Mahindra be 07 launch date : భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటున్న మహీంద్రా అండ్ మహీంద్రా.. మరో అద్భుతమైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని సిద్ధం చేస్తోంది. ఇప్పటికే మార్కెట్లో సంచలనం సృష్టించిన ఎక్స్‌ఈవీ 9ఈ, ఎక్స్‌ఈవీ 9ఎస్, బీఈ 6 మోడళ్ల తర్వాత.. 'బీఈ 07' కాన్సెప్ట్ ఆధారంగా తన నాలుగో బోర్న్-ఎలక్ట్రిక్ వాహనాన్ని కంపెనీ తీసుకువస్తోంది. స్పోర్టీ లుక్‌తో ఉండే బీఈ 6 మోడల్ యువతను ఆకట్టుకుంటుండగా, ఈ బీఈ 07 మోడల్ మరింత హుందాగా, విశాలంగా, లగ్జరీగా ఉండబోతోంది.
డిజైన్: 'రేంజ్ రోవర్'ను తలపించేలా..

మహీంద్రా బీఈ 07 డిజైన్ అత్యంత ఆకర్షణీయంగా, ఒక శక్తివంతమైన ఎస్‌యూవీకి ఉండాల్సిన అన్ని లక్షణాలతో తయారవుతోంది. ఇటీవల బయటకు వచ్చిన స్పై షాట్స్ ప్రకారం.. ఈ ఎలక్ట్రిక్ కారు బాక్సీ షేప్‌లో, నిటారుగా ఉండే ఒక పటిష్టమైన ఎస్‌యూవీ రూపాన్ని కలిగి ఉంది.
దీని డిజైన్ లగ్జరీ 'రేంజ్ రోవర్' కార్లను గుర్తుకు తెచ్చేలా ఉంది.
ముఖ్య ఫీచర్లు: ఇందులో వెర్టికల్ ఎల్ఈడీ డే-టైమ్ రన్నింగ్ ల్యాంప్స్, ఫ్లాట్ రూఫ్‌లైన్, వెనుక భాగంలో క్లీన్ ప్రొఫైల్ ఉన్నాయి.
ఏరోడైనమిక్స్: గాలి ఒత్తిడిని తట్టుకునేలా ఏరో-ఆప్టిమైజ్ చేసిన 19-ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ దీనికి ప్రీమియం లుక్‌ని ఇస్తున్నాయి.
విశాలమైన స్పేస్: బీఈ 6తో సమానంగా 2775ఎంఎం వీల్‌బేస్ ఉన్నప్పటికీ, బీఈ 07 ఈవీ దానికంటే పొడవుగా, ఎత్తుగా ఉంటుంది. దీనివల్ల ప్రయాణికులకు ఎక్కువ హెడ్-రూమ్ మరియు భారీ బూట్ స్పేస్ లభిస్తుంది.
మహీంద్రా బీఈ 07- 600 కి.మీ రేంజ్‌తో..!
మహీంద్రా అభివృద్ధి చేసిన అత్యాధునిక 'INGLO' మోడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పై ఈ కారును నిర్మిస్తున్నారు. దీనిని హై-పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ డ్రైవ్ ట్రైన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది.
బ్యాటరీ ఆప్షన్లు: ఇది 59 kWh, 79 kWh అనే రెండు బ్యాటరీ ఛాయిస్‌లతో వచ్చే అవకాశం ఉంది.
{{/usCountry}}బ్యాటరీ ఆప్షన్లు: ఇది 59 kWh, 79 kWh అనే రెండు బ్యాటరీ ఛాయిస్‌లతో వచ్చే అవకాశం ఉంది.
{{/usCountry}}మైలేజ్: ముఖ్యంగా 79 kWh వేరియంట్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 600 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుందని కంపెనీ అంచనా వేస్తోంది. రియల్ వరల్డ్‌లో కూడా ఇది 500 కిలోమీటర్ల వరకు సునాయాసంగా ప్రయాణించే అవకాశం ఉంది.
మహీంద్రా బీఈ 07- ట్రిపుల్ స్క్రీన్ డాష్‌బోర్డ్..
కారు లోపలి భాగం ఒక కొత్త ప్రపంచాన్ని తలపిస్తుంది. ఇందులో అత్యాధునిక 'ట్రిపుల్ స్క్రీన్' సెటప్‌ను మహీంద్రా పరిచయం చేస్తోంది:
డ్రైవర్ డిస్‌ప్లే: 12.3- ఇంచ్ డిజిటల్ స్క్రీన్.
ఇన్ఫోటైన్‌మెంట్: మధ్యలో 12.3- ఇంచ్ ప్రధాన స్క్రీన్.
ప్యాసింజర్ ఎంటర్‌టైన్‌మెంట్: పక్కన కూర్చున్న వ్యక్తి కోసం ప్రత్యేకంగా మరో 12.3- ఇంచ్ స్క్రీన్.
వీటితో పాటు, 16-స్పీకర్ల హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్, భారీ పనోరమిక్ సన్‌రూఫ్, సెంటర్ కన్సోల్‌పై టచ్-సెన్సిటివ్ హ్యాప్టిక్ కంట్రోల్స్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
మహీంద్రా బీఈ 07- లాంచ్, ధర అంచనా..
మహీంద్రా బీఈ 07 ప్రొడక్షన్ వెర్షన్‌ను 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం ఉంది. అయితే అధికారిక విక్రయాలు మాత్రం 2027లో ప్రారంభమవుతాయి. మార్కెట్లో దీని ధర సుమారు రూ. 25 లక్షల నుంచి రూ. 30 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా.
ఇది మార్కెట్లోకి వస్తే టాటా హారియర్ ఈవీ, బీవైడీ అట్టో 3, విన్‌ఫాస్ట్ వీఎఫ్7 వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం.