దేశంలోనే అతిపెద్ద, ప్రముఖ ప్రైవేట్ చమురు సంస్థ నయారా ఎనర్జీ.. వాహనదారులకు భారీ ఉపశమనం కలిగించింది! అంతర్జాతీయంగా చమురు ధరలు దిగిరావడంతో.. నయారా ఎనర్జీ తన దేశవ్యాప్త నెట్‌వర్క్‌లో పెట్రోల్ ధరను లీటరుకు రూ. 5, అలాగే డీజిల్ ధరను లీటరుకు రూ. 3 మేర తగ్గించింది.

పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గడంతో గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిటైల్ మార్కెట్లో ఇంధన ధరలను తగ్గించిన మొదటి సంస్థగా నయారా ఎనర్జీ నిలిచింది.
అయితే, ట్యాక్స్‌లు, వ్యాట్ల కారణంగా వివిధ రాష్ట్రాల్లోని నయారా పెట్రోల్ బంకుల వద్ద ఇంధన ధరలు వేరువేరుగా ఉంటాయి.
LPG price cut : గుడ్ న్యూస్! ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు- ఎంతంటే..
అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం..
గతంలో అమెరికా-ఇరాన్ యుద్ధం తీవ్రస్థాయికి చేరి అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకినప్పుడు.. దేశంలో అందరికంటే ముందుగా ఇంధన ధరలను పెంచిన రికార్డు కూడా నయారా ఎనర్జీ పేరిటే ఉంది. లీటరు పెట్రోల్‌పై రూ. 5.30, లీటరు డీజిల్‌పై రూ. 3 ప్రైజ్ హైక్ చేసింది. అయితే, ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ముడి చమురు ధరల తగ్గుదల ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేయడంలోనూ ఈ సంస్థే ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో రిటైల్ బంకులను నిర్వహిస్తున్న నయారా ఎనర్జీ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రైవేట్ బంకులను ఆశ్రయించే వాహనదారులకు, ముఖ్యంగా రవాణా రంగానికి పెద్ద ఊరట లభించనుంది.
ప్రస్తుతం ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌లు ధరల తగ్గింపుపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. ప్రైవేట్ రంగంలో వచ్చిన ఈ మార్పుతో రాబోయే రోజుల్లో ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఇంధన ధరలను తగ్గించే దిశగా అడుగులు వేసే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
{{/usCountry}}ప్రస్తుతం ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌లు ధరల తగ్గింపుపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. ప్రైవేట్ రంగంలో వచ్చిన ఈ మార్పుతో రాబోయే రోజుల్లో ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఇంధన ధరలను తగ్గించే దిశగా అడుగులు వేసే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
{{/usCountry}}గుజరాత్ వాద్నగర్లో నయారా ఎనర్జీ ప్రతియేటా 20 మిలియన్ టన్నుల రిఫైనరీని నడుపుతోంది. ఇది దేశంలోనే అతిపెద్ద నెంబర్.