Iran-Israel War : అటాక్ చేస్తూనే ఉంటాం.. యుద్ధంపై ఇరాన్ సుప్రీం లీడర్ సంచలన ప్రకటన
Iran-Israel War : ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ సంచలన ప్రకటన చేశారు. గల్ఫ్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు ఎత్తేయాల్సిందేనన్నారు. లేదంటే అటాక్ చేస్తూనే ఉంటామన్నారు.
ఓవైపు ఇజ్రాయెల్, అమెరికాతో యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఇరాన్ కొత్త సుప్రీం ఆయతుల్లా మెుజ్తాబా ఖమేనీ సంచలన ప్రకటన చేశారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోజ్తాబా ఖమేనీ తన మొదటి ప్రకటన విడుదల చేశారు. గురువారం టెలివిజన్ ప్రసంగంలో ఖమేనీ జాతీయ ఐక్యతకు పిలుపునిచ్చారు. శత్రువులపై ఒత్తిడి తీసుకురావడానికి కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసివేయడం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

అంతేకాదు గల్ఫ్ దేశాల్లోని అన్ని అమెరికా స్థావరాలను వెంటనే మూసివేయాలని లేదంటే అటాక్ చేస్తూనే ఉంటామని హెచ్చరించారు ఇరాన్ సుప్రీం. ఇరాన్ పొరుగు దేశాలతో స్నేహాన్ని విశ్వసిస్తున్నప్పటికీ, ఈ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై దాడులు కొనసాగుతాయని ఖమేనీ అన్నారు. యెమెన్‌లోని ప్రతిఘటన కూడా పని చేస్తుందని సుప్రీం నాయకుడు అన్నారు. ఇరాక్‌లోని సాయుధ గ్రూపులు కూడా ఇస్లామిక్ విప్లవానికి సహాయం చేయాలనుకుంటున్నాయి అని తెలిపారు.
'మన దేశం ఒత్తిడిలో, దాడిలో ఉన్న సమయంలో గొప్ప పని చేస్తున్న యోధులకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇరాన్ పోరాటం కొనసాగిస్తుంది.' అని ఆయతుల్లా మెుజ్తాబా ఖమేనీ అన్నారు.
'మినాబ్ పాఠశాలపై దాడి సహా పలు ఘటనలపై ప్రతీకారం తీర్చుకుంటాం. ఇరాన్ తన అమరవీరుల రక్తానికి ప్రతీకారం తీర్చుకోకుండా ఉండదు. పొరుగు దేశాలతో ఇరాన్ స్నేహాన్ని విశ్వసిస్తోంది. అయినా అమెరికా స్థావరాలపై మాత్రం దాడులు కొనసాగుతాయి. పొరుగు దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని ఇరాన్ కోరుకుంటోంది. దాడుల్లో గాయపడినవారికి ఉచితంగా చికిత్స అందిస్తాం. ఆర్థికంగానూ ఆదుకుంటాం.' అని ఇరాన్ సుప్రీం లీడర్ తన తొలి ప్రకటనలో తెలిపారు.
ఫిబ్రవరిలో ప్రారంభమైన అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో తన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ హత్యకు గురయ్యాడు. తర్వాత మార్చి 9న ఇరాన్ సుప్రీం నాయకుడిగా నియమితులైన ఆయతుల్లా మెుజ్తాబా ఖమేనీ మొదటిసారిగా ప్రకటన విడుదల చేశారు.
తన తండ్రిపై జరిగిన దాడిలో మోజ్తాబా ఖమేనీ కూడా గాయపడినట్టుగా ఇజ్రాయెల్ భావిస్తోంది. ఈ దాడిలో కొత్త ఇరాన్ సుప్రీం లీడర్ కుటుంబ సభ్యులు మరణించారు. 56 ఏళ్ల మెుజ్తాబా తన తండ్రి కంటే కఠినంగా, సంప్రదాయవాదిగా కనిపిస్తాడని చెబుతారు.
ఇరాన్ సీనియర్ మతాధికారులు మెుజ్తాబాను కొత్త సుప్రీంగా ఎంపిక చేయడం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాశ వ్యక్తం చేస్తూ.. ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడారు. 'అతను శాంతియుతంగా జీవించగలడని నేను నమ్మను.' అని వ్యాఖ్యానించారు అన్నారు.
ట్రంప్ వ్యాఖ్యలు ఇలా ఉన్నప్పటికీ.. వైట్ హౌస్ మళ్లీ ఇరాన్ కొత్త సుప్రీం లక్ష్యంగా దాడులు చేస్తుందా? అనే చర్చ నడుస్తోంది. కానీ కేవలం వైమానిక దాడులు మాత్రమే ఇరాన్ నాయకత్వాన్ని గద్దె దించలేవని నిపుణులు అంటున్నారు. ఈ వారం వైమానిక, సముద్ర దాడులు తీవ్రతరం అయ్యాయి . ఇరాన్ కూడా ప్రతీకార దాడులను ముమ్మరం చేసింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


