గ్రే మార్కెట్​లో ఇండో ఎంఐఎం ఐపీఓకి మంచి ప్రీమియం- సబ్​స్క్రిప్షన్​కి ఈరోజే ఛాన్స్! అప్లై చేయాలా? వద్దా?

Indo MIM IPO : ఇండో- ఎంఐఎం ఐపీఓ సబ్​స్క్రిప్షన్​కి నేడే చివరి రోజు! మరోవైపు గ్రే మార్కెట్​లో ఈ ఐపీఓ జీఎంపీ రోజురోజుకు వృద్ధిచెందుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ కంపెనీ బిజినెస్​ ఏంటి? ఇండో ఎంఐఎం- ఐపీఓకి అప్లై చేయాలా? వద్దా? నిపుణుల సూచనలను ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

Published on: Jul 27, 2026, 11:19:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ముందంజలో ఉన్న ఇండో-ఎంఐఎం లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) ఇండియన్ ప్రైమరీ మార్కెట్‌లో సందడి చేస్తోంది. జులై 23న ప్రారంభమైన ఈ ఐపీఓ జులై 27 వరకు పెట్టుబడిదారులకు సబ్​స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉండనుంది. కంపెనీ యాజమాన్యం తమ ఈక్విటీ షేరు ధర శ్రేణిని రూ. 461 నుంచి రూ. 485గా నిర్ణయించింది.

ఇండో ఎంఐఎం ఐపీఓ అప్డేట్స్.. (Photo: Company Website)
ఇండో ఎంఐఎం ఐపీఓ అప్డేట్స్.. (Photo: Company Website)

ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా మొత్తంగా రూ. 3,811 కోట్లను సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో కొత్త షేర్ల జారీతో పాటు ప్రమోటర్ల ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్​ఎస్) భాగం కూడా ఉంది. బీఎస్​ఈ, ఎన్ఎస్ఈ ఎక్స్​ఛేంజీలలో ఈ షేర్లు లిస్ట్ కానున్నాయి. ప్రైమరీ మార్కెట్లో క్రమంగా బిడ్డింగ్ ఊపందుకుంటుండటంతో గ్రే మార్కెట్‌లోనూ దీనికి మంచి డిమాండ్ కనిపిస్తోంది.

ఇండో- ఎంఐఎం ఐపీఓ.. గ్రే మార్కెట్‌లో జోరు..!

మార్కెట్ నిపుణుల కథనం ప్రకారం, ప్రస్తుతం గ్రే మార్కెట్‌లో ఈ కంపెనీ షేర్లు రూ. 190 ప్రీమియంతో ట్రేడ్ అవుతున్నాయి. గత మూడు రోజుల్లో ఇండో-ఎంఐఎం ఐపీఓ జీఎంపీ విలువ రూ. 166 నుంచి రూ. 190 వరకు పుంజుకుంది.

సబ్‌స్క్రిప్షన్ తొలి రెండు రోజుల్లోనే ఈ ఐపీఓ 3 రెట్లకు పైగా బుక్ కావడం విశేషం. అనంతరం కనిపిస్తున్న డిమాండ్​తో ఈ ఐపీఓ జీఎంపీ పెరుగుతూ వస్తోంది.

ఇండో- ఎంఐఎం ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ వివరాలు..

బిడ్డింగ్ మూడో రోజు ఉదయం 10:18 గంటల సమయానికి ఈ ఇండో-ఎంఐఎం ఐపీఓ మొత్తం 4.45 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది.

  • రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 2.37 రెట్లు బుక్ అయింది.
  • నాన్-ఇన్​స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (ఎన్​ఐఐ) విభాగంలో అత్యధికంగా 13.77 రెట్ల స్పందన లభించింది.
  • క్వాలిఫైడ్ ఇన్​స్టిట్యూషనల్ బయ్యర్స్ (క్యూఐబీ) విభాగం 1.12 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది.

ఇండో- ఎంఐఎం ఐపీఓ విశ్లేషణ: నిపుణులు ఏమంటున్నారంటే?

ఈ ఇండో- ఎంఐఎం ఐపీఓలో ఇన్వెస్ట్ చేయవచ్చా లేదా అన్నదానిపై కేసీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ మహేష్ ఎం ఓజా విశ్లేషణ అందించారు.

"అప్పర్ ప్రైస్ బ్యాండ్ వద్ద మార్చి 31, 2026 నాటికి ఉన్న రూ. 10.87 డైల్యూటెడ్ ఈపీఎస్ ప్రాతిపదికగా ఇండో-ఎంఐఎం వ్యాల్యుయేషన్ ఎఫ్​వై26ఈ పీ/ఈ వద్ద 45.0 రెట్లుగా ఉంది. వ్యాల్యుయేషన్ కొంత ఎక్కువగానే ఉన్నప్పటికీ, మెటల్ ఇంజెక్షన్ మోల్డింగ్ (ఎంఐఎం) రంగంలో కంపెనీకి ఉన్న గ్లోబల్ లీడర్‌షిప్, సాంకేతిక పరిజ్ఞానం, పరిమిత పోటీని పరిగణనలోకి తీసుకుంటే ఇది సమర్థనీయమే. 2026లో 3.2 బిలియన్ డాలర్లుగా ఉన్న ప్రపంచ ఎంఐఎం మార్కెట్, 2035 నాటికి 4.4 శాతం సీఏజీఆర్‌తో 4.7 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఇది కంపెనీ సుదీర్ఘకాల వృద్ధికి మంచి అవకాశాన్ని కల్పిస్తోంది," అని కేసీ సెక్యూరిటీస్ నిపుణుడు వివరించారు.

కంపెనీకి భారత్‌లో నేరుగా పోటీదారులు ఎవరూ లేరని, గ్లోబల్ మార్కెట్‌లో ఉన్న జియాంగ్సు జియాన్ టెక్నాలజీ ఇంకా ఎక్కువ వ్యాల్యుయేషన్‌లో ట్రేడ్ అవుతోందని ఆయన పేర్కొన్నారు. భారత్ తెచ్చిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్​ఐ) పథకాలు, విస్తరిస్తున్న తయారీ రంగం, 'చైనా+1' వ్యూహం ఇండో-ఎమ్‌ఐఎమ్‌కు ఎంతగానో కలసివస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

"కంపెనీ మార్కెట్ నాయకత్వం, స్పష్టమైన పోటీ ప్రయోజనాలు, దీర్ఘకాలిక లాభాలను అందించే సామర్థ్యాన్ని బట్టి మధ్యస్థం నుంచి దీర్ఘకాలిక దృక్పథంతో ఇన్వెస్టర్లు ఈ ఐపీఓకు 'అప్లై' చేయవచ్చు," అని మహేష్ ఎం ఓజా సూచించారు.

ఆనంద్ రాథీ బ్రోకరేజ్ సంస్థ కూడా ఈ ఇష్యూకు 'అప్లై' రేటింగ్ కేటాయించింది. "గ్లోబల్ మార్కెట్లో లీడర్‌షిప్, వివిధ రంగాలకు సేవలు అందించే వైవిధ్యం, బలమైన ఎగుమతి వ్యాపారం ఉన్నందున ఈ వ్యాల్యుయేషన్ సమర్థనీయంగానే ఉంది. కాబట్టి దీర్ఘకాలిక పెట్టుబడిదారులు సబ్‌స్క్రైబ్ చేయవచ్చు," అని సంస్థ పేర్కొంది.

బీకాన్ క్యాపిటల్ అడ్వైజర్స్, స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ సంస్థలు కూడా ఇండో-ఎంఐఎం ఐపీఓకు 'అప్లై' చేయవచ్చని సిఫార్సు చేశాయి.

ఇండో- ఎంఐఎం ఐపీఓ ముఖ్యమైన తేదీలు, కేటాయింపులు..

ఈ ఐపీఓ షేర్ల కేటాయింపు జులై 28, 2026న పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ ఇష్యూకి అఫీషియల్ రిజిస్ట్రార్‌గా ఎంయూఎఫ్‌జీ ఇన్టైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహరిస్తోంది.

బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో జులై 30, 2026న ఇండో-ఎంఐఎం షేర్లు లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ క్యాపిటల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, కొటక్ మహీంద్రా క్యాపిటల్, ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ సంస్థలు ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఐపీఓలో ఇన్వెస్ట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More