Jobs : ఇంటర్వ్యూలు క్రాక్​ చేయలేకపోతున్నారా? ఈ టిప్స్ మీకోసమే..

ఉద్యోగ వేటలో ఉంటూ ఇంటర్వ్యూలను క్రాక్​ చేయలేకపోతున్నారా? మంచి మంచి అవకాశాలు కోల్పోతున్నానని బాధపడుతున్నారా? అయితే ఇది మీరు చూడండి. ఈ ‘రూల్​’ గురించి మీరు తెలుసుకోవాలి.

Published on: Apr 4, 2026, 16:01:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఒకవైపు జాబ్​ మార్కెట్​ తగ్గిపోవడం, మరోవైపు లేఆఫ్స్​.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గ్రాడ్యుయేట్లు, ఫ్రెషర్లు, సీనియర్​ ఉద్యోగుల్లో ఒకరకమైన ఆందోళన నెలకొంది. జాబ్​ ఎప్పుడు వస్తుందా అని ఉద్యోగం లేని వారు, ఉన్న జాబ్​ ఊడిపోతే ఎలా? అని వర్కింగ్​ చేస్తున్న వారు సతమతం అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఉన్న కొద్ది అవకాశాలను సరిగ్గా ఒడిసిపట్టుకోవడం చాలా ముఖ్యం! చాలా అవసరం!. కానీ కొంతమంది ఎంత ప్రిపేర్​ అయినా, ఎంత ప్రాక్టీస్​ చేసినా.. ఇంటర్వ్యూ స్టేజ్​ని దాటలేకపోతుంటారు. ఇక్కడే “7-38-55” అనే రూల్ అవసరం అవుతుంది. మన సంభాషణలను అవతలి వ్యక్తులు ఎలా అర్థం చేసుకుంటారనే అంశంపై సైకాలజీలో ప్రాచుర్యం పొందిన సిద్ధాంతం ఇది. వివరాల్లోకి వెళితే..

ఇంటర్వ్యూలు క్రాక్​ చేయలేక బాధపడుతున్నారా?
ఇంటర్వ్యూలు క్రాక్​ చేయలేక బాధపడుతున్నారా?

ఈ రూల్ ప్రకారం మనం చెప్పే విషయంలో:

7 శాతం మాత్రమే మనం వాడే పదాలు

38 శాతం మన గొంతులో ఉండే స్వరం, తీరు

55 శాతం మన శరీర భాష

సరళంగా చెప్పాలంటే, మీరు ఏం చెబుతున్నారు అనే దానికంటే.. ఎలా చెబుతున్నారు, మిమ్మల్ని మీరు ఎలా ప్రెజెంట్ చేసుకుంటున్నారు అనేదే చాలా ముఖ్యం.

అసలు 7-38-55 రూల్ అంటే ఏంటి?

ప్రముఖ సైకాలజిస్ట్ ఆల్బర్ట్ మెహ్రాబియన్ పరిశోధనల నుంచి ఈ సూత్రం పుట్టింది. ఒక వ్యక్తి తన భావాలను లేదా దృక్పథాన్ని వ్యక్తపరిచేటప్పుడు అవతలి వారు దాన్ని ఎలా స్వీకరిస్తారనేది ఆయన అధ్యయనం చేశారు. అయితే ఈ రూల్ అన్ని సందర్భాల్లోనూ వర్తించదు. ఎక్కడైతే భావోద్వేగాలు, ఇంప్రెషన్స్, యాటిట్యూడ్ ప్రధానమో అక్కడ ఇది కీలకం. జాబ్ ఇంటర్వ్యూలు సరిగ్గా ఇటువంటివే.

ఇంటర్వ్యూ చేసే వారు కేవలం మీ సమాధానాలను మాత్రమే వినరు. మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని, క్లారిటీని, మీ ప్రెజెన్స్‌ను వారు గమనిస్తుంటారు.

7శాతం.. కేవలం పదాలు సరిపోవు

చాలా మంది అభ్యర్థులు సమాధానాలను బట్టీ పట్టడం మీద, లేదా పర్‌ఫెక్ట్‌గా చెప్పడం మీద మాత్రమే దృష్టి పెడతారు. కానీ అలా చెప్పే క్రమంలో కొన్ని తప్పులు జరుగుతుంటాయి:

రోబోలా సమాధానం చెప్పడం

కంగారుగా మాట్లాడటం

నమ్మకం లేనట్లుగా కనిపించడం

అవతలి వ్యక్తితో సంబంధం లేకుండా ఏదో చెప్పేయడం

ఇలాంటప్పుడు మీ సమాధానం ఎంత గొప్పగా ఉన్నా అది అవతలి వ్యక్తిని ఆకట్టుకోదు. పదాలు కేవలం సమాచారాన్ని ఇస్తాయి, కానీ ఇంప్రెషన్ మాత్రం మీ ఎనర్జీ వల్ల కలుగుతుంది.

