iPhone 17e : ఫీచర్స్ నుంచి ధర వరకు- ఐఫోన్ 17ఈ హైలైట్స్ ఇవే..
iPhone 17e news : యాపిల్ తన ఐఫోన్ 17 సిరీస్‌లో అత్యంత సరసమైన మోడల్ 'ఐఫోన్ 17ఈ'ను భారత్ సహా గ్లోబల్ మార్కెట్లలో ఇటీవలే విడుదల చేసింది. శక్తివంతమైన ఏ19 చిప్, అప్‌గ్రేడెడ్ మోడమ్, అదిరిపోయే కెమెరా ఫీచర్లతో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ధరతో పాటు ఇతర వివరాలు ఇక్కడ చూడండి..
ఐఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ఐఫోన్ 17ఈ'ని యాపిల్ సంస్థ ఇటీవలే లాంచ్ చేసింది. ఐఫోన్ 17 సిరీస్‌లో అత్యంత సరసమైన ధరకే లభించే ఈ స్మార్ట్‌ఫోన్ గత ఏడాది వచ్చిన ఐఫోన్ 16ఈకి సక్సెసర్‌గా మన ముందుకు రాబోతోంది. ఈ మొబైల్ డివైజ్‌లో ప్రాసెసర్, మోడమ్, ఛార్జింగ్ టెక్నాలజీ పరంగా భారీ మార్పులు చేశారు.

ఈ నేపథ్యంలో కొత్త ఐఫోన్ 17ఈ ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాము..
ఐఫోన్ 17ఈ: స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..
ఐఫోన్ 17ఈలో 6.1-ఇంచ్ సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇది 60హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, నాచ్ డిజైన్‌తో వస్తుంది. స్క్రీన్ విషయానికి వస్తే 1200 నిట్స్ పీక్ హెచ్డీఆర్ బ్రైట్‌నెస్‌ను ఇది సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ భద్రత కోసం కొత్త ‘సెరామిక్ షీల్డ్ 2’ ప్రొటెక్షన్‌ను యాపిల్ జోడించింది. ఇది పాత మోడల్స్‌తో పోలిస్తే స్క్రాచెస్ని సమర్థవంతంగా తట్టుకోగలదు. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం దీనికి ఐపీ68 రేటింగ్ ఉంది.
ఐఫోన్ 17ఈ- పర్ఫార్మెన్స్ అండ్ పవర్..
ఈ ఐఫోన్ 17ఈలో అత్యంత శక్తివంతమైన 3 ఎన్ఎం టెక్నాలజీతో రూపొందిన 'ఏ19 చిప్'ను వాడారు. ఈ గ్యాడ్జెట్ నిత్యం చేసే పనులను, ఆన్-డివైస్ ఏఐ ఫీచర్లను సులభంగా హ్యాండిల్ చేస్తుందని యాపిల్ పేర్కొంది. గేమింగ్ ప్రియుల కోసం 4-కోర్ జీపీయూను అందించారు. అలాగే యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ల కోసం ప్రత్యేకంగా 16-కోర్ న్యూరల్ ఇంజిన్ ఇందులో ఉంది.
ఐఫోన్ 17ఈ- కనెక్టివిటీ, బ్యాటరీ..
యాపిల్ తన సొంత 'సీ1ఎక్స్ సెల్యులార్ మోడమ్'ను ఈ ఫోన్‌లో పరిచయం చేసింది. ఇది మునుపటి మోడల్ కంటే రెండు రెట్లు వేగంగా పని చేయడమే కాకుండా, ఐఫోన్ 16 ప్రో మోడమ్ కంటే 30 శాతం తక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. 5జీ సపోర్ట్ ఉన్న ఈ ఫోన్ రోజంతా బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. యూఎస్బీ-సీ ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా కేవలం 30 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జ్ అవుతుంది. అలాగే మాగ్‌సేఫ్, క్యూఐ2 వైర్‌లెస్ ఛార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేస్తుంది.
ఐఫోన్ 17ఈ- కెమెరా..
ఐఫోన్ 17ఈ వెనుక భాగంలో ఒకే ఒక 48ఎంపీ ఫ్యూజన్ కెమెరా ఉంది. హై-రిజల్యూషన్ సెన్సార్ ఉండటం వల్ల క్వాలిటీ తగ్గకుండా 2ఎక్స్ ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. డిఫాల్ట్‌గా 24 ఎంపీ ఫోటోలు వస్తాయి, అవసరమైతే పూర్తి 48ఎంపీ ఫోటోలు కూడా తీసుకోవచ్చు. వీడియోల విషయానికి వస్తే, 60ఎఫ్‌పీఎస్ వేగంతో 4కే డాల్బీ విజన్ వీడియోలను రికార్డ్ చేయవచ్చు. స్పేషియల్ ఆడియో రికార్డింగ్ సదుపాయం కూడా ఉంది
ఐఫోన్ 17ఈ- అదనపు ఫీచర్లు..
నెట్‌వర్క్ లేని సమయంలో కూడా శాటిలైట్ ద్వారా 'ఎమర్జెన్సీ ఎస్ఓఎస్', మెసేజింగ్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ వంటి సేవలను పొందవచ్చు. క్రాష్ డిటెక్షన్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఇది లేటెస్ట్ ఐఓఎస్ 26 సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తుంది. లైవ్ ట్రాన్స్‌లేషన్, కాల్ స్క్రీనింగ్ వంటి యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఇందులో హైలైట్‌గా నిలుస్తాయి
ఐఫోన్ 17ఈ- ధర, సేల్ వివరాలు..
భారత మార్కెట్లో ఐఫోన్ 17ఈ ప్రారంభ ధర రూ. 64,900 గా ఉంది. ఇది 256 జీబీ, 512 జీబీ అనే రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది.
రంగులు: బ్లాక్, వైట్, సాఫ్ట్ పింక్.
ఆఫర్లు: పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకునే ట్రేడ్-ఇన్ ఆఫర్లు, సబ్‌స్క్రిప్షన్ బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. మాగ్‌సేఫ్ సపోర్ట్ ఉన్న సిలికాన్, క్లియర్ కేసులను కూడా యాపిల్ విడిగానే విక్రయిస్తోంది.
తరచూ అడిగే ప్రశ్నలు-
1. ఐఫోన్ 17eలో ఐఫోన్ 17 సిరీస్‌లోని ఇతర మోడళ్లలాగే 'యాపిల్ ఇంటెలిజెన్స్' ఫీచర్లు ఉంటాయా?
అవును, ఐఫోన్ 17ఈలో యాపిల్ తన అత్యంత శక్తివంతమైన ఏ19 చిప్‌ను వాడింది. ఇందులో ఉండే 16-కోర్ న్యూరల్ ఇంజిన్ కారణంగా, ఐఫోన్ 17 ప్రో మోడళ్లలో ఉండే ‘యాపిల్ ఇంటెలిజెన్స్’, జనరేటివ్ ఏఐ ఫీచర్లు (లైవ్ ట్రాన్స్‌లేషన్, అడ్వాన్స్‌డ్ మెసేజ్ ఫిల్టరింగ్ వంటివి) ఐఫోన్ 17ఈలో కూడా పని చేస్తాయి.
2. ఐఫోన్ 17ఈ బ్యాటరీ లైఫ్, ఛార్జింగ్ వేగం ఎలా ఉంటుంది?
ఐఫోన్ 17ఈకి ఆల్-డై బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ఇందులో కొత్త సీ1ఎక్స్ మోడమ్ వాడటం వల్ల పవర్ వినియోగం 30 శాతం వరకు తగ్గింది. ఇది యూఎస్బీ-సీ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది, దీని ద్వారా కేవలం 30 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ నిండుతుంది. అలాగే, దీనికి మాగ్‌సేఫ్, క్యూఐ2 వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


