Ranji Trophy: ఇండియా క్రికెట్లో హిస్టరీ.. 69 ఏళ్ల తర్వాత తొలిసారి.. రంజీ ట్రోఫీ సొంతం చేసుకున్న జమ్ము కశ్మీర్

Ranji Trophy: అద్భుతం జరిగింది. ఇండియా క్రికెట్లో ఇదో కొత్త హిస్టరీ. 69 ఏళ్ల తర్వాత తొలిసారి జమ్ము కశ్మీర్ రంజీ ట్రోఫీ ఛాంపియన్ గా నిలిచింది. ఫైనల్లో కర్ణాటకపై విజయం సాధించింది. 

Published on: Feb 28, 2026 4:18 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇండియా డొమెస్టిక్ క్రికెట్లో సంచలనం. 69 ఏళ్ల తమ రంజీ ట్రోఫీ ప్రయాణంలో జమ్ము కశ్మీర్ మొట్టమొదటి సారి ఛాంపియన్ గా నిలిచింది. రంజీ ట్రోఫీని సగర్వంగా ముద్దాడింది. శనివారం (ఫిబ్రవరి 28) రంజీ ట్రోఫీ ఫైనల్లో కర్ణాటకపై విజయంతో జమ్ము కశ్మీర్ కొత్త చరిత్ర లిఖించింది. భారత దేశవాళీ క్రికెట్లో తన ప్రస్థానాన్ని ఘనంగా చాటింది.

జమ్ము కశ్మీర్ టీమ్ (PTI)
జమ్ము కశ్మీర్ టీమ్ (PTI)

69 ఏళ్ల తర్వాత

1959లో జమ్ము కశ్మీర్ తొలిసారి రంజీ ట్రోఫీలో ఆడింది. అప్పటి నుంచి టైటిల్ వేట కొనసాగిస్తూనే ఉంది. ఇప్పుడు 69 ఏళ్ల తర్వాత ఆ టీమ్ కల నెరవేరింది. ఇవాళ ఫైనల్లో కర్ణాటకపై విజయంతో తొలిసారి రంజీ ట్రోఫీని సగర్వంగా అందుకుంది. భారత క్రికెట్ చరిత్రలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు అని చెప్పొచ్చు.

8 సార్లు విజేత

రంజీ ట్రోఫీ 2026 ఫైనల్లో జమ్ము కశ్మీర్ అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 సార్లు రంజీ ట్రోఫీ ఛాంపియన్ అయిన కర్ణాటకను జమ్ము కశ్మీర్ ఓడించింది. పారస్ డోగ్రా కెప్టెన్సీలోని జమ్ము కశ్మీర్ ఈ తుదిపోరులో అసలైన ఛాంపియన్ లాగే ఆడింది. మ్యాచ్ డ్రాగా ముగిసినా కర్ణాటకపై ఫస్ట్ ఇన్నింగ్స్ ఆధిక్యంతో జమ్ము కశ్మీర్ విజేతగా నిలిచింది.

శుభమ్ అదుర్స్

రంజీ ట్రోఫీ ఫైనల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జమ్ము కశ్మీర్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 584 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌటైంది. శుభమ్ పుందిర్ 121 రన్స్ తో అదరగొట్టాడు. యావర్ హాసన్ 88, సాహిల్ లోత్రా 72, కెప్టెన్ పారస్ 70, కన్హయ్య 70 కూడా రాణించారు. కర్ణాటక బౌలర్లలో ప్రసిద్ధ్ 5 వికెట్లు తీసుకున్నాడు.

చెలరేగిన ఆఖిబ్

కర్ణాటక ఫస్ట్ ఇన్నింగ్స్ లో కేవలం 293 పరుగులకే ఆలౌటైంది. ఆ టీమ్ లో మయాంక్ అగర్వాల్ 160 పరుగులతో పోరాడాడు. కేఎల్ రాహుల్ 13, దేవ్ దత్ పడిక్కల్ 11, కరుణ్ నాయర్ 0 దారుణంగా ఫెయిల్ అయ్యారు. జమ్ము కశ్మీర్ బౌలర్ ఆఖిబ్ నబి 5 వికెట్లతో కర్ణాటక పనిపట్టాడు. సునీల్ కుమార్, యుధ్ వీర్ చెరో రెండు వికెట్లు తీశారు.

అనంతరం రెండో ఇన్నింగ్స్ ను జమ్ము కశ్మీర్ 342/4 స్కోరు దగ్గర డిక్లేర్ చేసింది. ఓపెనర్ ఖమ్రాన్ ఇక్బావ్ 160 నాటౌట్ గా నిలిచాడు. సాహిల్ లోత్రా 101 రన్స్ తో అదరగొట్టాడు. అయిదో రోజు కర్ణాటక బ్యాటింగ్ చేసినా ఈ టార్గెట్ ఛేజ్ చేసే ఛాన్స్ లేకపోవడంతో రెండు టీమ్స్ కెప్టెన్ డ్రాకు ఒప్పుకొన్నారు. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్ ఆధారంగా జమ్ము కశ్మీర్ గెలిచింది.