38 శాతం.. ప్రభావం: మీ గొంతులోని స్వరం

మీరు చెప్పే మాటల వెనుక ఉన్న అసలు భావం మీ వాయిస్ టోన్‌లో కనిపిస్తుంది.

ఒకవేళ మీరు చెప్పేది కరెక్ట్ అయినా, అది తడబడుతూ లేదా నీరసంగా చెబితే అవతలి వారికి మీపై అనుమానం కలుగుతుంది. అదే సింపుల్ ఆన్సర్ అయినా స్పష్టంగా, ఉత్సాహంగా చెబితే అది నమ్మదగ్గదిగా ఉంటుంది.

ముఖ్యంగా ఇవి గమనించండి:

వాయిస్ క్లారిటీ (స్పష్టత)

మాట్లాడే వేగం

మధ్యలో ఇచ్చే విరామం

ఉత్సాహం

55 శాతం ఇంపాక్ట్: బాడీ లాంగ్వేజ్ ఇచ్చే ఫస్ట్ ఇంప్రెషన్

మీరు మొదటి వాక్యం పూర్తి చేయకముందే, మీ బాడీ లాంగ్వేజ్ ఇంటర్వ్యూయర్ మీద ఒక అభిప్రాయాన్ని ముద్రిస్తుంది.

కళ్లలోకి చూస్తూ మాట్లాడటం

కూర్చునే తీరు

ముఖ కవళికలు

చేతుల కదలిక

మీ సమాధానాలు ఎంత బలంగా ఉన్నా.. మీరు వంగి కూర్చున్నా లేదా కళ్లలోకి చూడకపోయినా నెగటివ్ ఇంప్రెషన్ పడే అవకాశం ఉంది.

ఇంటర్వ్యూలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయంటే..

"నేను అన్ని ప్రశ్నలకూ కరెక్ట్‌గానే సమాధానం ఇచ్చాను కదా, మరి ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు?" అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇంటర్వ్యూ అనేది ఒక పరీక్ష కాదు, అది ఒక సంభాషణ. అక్కడ ఇంటర్వ్యూయర్ తనకి తాను కొన్ని ప్రశ్నలు వేసుకుంటాడు:

నేను ఈ వ్యక్తిని నమ్మవచ్చా?

తను ఆత్మవిశ్వాసంతో ఉన్నారా?

విషయాన్ని స్పష్టంగా చెప్పగలరా?

మా టీమ్‌లో తను ఇమడగలరా?

అందుకే కేవలం టెక్నికల్ సమాధానాలు మాత్రమే విజయాన్ని గ్యారెంటీ చేయవు.

ఈ రూల్‌తో ఇంటర్వ్యూలో గెలవండి ఇలా:

సమాధానాలను మనసులో చదువుకోవడం మానేసి, బయటకు గట్టిగా చెప్పి ప్రాక్టీస్ చేయండి.

మీ మాట తీరు, బాడీ లాంగ్వేజ్ గమనించడానికి వీడియో రికార్డ్ చేసుకోండి.

నేరుగా కళ్లలోకి చూస్తూ, ఓపెన్ పోశ్చర్‌తో కూర్చోండి.

కొంచెం నెమ్మదిగా మాట్లాడుతూ, అవసరమైన చోట పాజ్ ఇవ్వండి.

నటించడానికి ప్రయత్నించకండి.. సహజంగా, స్పష్టంగా ఉండండి.

ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అంటే కేవలం రైట్ ఆన్సర్స్ వెతకడం కాదు, మిమ్మల్ని మీరు ఎలా ఆవిష్కరించుకుంటారు అనేదే ముఖ్యం. ఇద్దరు అభ్యర్థులు ఒకే సమాధానం చెప్పినా, ఎవరైతే ఎక్కువ కాన్ఫిడెంట్‌గా, ప్రెజెంట్‌గా కనిపిస్తారో వారికే జాబ్ వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More