ల్యాప్‌టాప్‌ని ఎప్పుడూ ఛార్జింగ్‌లో ఉంచడం మంచిదేనా? నిపుణుల మాట ఇది..
ల్యాప్‌టాప్‌ను ఎప్పుడూ ఛార్జింగ్‌లో ఉంచడం మంచిదేనా? ఈ ప్రశ్న మనలో చాలా మందికి వచ్చే ఉంటుంది! బ్యాటరీ ఆరోగ్యానికి నిపుణులు కొన్ని సలహాలు ఇస్తున్నారు. వాటి గురించి ఇక్కడ వివరంగా తెలుసుకోండి..
చాలా మంది ల్యాప్‌టాప్ వినియోగదారులు.. పని కోసం, ఆన్‌లైన్ క్లాసుల కోసం లేదా కంటెంట్ స్ట్రీమింగ్ కోసం, తమ పరికరాలను రోజంతా ప్లగిన్లోనే ఉంచుతారు. కొందరైతే ఛార్జర్‌ను పోర్ట్ నుంచి అరుదుగా మాత్రమే తీస్తారు. అయితే, ఈ అలవాటు నిజంగా బ్యాటరీ జీవితకాలాన్ని ప్రభావితం చేస్తుందా? మీరు ఛార్జ్ చేసే విధానం, ల్యాప్‌టాప్‌ను ఉంచే ప్రదేశంపైనే జవాబు ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు.

ఆధునిక ల్యాప్‌టాప్‌లలో బ్యాటరీ రక్షణ ఎలా పనిచేస్తుంది?
ఆధునిక ల్యాప్‌టాప్‌లలో బ్యాటరీ పూర్తిగా నిండిన తర్వాత ఛార్జింగ్‌ను నిలిపివేసే వ్యవస్థలు అంతర్నిర్మితమై ఉంటాయి. ఇది ఓవర్ఛార్జింగ్ని నిరోధిస్తుంది. దీని అర్థం, ల్యాప్‌టాప్‌ను ప్లగ్‌లో ఉంచడం వల్ల బ్యాటరీకి వెంటనే ఎటువంటి నష్టం జరగదు!
అయితే, దీర్ఘకాలిక ప్రభావాలు మాత్రం ఉండే అవకాశం ఉంది. ల్యాప్‌టాప్‌లలో ప్రామాణికంగా ఉపయోగించే లిథియం-అయాన్ బ్యాటరీలు కాలక్రమేణా సహజంగానే డీగ్రేడ్ అవుతుంటాయి. ఎక్కువ గంటలు పూర్తి ఛార్జింగ్‌లో ఉండటం వల్ల ఈ ప్రక్రియ కొద్దిగా వేగవంతం అవుతుంది. ఫిజికల్ కెమిస్ట్రీ కెమికల్ ఫిజిక్స్ అధ్యయనం ప్రకారం.. అధిక ఛార్జ్, వేడి ఉన్నప్పుడు లిథియం-అయాన్ బ్యాటరీలు వేగంగా పాతపడతాయి. ఎందుకంటే, ఇది బ్యాటరీ సెల్‌లపై రసాయనికంగా ఒత్తిడిని పెంచుతుంది.
బ్యాటరీ అరిగిపోవడంలో వేడి పాత్ర..
బ్యాటరీ ఆరోగ్యానికి హీట్ చాలా కీలకమైన అంశం.
ల్యాప్‌టాప్‌ను మంచాలు, దుప్పట్లు వంటి మృదువైన ఉపరితలాలపై ఉంచినప్పుడు, వేడి బయటకు పోకుండా లోపలే ఉండిపోతుంది! దీనివల్ల బ్యాటరీ పాతబడే వేగం పెరుగుతుంది. అలాగే వీడియో ఎడిటింగ్, గేమింగ్ లేదా రెండరింగ్ వంటి ఎక్కువ పనిభారం ఉండే టాస్క్‌లు కూడా అంతర్గత ఉష్ణోగ్రతలను పెంచుతాయి.
వేడిగా ఉన్న ల్యాప్‌టాప్‌ను ప్లగ్‌లోనే ఉంచడం వల్ల బ్యాటరీ అధిక ఛార్జ్, అధిక వేడి రెండింటికి గురవుతుంది. ఇది అరుగుదలను రెట్టింపు చేస్తుంది. మంచి వెంటిలేషన్ (గాలి ప్రసరణ) గట్టి, చదునైన ఉపరితలాలను ఉపయోగించడం వల్ల ఈ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.
నిపుణుల సిఫార్సులు
ఛార్జ్ లెవల్: బ్యాటరీ జీవితకాలం పెంచడానికి, ఛార్జ్ స్థాయిని సుమారుగా 40 శాతం నుంచి 80 శాతం మధ్య ఉంచాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
బ్యాటరీ సంరక్షణ మోడ్‌లు: చాలా ల్యాప్‌టాప్ బ్రాండ్‌లు గరిష్ట ఛార్జింగ్‌ను పరిమితం చేయడానికి, బ్యాటరీని రక్షించడానికి “బ్యాటరీ కేర్” లేదా “కన్జర్వేషన్ మోడ్‌ల”ను అందిస్తున్నాయి. వీటిని ఉపయోగించడం ఉత్తమం.
ల్యాప్‌టాప్ చల్లగా ఉండి, వెంటిలేషన్ రంధ్రాలు క్లియర్‌గా ఉన్నంత వరకు, డెస్క్-ఆధారిత పని, వీడియో కాల్స్, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి వంటి పనులకు నిరంతరం ప్లగ్‌లోనే ఉంచి పనిచేయడం పూర్తిగా సురక్షితం.
బ్యాటరీని రక్షించుకోవడానికి టిప్స్:
- ల్యాప్‌టాప్‌ను గట్టి, చదునైన ఉపరితలంపై ఉంచండి.
- బ్యాటరీ కన్జర్వేషన్ లేదా కేర్ మోడ్‌లను ఉపయోగించండి.
- మృదువైన ఉపరితలాలపై ఎక్కువ పనిభారం ఉండే పనులను నివారించండి.
- అప్పుడప్పుడు బ్యాటరీని డిశ్చార్జ్ అవ్వనివ్వండి.
- వెంటిలేషన్ రంధ్రాలను శుభ్రంగా ఉంచండి.
- ఎక్కువ కాలం పాటు పరికరాన్ని పూర్తి ఛార్జింగ్‌లో ఉంచి నిల్వ చేయకండి.
చివరిగా.. ఆధునిక ల్యాప్‌టాప్‌లు నిరంతర ఛార్జింగ్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తాయి. కానీ వేడి, పూర్తిగా నిండిన బ్యాటరీలు కాలక్రమేణా బ్యాటరీ పాతబడటాన్ని ప్రభావితం చేస్తాయి. వెంటిలేషన్ నిర్వహించడం, కన్జర్వేషన్ సెట్టింగ్‌లను ఉపయోగించడం వంటి సాధారణ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా, వినియోగదారులు దీర్ఘకాలిక బ్యాటరీ ఆరోగ్యాన్ని పెద్దగా ప్రభావితం చేయకుండా ప్లగ్‌లోనే ఉండి పని చేసుకోవచ్చు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


