అతి తక్కువ ధరకు iPhone Air- రూ. 28వేల డిస్కౌంట్ని ఇలా పొందండి..
ఇండియాలో ఐఫోన్ ఎయిర్ ధర భారీగా తగ్గింది. విజయ్ సేల్స్ ఆఫర్‌లో ఈ లేటెస్ట్ మోడల్ ఒరిజినల్ ధర కంటే దాదాపు రూ. 28,000 తక్కువకే లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో కలిపి మరింత చౌకగా ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
భారతదేశంలో ఐఫోన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా కొత్త మోడల్ లాంచ్ అయినప్పుడు దాన్ని సొంతం చేసుకోవాలని చాలా మంది ఎదురుచూస్తుంటారు. అలాంటి వారికోసం ప్రముఖ రిటైల్ సంస్థ 'విజయ్ సేల్స్' ఒక బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. యాపిల్ లేటెస్ట్ మోడల్ అయిన ‘ఐఫోన్ ఎయిర్’పై భారీగా ధరను తగ్గించింది. లాంచ్ ప్రైజ్ కంటే ఏకంగా రూ. 28,000 పైగా తగ్గింపుతో ఈ ఫోన్ ఇప్పుడు వినియోగదారులకు అందుబాటులో ఉంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఐఫోన్ ఎయిర్ ధర ఎంత? ఆఫర్ ఏంటి?
ఐఫోన్ 17 సిరీస్‌తో పాటు మార్కెట్లోకి వచ్చిన ఈ ఐఫోన్ ఎయిర్ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 1,19,900. అయితే ప్రస్తుతం విజయ్ సేల్స్ అందిస్తున్న ప్రత్యేక ఆఫర్‌లో ఇది రూ. 94,990 కే లభిస్తోంది. ఇది మాత్రమే కాకుండా, అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులు లేదా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా మరో రూ. 4,000 డిస్కౌంట్ లభిస్తుంది. దీనివల్ల ఫోన్ ఎఫెక్టివ్ ధర కేవలం రూ. 90,990 కే తగ్గుతుంది. ఇటువంటి ఆఫర్లు పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటాయి కాబట్టి, ఆసక్తి ఉన్నవారు వెంటనే నిర్ణయం తీసుకోవడం మంచిది.
ఐఫోన్ ఎయిర్: అద్భుతమైన ఫీచర్లు..
ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం ధరలో మాత్రమే కాదు, ఫీచర్ల పరంగానూ అగ్రస్థానంలో నిలుస్తుంది. దీని ప్రధాన ఫీచర్లు ఇవే:
డిస్‌ప్లే: 6.5 ఇంచ్ సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే. ఇందులో 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన ప్రొమోషన్ టెక్నాలజీ ఉంది.
డిజైన్: టైటానియం ఫ్రేమ్, సెరామిక్ షీల్డ్ 2 ఫ్రంట్ కవర్‌తో ఈ ఫోన్ మునుపెన్నడూ లేనంత ధృడంగా ఉంటుందని యాపిల్ పేర్కొంది.
ప్రాసెసర్: అత్యంత శక్తివంతమైన ఏ19 ప్రో చిప్‌సెట్ ఇందులో ఉంది. పాత మోడల్స్ కంటే రెండు రెట్లు వేగంగా పనిచేసేలా సీ1ఎక్స్ మోడెమ్‌ను దీనికి జత చేశారు.
కెమెరా: 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ ప్రైమరీ కెమెరాతో పాటు 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయి. సెల్ఫీల కోసం 18 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఒకేసారి ముందు, వెనుక కెమెరాలతో వీడియో రికార్డింగ్ చేసుకునే సదుపాయం ఇందులో ఉంది.
ఐఫోన్ ఎయిర్- ఇతర ప్రత్యేకతలు..
ఈ ఐఫోన్ ఎయిర్ స్మార్ట్‌ఫోన్ వై-ఫై 7, బ్లూటూత్ 6 వంటి అత్యాధునిక కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకధాటిగా 40 గంటల పాటు వీడియో ప్లేబ్యాక్ చూసే అవకాశం ఉంటుంది. ఈ మోడల్ ప్రపంచవ్యాప్తంగా కేవలం ఈ-సిమ్‌తో మాత్రమే పనిచేస్తుంది.
యాప్స్ సులభంగా ఓపెన్ చేయడానికి యాక్షన్ బటన్, విజువల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ల కోసం కెమెరా కంట్రోల్ బటన్ వంటి కొత్త ఫీచర్లు ఈ ఐఫోన్ ఎయిర్‌ను మరింత ప్రత్యేకం చేశాయి.
మరి మీరు ఈ యాపిల్ ఐఫోన్ ఎయిర్ని కొనుగోలు చేస్తున్నారా?
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


