...
...
Next Story

Maharashtra Accident : ఆనందం.. మరుక్షణమే తీవ్ర దుఖం! బావిలో పడిన కారు- ఆరుగురు చిన్నారులు మృతి

మహారాష్ట్ర నాసిక్​ జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఒక కారు బావిలో పడిపోయింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మరణించారు. వీరిలో ఆరుగురు చిన్నారులు ఉన్నారు.

Published on: Apr 4, 2026, 09:46:33 IST
Advertisement

మహారాష్ట్రలో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. నాసిక్​ జిల్లాలో ఓ కారు బావిలో పడిపోయింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆరుగురు చిన్నారులు సైతం ఉన్నారు.

అసలేం జరిగింది?

మహారాష్ట్ర కారు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి..
మహారాష్ట్ర కారు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి..

శివరాజ్​ నగర్​ ప్రాంతంలో శుక్రవారం రాత్రి 10 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఫంక్షన్​ అనంతరం కుటుంబసభ్యులు అందరు కలిసి కారులో ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. కానీ ఫంక్షన్​ హాల్​కి సమీపంలోనే ఉన్న బావిలో కారు పడిపోయింది.

అది గమనించిన స్థానికులు పోలీసులు, అత్యవసర సేవల విభాగాలకు వెంటనే సమాచారం అందించి, సహాయక చర్యలు చేపట్టారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది సైతం సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అనంతరం, రెండు క్రేన్​లు, స్విమ్మర్లతో.. బావిలో నుంచి కారును బయటకు తీశారు. రాత్రంతా సహాయక చర్యలు జరిగాయి.

మహారాష్ట్ర కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారు ఇండోర్​కి (దిందోరి తాలూకా) చెందిన వారని పోలీసులు తెలిపారు. సునిల్​ దత్తు దర్గుడే (32)- ఆయన భార్య రేష్మ , ఆషా అనిల్​ దర్గుడే (32), ఆరుగురు పిల్లలు (వీరిలో ఐదురుగు బాలికలు ఉన్నారు) మరణించారు.

మృతదేహాలను వెలికి తీసిన అనంతరం పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు.

ఈ ప్రమాదం ఎలా జరిగింది? అన్న విషయంపై ప్రస్తుతం అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా.. డ్రైవర్​ అదుపు తప్పడం వల్ల, రోడ్డు పక్కనే ఉన్న బావిలో కారు పడిపోయిందని తెలుస్తోంది.

తాజాగా ఘటనతో బాధిత కుటుంబం నివాసముంటున్న గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

పెళ్లికి వెళ్లి వస్తుండగా విషాదం..

కన్నౌజ్ జిల్లాకు చెందిన మహ్మద్ వసీం (34), అతని సోదరుడి కుమారుడు సత్తార్ (50), వారి పొరుగువాడు అఫ్తాబ్ (35) కలిసి మెయిన్‌పురిలో జరిగిన ఒక వివాహ వేడుకకు హాజరయ్యారు. గురువారం రాత్రి పని ముగించుకుని తిరిగి తమ స్వగ్రామానికి బైక్‌పై బయలుదేరారు. గ్వాలియర్-బరేలీని కలిపే జాతీయ రహదారి 92పై పాలిటెక్నిక్ కళాశాల సమీపానికి చేరుకోగానే, ఒక భారీ వాహనం వీరి మోటార్ సైకిల్‌ను బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో వసీం, సత్తార్ రోడ్డుపై పడగా.. అఫ్తాబ్ కొంత దూరంలో ఎగిరి పడ్డాడు. రోడ్డుపై పడిన వసీం, సత్తార్‌లను గమనించేలోపే వెనుక నుంచి వచ్చిన పలు వాహనాలు వారిపై నుంచి దూసుకుపోయాయి. దీనితో వారు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన అఫ్తాబ్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు.

ఈ ఘటనపై కిస్నీ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఛత్రపాల్ సింగ్ మాట్లాడుతూ.. ప్రమాదానికి కారణమైన గుర్తుతెలియని వాహనంపై కేసు నమోదు చేశామని తెలిపారు. బాధ్యులను పట్టుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు, వారి స్నేహితుడు మరణించడంతో కన్నౌజ్ జిల్లాలో విషాద ఛాయలు అలముకున్నాయి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe