భారత రక్షణ రంగం మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా, సముద్ర గర్భం నుంచి అణు దాడులు చేయగల ‘కే-4’ (K-4) క్షిపణిని డీఆర్డీఓ (DRDO) విజయవంతంగా పరీక్షించింది. డిసెంబర్ 23న బంగాళాఖాతంలో స్వదేశీ అణు జలాంతర్గామి ‘ఐఎన్ఎస్ అరిఘాత్’ (INS Arighaat) నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.
అణు త్రయం దిశగా కీలక అడుగు

భూమి, ఆకాశం, సముద్రం.. ఈ మూడు మార్గాల నుంచి అణు దాడులను ఎదుర్కొనేలా ‘అణు త్రయం’ (Nuclear Triad) సామర్థ్యాన్ని సిద్ధం చేసుకోవడంలో భారత్ తుది దశకు చేరుకుంది. 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ కే-4 క్షిపణులను మరికొన్ని పరీక్షల అనంతరం స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ (SFC)కు అప్పగించనున్నారు.
చైనా నిఘా నౌకల కలకలం.. వ్యూహాత్మక ఆలస్యం
నిజానికి ఈ పరీక్ష డిసెంబర్ మొదటి వారంలోనే జరగాల్సి ఉంది. అయితే, ఆ సమయంలో బంగాళాఖాతానికి సమీపంలో చైనాకు చెందిన ‘ఓషన్ మినరల్ రీసెర్చ్’ నౌక సంచరిస్తుండటంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. మన క్షిపణి ప్రయోగానికి సంబంధించిన కీలక సమాచారాన్ని చైనా పసిగట్టకుండా ఉండేందుకు, భారత భద్రతా దళాలు ఈ ప్రయోగాన్ని కొన్ని రోజులు వాయిదా వేశాయి. ఆ నౌక అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాతే కే-4 గర్జన మొదలైంది. ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో చైనాకు చెందిన పలు పరిశోధక నౌకలు, యుద్ధనౌకలు నిరంతరం నిఘా వేస్తూనే ఉండటం గమనార్హం.
భవిష్యత్ లక్ష్యం.. కే-5 క్షిపణులు
భారత్ తన అణు సామర్థ్యాన్ని క్రమంగా పెంచుకుంటూ పోతోంది. అరిహంత్ క్లాస్ జలాంతర్గాముల్లో మూడవదైన ‘ఐఎన్ఎస్ అరిధమన్’ను 2026 ప్రారంభంలో నావికాదళంలో చేర్చనున్నారు. రాబోయే కాలంలో 5,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ కలిగిన ‘కే-5’ క్షిపణులను మోసుకెళ్లేలా 10,000 టన్నుల భారీ అణు జలాంతర్గాములను తయారు చేసేందుకు భారత్ ప్రణాళికలు సిద్ధం చేసింది.
అణు జలాంతర్గాములే ఎందుకు కీలకం?
డీజిల్ జలాంతర్గాముల కంటే అణు ఇంధనంతో నడిచే అటాక్ సబ్ మెరైన్లు (SSNs) అత్యంత శక్తివంతమైనవి. ఇవి ఎక్కువ రోజులు నీటి లోపలే ఉండగలవు. శత్రువుల కంటికి చిక్కకుండా రహస్యంగా దాడులు చేయగలవు. "మేక్ ఇన్ ఇండియా"లో భాగంగా రెండు అణు సబ్ మెరైన్లను నిర్మించేందుకు మోదీ ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రష్యా నుంచి ‘అకులా’ క్లాస్ అణు జలాంతర్గామిని కూడా 2028 నాటికి భారత్ తీసుకోనుంది.
ప్రాంతీయ సవాళ్లు
{{/usCountry}}డీజిల్ జలాంతర్గాముల కంటే అణు ఇంధనంతో నడిచే అటాక్ సబ్ మెరైన్లు (SSNs) అత్యంత శక్తివంతమైనవి. ఇవి ఎక్కువ రోజులు నీటి లోపలే ఉండగలవు. శత్రువుల కంటికి చిక్కకుండా రహస్యంగా దాడులు చేయగలవు. "మేక్ ఇన్ ఇండియా"లో భాగంగా రెండు అణు సబ్ మెరైన్లను నిర్మించేందుకు మోదీ ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రష్యా నుంచి ‘అకులా’ క్లాస్ అణు జలాంతర్గామిని కూడా 2028 నాటికి భారత్ తీసుకోనుంది.
ప్రాంతీయ సవాళ్లు
{{/usCountry}}అరేబియా సముద్రంలో పాకిస్థాన్‌కు చైనా, టర్కీలు అత్యాధునిక జలాంతర్గాములను, క్షిపణులను సరఫరా చేస్తున్నాయి. అటు హిందూ మహాసముద్రంలో చైనా తన విమానవాహక నౌకల సాయంతో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో, సముద్ర గర్భం నుంచి అణు దాడులు చేయగల సామర్థ్యం భారత్‌కు ఒక తిరుగులేని రక్షణ కవచంలా మారుతుంది.