...
...
Next Story

IPL 2026 Schedule: ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ వర్సెస్ సన్ రైజర్స్.. తొలి 16 రోజుల షెడ్యూల్ రిలీజ్ చేసిన బీసీసీఐ

IPL 2026 Schedule: ఐపీఎల్ 2026 మార్చి 28న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. తొలి 20 మ్యాచ్ ల షెడ్యూల్ ను బీసీసీఐ రిలీజ్ చేసింది.

Published on: Mar 11, 2026 07:34 PM IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 సందడి మొదలైంది. బీసీసీఐ బుధవారం (మార్చి 11) ఈ మెగా టోర్నీకి సంబంధించిన తొలి 16 రోజుల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. మార్చి 28న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరిగే పోరుతో టోర్నీ ఘనంగా ప్రారంభం కానుంది.

కోహ్లీ వర్సెస్ కమిన్స్: గెలుపెవరిది?

IPL 2026 Schedule: ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ వర్సెస్ సన్ రైజర్స్.. తొలి 16 రోజుల షెడ్యూల్ రిలీజ్ చేసిన బీసీసీఐ (ANI)
IPL 2026 Schedule: ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ వర్సెస్ సన్ రైజర్స్.. తొలి 16 రోజుల షెడ్యూల్ రిలీజ్ చేసిన బీసీసీఐ (ANI)

ఈసారి ఐపీఎల్ స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, పాట్ కమిన్స్‌లకు అత్యంత కీలకం కానుంది. కివీస్‌తో వన్డే సిరీస్ తర్వాత కోహ్లీ మైదానంలోకి దిగుతుండగా, కమిన్స్ గత డిసెంబర్‌లో జరిగిన యాషెస్ సిరీస్ తర్వాత మళ్లీ క్రికెట్ ఆడుతున్నారు. మరోవైపు ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తన తొలి మ్యాచ్‌ను మార్చి 30న రాజస్థాన్ రాయల్స్‌తో గువహటిలో ఆడనుంది. ఈసారి రవీంద్ర జడేజా రాజస్థాన్ జట్టులోకి వెళ్లడం, సంజూ శాంసన్ మొదటిసారి ఎల్లో జెర్సీలో (CSK) కనిపించనుండటం ఆసక్తి రేపుతోంది.

ప్రధాన మ్యాచ్‌ల వివరాలు

తొలి రెండు రోజులు డబుల్ హెడర్స్ (రోజుకు రెండు మ్యాచ్‌లు) ఉండవు. మార్చి 29న ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య భారీ పోరు జరగనుంది. ఏప్రిల్ 5న ఆర్సీబీ వర్సెస్ సీఎస్‌కే, ఏప్రిల్ 12న ముంబై వర్సెస్ ఆర్సీబీ వంటి హై-వోల్టేజ్ మ్యాచ్‌లు షెడ్యూల్ అయ్యాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం ఎన్నికల దృష్ట్యా రెండో విడత షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ తేదీలను బట్టి తర్వాత ప్రకటించనున్నారు.

చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లు ఉంటాయా?

మార్చి 28: ఆర్‌సీబీ vs ఎస్‌ఆర్‌హెచ్ (బెంగళూరు) – మధ్యాహ్నం 3:30 గంటలకు

మార్చి 29: ముంబై ఇండియన్స్ vs కేకేఆర్ (ముంబై) – రాత్రి 7:30 గంటలకు

మార్చి 30: రాజస్థాన్ రాయల్స్ vs సీఎస్‌కే (గువహటి) – రాత్రి 7:30 గంటలకు

మార్చి 31: పంజాబ్ కింగ్స్ vs గుజరాత్ టైటాన్స్ (ముల్లన్‌పూర్) – రాత్రి 7:30 గంటలకు

ఏప్రిల్ 1: లక్నో సూపర్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (లక్నో) – రాత్రి 7:30 గంటలకు

ఏప్రిల్ 2: కేకేఆర్ vs ఎస్‌ఆర్‌హెచ్ (కోల్‌కతా) – రాత్రి 7:30 గంటలకు

ఏప్రిల్ 3: సీఎస్‌కే vs పంజాబ్ కింగ్స్ (చెన్నై) – రాత్రి 7:30 గంటలకు

ఏప్రిల్ 4: ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్ (ఢిల్లీ) – మధ్యాహ్నం 3:30 గంటలకు

ఏప్రిల్ 4: గుజరాత్ టైటాన్స్ vs రాజస్థాన్ రాయల్స్ (అహ్మదాబాద్) – రాత్రి 7:30 గంటలకు

ఏప్రిల్ 5: ఎస్‌ఆర్‌హెచ్ vs లక్నో సూపర్ జెయింట్స్ (హైదరాబాద్) – మధ్యాహ్నం 3:30 గంటలకు

ఏప్రిల్ 5: ఆర్‌సీబీ vs సీఎస్‌కే (బెంగళూరు) – రాత్రి 7:30 గంటలకు

ఏప్రిల్ 6: కేకేఆర్ vs పంజాబ్ కింగ్స్ (కోల్‌కతా) – రాత్రి 7:30 గంటలకు

ఏప్రిల్ 7: రాజస్థాన్ రాయల్స్ vs ముంబై ఇండియన్స్ (గువహటి) – రాత్రి 7:30 గంటలకు

ఏప్రిల్ 8: ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ టైటాన్స్ (ఢిల్లీ) – రాత్రి 7:30 గంటలకు

ఏప్రిల్ 9: కేకేఆర్ vs లక్నో సూపర్ జెయింట్స్ (కోల్‌కతా) – రాత్రి 7:30 గంటలకు

ఏప్రిల్ 10: రాజస్థాన్ రాయల్స్ vs ఆర్‌సీబీ (గువహటి) – రాత్రి 7:30 గంటలకు

ఏప్రిల్ 11: పంజాబ్ కింగ్స్ vs ఎస్‌ఆర్‌హెచ్ (ముల్లన్‌పూర్) – మధ్యాహ్నం 3:30 గంటలకు

ఏప్రిల్ 11: సీఎస్‌కే vs ఢిల్లీ క్యాపిటల్స్ (చెన్నై) – రాత్రి 7:30 గంటలకు

ఏప్రిల్ 12: లక్నో సూపర్ జెయింట్స్ vs గుజరాత్ టైటాన్స్ (లక్నో) – మధ్యాహ్నం 3:30 గంటలకు

ఏప్రిల్ 12: ముంబై ఇండియన్స్ vs ఆర్‌సీబీ (ముంబై) – రాత్రి 7:30 గంటలకు

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe