బీమా రంగ నియంత్రణ ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) ప్రతిపాదించిన కీలక సంస్కరణలు స్టాక్ మార్కెట్లలో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. పాలసీల విక్రయాల్లో మిస్-సెల్లింగ్‌ను అరికట్టడం, కస్టమర్లకు మరింత పారదర్శకమైన డిజిటల్ సేవలు అందించడం లక్ష్యంగా ఐఆర్‌డీఏఐ నిబంధనల ముసాయిదాను విడుదల చేసింది. ఈ ప్రతిపాదనల ప్రభావంతో గురువారం, సెప్టెంబర్ 24న నాటి ట్రేడింగ్‌లో ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి.
పాతాళానికి ఇన్సూరెన్స్ షేర్లు

ఐఆర్‌డీఏఐ ప్రతిపాదించిన నూతన వ్యయ నియంత్రణ పరిమితులు బీమా రంగానికి గట్టి ఎదురుదెబ్బగా మారతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీల షేర్లలో భారీగా అమ్మకాలు వెల్లువెత్తాయి.
టర్టిల్‌మింట్ (Turtlemint): ఏకంగా 20 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకి రూ. 109.10 వద్ద నిలిచింది.
పిబి ఫిన్‌టెక్ (PB Fintech): పాలసీబజార్ మాతృసంస్థ పిబి ఫిన్‌టెక్ 10 శాతం లోయర్ సర్క్యూట్‌తో రూ. 1,701.00కి పడిపోయింది.
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్: 7.6 శాతం తగ్గి రోజువారీ కనిష్ట స్థాయి రూ. 448ని తాకింది.
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్: 5.6 శాతం నష్టపోయి రూ. 530.15కి చేరింది.
ఎస్‌బీఐ లైఫ్: 3.2 శాతం తగ్గి రూ. 1,700 వద్ద ట్రేడైంది.
ఐసీఐసీఐ లాంబార్డ్: 2.5 శాతం నష్టంతో రూ. 1,466.05 కి పడిపోయింది.
ఎల్‌ఐసీ (LIC): 2 శాతం నష్టపోయి రూ. 399 వద్ద స్థిరపడింది.
ఐఆర్‌డీఏఐ ప్రతిపాదించిన కీలక మార్పులు
బీమా ఏజెంట్లు, బ్యాంకులు, విక్రయ దారులకు చెల్లించే కమిషన్ పరిమితులు (EoM), నిర్వహణ వ్యయాలపై ఐఆర్‌డీఏఐ గట్టి నిబంధనలను ప్రతిపాదించింది.
ఓపెన్ ఆర్కిటెక్చర్ కమిషన్ల తగ్గింపు: బ్యాంకులు, బ్రోకర్ల ద్వారా విక్రయించే బీమా పాలసీలకు ఇచ్చే కమిషన్లను గణనీయంగా తగ్గించాలని సూచించింది.
థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్: మోటార్ వాహనాల తప్పనిసరి థర్డ్ పార్టీ బీమాకు అతితక్కువ లేదా ఎలాంటి కమిషన్ ఉండకూడదని పేర్కొంది.
{{/usCountry}}థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్: మోటార్ వాహనాల తప్పనిసరి థర్డ్ పార్టీ బీమాకు అతితక్కువ లేదా ఎలాంటి కమిషన్ ఉండకూడదని పేర్కొంది.
{{/usCountry}}రుణాలతో బీమా లింక్ నిషేధం: బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు రుణ ఇచ్చే సమయంలో ఇన్సూరెన్స్ పాలసీలను బలవంతంగా ముడిపెట్టడాన్ని నిషేధించింది. ఈ రుణ అను అనుబంధ ఇన్సూరెన్స్‌లపై కమిషన్‌ను కేవలం 2% నుండి 5% కి సీలింగ్ విధించింది.
హెల్త్ ఇన్సూరెన్స్: కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ విక్రయించినప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చే కమిషన్‌ను 15% నుండి 20% మధ్య పరిమితం ప్రతిపాదించింది. అయితే, పాలసీ రెన్యూవల్స్ లేదా పోర్టింగ్ సమయంలో ఇచ్చే కమిషన్‌ను 5% నుండి 10% కి మాత్రమే పరిమితం చేయనున్నారు.
లైఫ్ ఇన్సూరెన్స్: జీవిత బీమా పాలసీల వ్యవధి ఆధారంగా మొదటి సంవత్సరం చెల్లించే కమిషన్‌ను 5% నుండి 20% లోపు నిరోధించాలని భావిస్తోంది.
అక్టోబర్ 25 వరకు గడువు
ఈ నూతన ముసాయిదా ప్రతిపాదనలపై భాగస్వాములు, బీమా కంపెనీల నుంచి ఫీడ్‌బ్యాక్ స్వీకరించేందుకు ఐఆర్‌డీఏఐ అక్టోబర్ 25 వరకు అవకాశం కల్పించింది. దీనిపై అందరి అభిప్రాయాలను సమీక్షించిన అనంతరం తుది మార్గదర్శకాలను అధికారికంగా ఖరారు చేయనుంది.