టి20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 15) కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరగనున్న భారత్ - పాకిస్థాన్ హై-ప్రొఫైల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది! శ్రీలంక వాతావరణ శాఖ, వివిధ వాతావరణ నివేదికల ప్రకారం ఆదివారం అక్కడ వర్షం పడే అవకాశం ఉంది.
ఇండియా వర్సెస్ పాకిస్థాన్- కొలంబో వాతావరణ అంచనా (ఆదివారం, ఫిబ్రవరి 15):

శ్రీలంక వాతావరణ శాఖ, తాజా నివేదికల ప్రకారం:
పగటి సమయం: వర్షం కురిసే అవకాశం 65% వరకు ఉంది. ఆకాశం మేఘావృతమై ఉండి, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.
మ్యాచ్ సమయం (రాత్రి): వర్షం పడే అవకాశం 25% నుంచి 49% వరకు ఉండవచ్చని అంచనా. అయితే, రాత్రి 7 గంటల సమయంలో చినుకులు పడే అవకాశం ఎక్కువగా ఉందని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి.
పరిస్థితులు: వాతావరణం చాలా తేమగా ఉంటుంది. ఉత్తరం నుంచి గంటకు 11 మైళ్ల వేగంతో గాలులు వీస్తాయి.
ఇండియా వర్సెస్ పాకిస్థాన్- మ్యాచ్ రద్దయితే ఏమవుతుంది?
కనీస ఓవర్లు: టీ20 మ్యాచ్ ఫలితం తేలాలంటే ఇరు జట్లు కనీసం 5 ఓవర్ల పాటు ఆడాలి.
పాయింట్ల పంపకం: ఒకవేళ వర్షం వల్ల ఒక్క బంతి కూడా పడకుండా మ్యాచ్ రద్దయితే, గ్రూప్ స్టేజ్ మ్యాచ్ కాబట్టి దీనికి ‘రిజర్వ్ డే’ కూడా లేదు. ఫలితంగా భారత్, పాకిస్థాన్‌లకు చెరో ఒక పాయింట్ లభిస్తుంది.
ఆర్థిక నష్టం: ఇదే అత్యంత ఆందోళనకర విషయం! టీ20 ప్రపంచకప్ 2026లో ఈ ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ రద్దయితే బ్రాడ్‌కాస్టర్ జియోస్టార్ సుమారు రూ. 200 - రూ. 250 కోట్ల ప్రకటనల ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. 10 సెకన్ల యాడ్ స్పాట్ ధర దాదాపు రూ. 17 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు పలుకుతోంది.
మొన్నటి వరకు 'బాయ్‌కాట్'- ఇప్పుడు వర్షం!
{{/usCountry}}ఆర్థిక నష్టం: ఇదే అత్యంత ఆందోళనకర విషయం! టీ20 ప్రపంచకప్ 2026లో ఈ ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ రద్దయితే బ్రాడ్‌కాస్టర్ జియోస్టార్ సుమారు రూ. 200 - రూ. 250 కోట్ల ప్రకటనల ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. 10 సెకన్ల యాడ్ స్పాట్ ధర దాదాపు రూ. 17 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు పలుకుతోంది.
మొన్నటి వరకు 'బాయ్‌కాట్'- ఇప్పుడు వర్షం!
{{/usCountry}}భారత్, పాకిస్థాన్ జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం ఎప్పుడో మానేశాయి. ఫలితంగా ఐసీసీ టోర్నమెంట్లలోనే ఫ్యాన్స్ ఈ మ్యాచ్‌లను చూడగలుగుతున్నారు. కానీ 2026 టీ20 ప్రపంచకప్‌లో ఇండియాతో మ్యాచ్ ఆడమని పాక్ కొన్ని రోజుల క్రితం ప్రకటించి, అందరికి షాక్ ఇచ్చింది. కానీ ఐసీసీ జోక్యం చేసుకుని, బుజ్జగించడంతో పాక్ యూ-టర్న్ కొట్టి, ఇండియాతో ఫిబ్రవరి 15న ఆడతామని చెప్పింది. ఇది ఫ్యాన్స్‌కి మంచి జోష్ని ఇచ్చింది.
ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు వరుణుడి వల్ల మ్యాచ్ ఆగిపోయే ప్రమాదం ఉందని తెలిసి ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు.
ప్రశ్నలు- సమాధానాలు:-
ప్రశ్న- పాకిస్థాన్ జట్టు ఈ మ్యాచ్ ఆడుతుందా?
సమాధానం- అవును. మొదట భారత్‌తో ఆడబోమని మొండికేసినప్పటికీ, ఐసీసీ అధికారుల చర్చల తర్వాత పాక్ ప్రభుత్వం తమ జట్టును ఆడేందుకు అనుమతించింది. ప్రస్తుతం పాక్ జట్టు కొలంబోలోనే ఉంది.
ప్రశ్న- భారత్- పాకిస్థాన్ జట్ల ప్రస్తుత పరిస్థితి ఏంటి?
సమాధానం- భారత్ తన మొదటి రెండు మ్యాచ్‌ల్లో (అమెరికా, నమీబియాపై) గెలిచి పటిష్టంగా ఉంది. పాకిస్థాన్ కూడా నెదర్లాండ్స్, అమెరికాపై గెలిచి ఫామ్‌లో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్-ఏలో అగ్రస్థానానికి చేరుకుంటుంది.
ప్రశ్న- ఆర్ ప్రేమదాస స్టేడియం డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉంటుంది?
సమాధానం- ప్రేమదాస స్టేడియంలో వర్షం ఆగిపోయిన 20 నిమిషాల్లోనే ఆటను పునఃప్రారంభించే అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ ఉంది.