ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మరింతగా ముదురుతోంది. సుప్రీం లీడర్ ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది. ఖమేనీ మృతికి ప్రతీకారంగా లెబనాన్ లోని హిజ్జుల్లా గ్రూప్ ఇజ్రాయెల్ దాడి చేసింది. నార్త్ ఇజ్రాయెల్లోని హైఫా టార్గెట్గా హిజ్బుల్లా తీవ్రవాదులు ఎటాక్ చేశారు. దీనికి ప్రతీకారంగా లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ దాడికి దిగింది. ఈ దాడుల్లో పలు భవనాల కిటికీలు ధ్వంసమయ్యాయి. ఒక నివాస గృహంలో మంటలు చెలరేగినట్లు తెలిసింది. దీంతో అక్కడి ప్రజల్లో ఆందోళన నెలకొంది.
సౌత్ లెబనాన్లో హిజ్బుల్లా తీవ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేపట్టింది. 2024లోనే హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. కానీ ఖమేనీ మృతి తర్వాత మళ్లీ దాడులు మొదలయ్యాయి.
లెబనాన్‌లో ఇరాన్ మద్దతుతో హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థ తన స్థావరాలను కొనసాగిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ స్థావరాలను ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. ఈ నేపథ్యంలో సరిహద్దు పరిసర ప్రాంతాల్లోని ప్రజలు వెంటనే తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది.
హిజ్బుల్లా నియంత్రణలో ఉన్న దక్షిణ శివారు ప్రాంతాలైన బీరుట్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. డజనుకు పైగా పేలుళ్లు సంభవించాయి. బీరూట్ సమీపంలో సీనియర్ హిజ్బుల్లా తీవ్రవాదులపై కూడా దాడి చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.
2024 లో అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ - హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. కానీ ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి, ఖమేనీ చనిపోవటం పరిణామాల నేపథ్యంలో ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా యుద్ధంలోకి దిగింది.
మరోవైపు ఇరాన్ కూడా క్షిపణి దాడులకు దిగుతోంది. మధ్య ప్రాంతాల నుంచి "శత్రు ప్రదేశాలు" వైపు క్షిపణులను ప్రయోగిస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా సోమవారం ఉదయం తెలిపింది.
{{/usCountry}}మరోవైపు ఇరాన్ కూడా క్షిపణి దాడులకు దిగుతోంది. మధ్య ప్రాంతాల నుంచి "శత్రు ప్రదేశాలు" వైపు క్షిపణులను ప్రయోగిస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా సోమవారం ఉదయం తెలిపింది.
{{/usCountry}}మరోవైపు ఇరాన్ పై దాడి కొనసాగుతుందని వైట్ హౌస్(ఆమెరికా) ప్రకటించింది.ప్రస్తుతానికి… ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ నిరంతరాయంగా కొనసాగుతోందని ఓ అధికారి చెప్పారు.
ఈ యుద్ధంలో భాగంగా కువైట్ లోని ఓ స్థావరంలో విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వీరి మరణాలను అమెరికా ధ్రువీకరించింది. ప్రాణాలు కోల్పోయిన సైనికులను నిజమైన అమెరికన్ దేశభక్తులు అంటూ ట్రంప్ అభివర్ణించారు. వారి మృతికి సంతాపంగా నివాళులు అర్పించారు.