరుత్పాదక ఇంధనంతో పాటు 'ఎనర్జీ స్టోరేజ్' అత్యంత కీలకమైన అనుబంధ రంగంగా మారుతోంది. పగలు లభించే సౌర విద్యుత్‌ను లేదా గాలులు వీచినప్పుడు వచ్చే పవన్ విద్యుత్‌ను భద్రపరిచి, అవసరమైనప్పుడు వాడుకోవడానికి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS) గ్రిడ్ స్థిరత్వానికి అత్యంత ఆవశ్యకంగా మారాయి.

దీనితో పాటు గ్రీన్ హైడ్రోజన్ రంగం కొత్త తరం అవకాశాలను అందిస్తోంది. కార్బన్ రహిత ఇంధన ఉత్పత్తిలో భారత్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులతో, 125 గిగావాట్ల కేటాయించిన పునరుత్పాదక శక్తి మద్దతుతో ఏడాదికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇక అణు విద్యుత్ (Nuclear Energy) రంగానికి కూడా ప్రభుత్వం పునరుజ్జీవం పోస్తోంది. ప్రస్తుతం ఉన్న 9 గిగావాట్ల సామర్థ్యాన్ని 2047 నాటికి 100 గిగావాట్లకు పెంచాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన 'శాంతి' (SHANTI) చట్టం ద్వారా 2047 నాటికి దాదాపు రూ.20 లక్షల కోట్ల భారీ కేపెక్స్ (Capex) అవకాశాలు లభించనున్నాయి.

ఇన్వెస్టర్లకు మల్టీ-బాగర్ అవకాశాలు

షేర్ మార్కెట్ మదుపరులకు ఇది ఒకే ఒక రంగానికి పరిమితమైన అవకాశం కాదు. విద్యుత్ యుటిలిటీస్, పవర్ ఫైనాన్షియర్లు, ట్రాన్స్‌మిషన్ కంపెనీలు, ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులు, కేబుల్స్, కండక్టర్ల సరఫరాదారులు, ఆటోమేషన్ సర్వీస్ ప్రొవైడర్లు, బ్యాటరీ తయారీదారులు, ఇంజనీరింగ్ (EPC) సంస్థలు.. ఇలా పవర్ ఎకోసిస్టమ్ అంతటా విజేతలు వెలసొచ్చే అవకాశం ఉంది.

ఈ కేపెక్స్ చక్రం ప్రాథమిక సూత్రం కేవలం ఎక్కువ విద్యుత్‌ను తయారు చేయడం మాత్రమే కాదు.. శుభ్రమైన, డిజిటలైజ్డ్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ కోసం భారత్ తన విద్యుత్ రంగాన్ని కొత్తగా పునర్నిర్మిస్తోంది. రాబోయే దశాబ్ద కాలంలో భారత ఈక్విటీ మార్కెట్లలో అత్యంత బలమైన దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్ థీమ్‌గా ఇది నిలవడం ఖాయం.

- మందార్ పవార్,

ఫండ్ మేనేజర్,

కోటక్ మ్యూచువల్ ఫండ్

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks