...
...
Next Story

T20 World cup: ఇండియా వర్సెస్ జింబాబ్వే.. సెమీస్ ఆశల కోసం ప్లాన్ బి.. ఓపెనర్ గా శాంసన్.. హైదరాబాదీ కుర్రాడిపై వేటు!

భారీ ఆశలు, అంచనాలతో టీ20 ప్రపంచకప్ బరిలో దిగిన ఇండియా ఇప్పుడు డేంజర్ జోన్లో ఉంది. సెమీస్ చేరాలంటే తప్పక విజయాలు సాధించాల్సిన డూ ఆర్ డై పరిస్థితుల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో పోరుతో ఇండియా ప్లాన్ బి అమలు చేయాల్సిందేననే కామెంట్లు వస్తున్నాయి.

Published on: Feb 24, 2026, 08:44:30 IST
Advertisement

ఒక్క ఓటమి.. డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియాను డేంజర్ జోన్లో పడేసింది. టీ20 ప్రపంచకప్ సెమీస్ రేసును క్లిష్టంగా మార్చింది. సూపర్ 8 పోరులో దక్షిణాఫ్రికా చేతిలో దారుణ ఓటమి భారత అవకాశాలను గట్టిగానే దెబ్బతీసింది. అయితే ఇంకా ఇండియాకు ఛాన్స్ ఉంది. సెమీస్ చేసే మార్గం ఉంది. కానీ అందుకు భారత్ అత్యుత్తమంగా ఆడాల్సిందే.

జింబాబ్వేతో

సంజు శాంసన్ (PTI)
సంజు శాంసన్ (PTI)

టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ కు సూపర్ 8 స్టేజీలో ఇంకా రెండు మ్యాచ్ లు ఉన్నాయి. జింబాబ్వే, వెస్టిండీస్ తో ఇండియా ఆడాల్సి ఉంది. ఫిబ్రవరి 26న చెన్నైలో జింబాబ్వే వర్సెస్ ఇండియా మ్యాచ్ జరుగుతుంది. ఈ పోరులో భారత్ కచ్చితంగా గెలవాల్సిందే. ఇది డూ ఆర్ డై మ్యాచ్.

ఇండియా ప్లాన్ బి

గ్రూప్ స్టేజీలో ఇండియా వరుసగా నాలుగు మ్యాచ్ లు గెలిచింది. కానీ సూపర్ 8కు రాగానే సౌతాఫ్రికా చేతిలో ఓడింది. ఈ నేపథ్యంలో భారత్ ప్లాన్ బి అమలు చేయాలని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు టీమ్ కు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లు ఓపెనర్లుగా ఉన్నారు. వీళ్లిద్దరూ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లే. దీంతో ప్రత్యర్థి టీమ్స్ ఫస్ట్ ఓవర్ ను ఆఫ్ స్పిన్నర్ తో వేయించి ఇండియాను దెబ్బకొడుతున్నాయి.

సంజు శాంసన్ ఎంట్రీ

గత మూడు మ్యాచ్ ల్లో ఇండియా ప్రత్యర్థి టీమ్స్ ఆఫ్ స్పిన్ తోనే ఫస్ట్ ఓవర్ వేశాయి. ఈ మ్యాచ్ ల్లో ఫస్ట్ ఓవర్లోనే రెండు సార్లు అభిషేక్, ఒకసారి ఇషాన్ కిషన్ ఔట్ అయ్యారు. ఇప్పుడు జింబాబ్వే కూడా ఇదే ట్రాప్ ను సెట్ చేసే ఛాన్స్ ఉంది. దీన్ని దాటాలంటే ఇండియా ఓపెనర్ గా అభిషేక్ తో పాటు సంజు శాంసన్ ను ఆడించాలను కామెంట్లు వస్తున్నాయి. ఒకవేళ ఆఫ్ స్పిన్ వేస్తే శాంసన్ స్ట్రైక్ తీసుకుని చెలరేగుతాడు. లేదు పేసర్ వేస్తే అప్పుడు అభిషేక్ శర్మ ఛార్జ్ తీసుకోవచ్చు.

ఇషాన్ ఎక్కడ?

బౌలింగ్ లోనూ ఇండియాకు ప్లాన్ బి అవసరం. సౌతాఫ్రికాతో మ్యాచ్ లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఫెయిల్ అయ్యాడు. ఈ నేపథ్యంలో జింబాబ్వేపై వరుణ్ చక్రవర్తితో పాటు కుల్ దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ను ఆడించడం బెస్ట్ ఆప్షన్ అనే కామెంట్లు వస్తున్నాయి. జింబాబ్వే బ్యాటింగ్ టాప్-7 బ్యాటర్లలో అయిదుగురు రైట్ హ్యాండ్ బ్యాటర్లున్నారు. అందుకే అక్షర్ ను ఫైనల్ ఎలెవన్ లో ఆడిస్తే టీమ్ కు కలిసొచ్చే ఛాన్స్ ఉంటుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks