iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో లీక్స్- సరికొత్త డిజైన్, కెమెరాతో యాపిల్ నెక్ట్స్ లెవల్ ప్లాన్!
యాపిల్ 2026లో విడుదల చేయబోయే ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మాక్స్ మోడల్స్ భారీ మార్పులతో రానున్నాయి. ఈ సిరీస్‌లో ప్రధానంగా అండర్-డిస్‌ప్లే ఫేస్ ఐడీ టెక్నాలజీ వల్ల స్క్రీన్ కటౌట్ పరిమాణం తగ్గి, మరింత స్పష్టమైన డిస్‌ప్లే అందుబాటులోకి రానుందని సమాచారం.
యాపిల్ తన తదుపరి తరం ఐఫోన్లను విడుదల చేయడానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ, ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ గురించి ఆసక్తికరమైన లీకులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఐఫోన్ 18 సిరీస్‌లో ఈసారి యాపిల్ కేవలం చిన్నపాటి మార్పులతో సరిపెట్టకుండా, డిజైన్, పెర్ఫార్మెన్స్ పరంగా భారీ మార్పులనే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఐఫోన్ 18 ప్రో- డిజైన్‌లో కీలక మార్పు, డైనమిక్ ఐలాండ్‌కు గుడ్ బై?
ఐఫోన్ 14 ప్రో నుంచి వస్తున్న 'డైనమిక్ ఐలాండ్' డిజైన్ ఈ ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్‌లో మారబోతోందని తెలుస్తోంది. లీకుల ప్రకారం.. యాపిల్ ‘అండర్-డిస్‌ప్లే ఫేస్ ఐడీ’ టెక్నాలజీని పరీక్షిస్తోంది. అంటే స్క్రీన్ కిందనే సెన్సార్లు దాగి ఉంటాయి.
చిన్న కటౌట్: దీనివల్ల స్క్రీన్ పైభాగంలో కేవలం సెల్ఫీ కెమెరా కోసం ఒక హోల్ పంచ్ మాత్రమే కనిపిస్తుంది.
కొత్త పొజిషన్: కొన్ని రెండర్స్ ప్రకారం, ఈ కెమెరా సెంటర్లో కాకుండా టాప్-లెఫ్ట్ కార్నర్‌లో ఉండే అవకాశం ఉంది. ఇది ఐఫోన్‌కు సరికొత్త రూపును ఇస్తుంది.
రంగులు: ఐఫోన్ 18 ప్రో మోడల్స్ కోసం డీప్ పర్పుల్, బర్గండీ, కాఫీ బ్రౌన్ వంటి సరికొత్త రంగులను యాపిల్ తీసుకురానుంది.
ఐఫోన్ 18 ప్రో- కెమెరా అప్‌గ్రేడ్స్, ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ మీ చేతుల్లో!
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం యాపిల్ ఒక అద్భుతమైన ఫీచర్‌ను పరిచయం చేయబోతోందని తెలుస్తోంది. అదే ‘వేరియబుల్ అపెర్చర్’.
కాంతిపై నియంత్రణ: ఈ సిస్టమ్ ద్వారా లెన్స్‌లోకి ఎంత వెలుతురు వెళ్లాలో ఫిజికల్‌గా అడ్జస్ట్ చేయవచ్చు. దీనివల్ల రాత్రిపూట ఫోటోలు అద్భుతంగా రావడమే కాకుండా, బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ చాలా సహజంగా ఉంటుంది.
కొత్త సెన్సార్: శాంసంగ్ నుంచి సేకరించిన కొత్త త్రీ-లేయర్ స్టాక్డ్ ఇమేజ్ సెన్సార్‌ను వాడటం వల్ల ఫోటోల్లో నాయిస్ తగ్గి, క్వాలిటీ పెరుగుతుంది.
ఐఫోన్ 18 ప్రో- శక్తివంతమైన ఏ20 ప్రో చిప్‌సెట్..!
ఐఫోన్ 18 ప్రో సిరీస్‌లో టీఎస్ఎంసీ వారి అత్యంత అధునాతన 2ఎన్ఎం ప్రాసెస్ మీద తయారైన ఏ20 ప్రో చిప్‌ను వాడనున్నారు.
వేగం, సామర్థ్యం: మునుపటి చిప్‌తో పోలిస్తే ఇది 15% వేగంగా పనిచేస్తుంది. 30% తక్కువ బ్యాటరీని వినియోగిస్తుంది.
ఆన్-డివైస్ ఏఐ: మెరుగైన థర్మల్ కంట్రోల్ వల్ల ఫోన్ వేడెక్కదు, కృత్రిమ మేధ (ఏఐ) ఫీచర్లు మరింత వేగంగా పనిచేస్తాయి.
ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్- బ్యాటరీ, కనెక్టివిటీ..
ఐఫోన్ 18 ప్రో మాక్స్‌లో 5,100 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చనున్నట్లు సమాచారం. ఇది ఐఫోన్ చరిత్రలోనే అతిపెద్ద బ్యాటరీ కానుంది. అయితే, దీనివల్ల ఫోన్ బరువు 240 గ్రాముల కంటే ఎక్కువ ఉండవచ్చు. అలాగే, క్వాల్కమ్ మోడెమ్ స్థానంలో యాపిల్ సొంతంగా తయారు చేసిన సీ2 మోడెమ్ రానుంది. ఇది వేగవంతమైన 5జీ నెట్‌వర్క్‌ను అందిస్తుంది.
ఐఫోన్ 18 ప్రో- ధర, లాంచ్ వివరాలు (అంచనా)..
యాపిల్ తన ఆనవాయితీ ప్రకారం సెప్టెంబర్ 2026లో ఈ ఐఫోన్ 18 సిరీస్‌ని లాంచ్ చేసే అవకాశం ఉంది.
ఐఫోన్ 18 ప్రో- రూ. 1,34,900 నుంచి ప్రారంభం
ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్- రూ. 1,49,900 నుంచి ప్రారంభం
రానున్న రోజుల్లో ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించి మరిన్ని వివరాలు అందుబాటులోకి వస్తాయి.
ప్రశ్నలు- సమాధానాలు :-
ప్రశ్న- ఐఫోన్ 18 ప్రోలో డిజైన్ పరంగా వచ్చే అతిపెద్ద మార్పు ఏంటి?
సమాధానం- ఐఫోన్ 18 ప్రోలో డిస్‌ప్లే పైభాగంలో ఉండే 'డైనమిక్ ఐలాండ్' పిల్-షేప్ నుంచి చిన్న పంచ్-హోల్ కటౌట్‌గా మారే అవకాశం ఉంది. ఫేస్ ఐడీ సెన్సార్లు డిస్‌ప్లే కిందకు వెళ్లడం వల్ల ఇది సాధ్యమవుతుంది. కొన్ని లీకుల ప్రకారం ఈ సెల్ఫీ కెమెరా రంధ్రం స్క్రీన్ ఎడమ వైపు పైభాగంలో ఉండే అవకాశం ఉంది.
ప్రశ్న- ఐఫోన్ 18 ప్రో కెమెరాలో 'వేరియబుల్ అపెర్చర్' అంటే ఏంటి? దానివల్ల లాభం ఏంటి?
సమాధానం- సాధారణంగా ఐఫోన్స్‌లో లెన్స్ అపెర్చర్ (వెలుతురును లోపలికి పంపే ద్వారం) స్థిరంగా ఉంటుంది. కానీ వేరియబుల్ అపెర్చర్ వల్ల, వెలుతురు ఎక్కువగా ఉన్నప్పుడు లెన్స్ ద్వారం కుంచించుకుపోయి, తక్కువగా ఉన్నప్పుడు వెడల్పుగా మారుతుంది. దీనివల్ల రాత్రిపూట ఫోటోలు స్పష్టంగా వస్తాయి, బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ మరింత సహజంగా కనిపిస్తుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


