...
...
Next Story

Mahindra Electric car మహీంద్రా నుంచి మరో ఎలక్ట్రిక్ సంచలనం! 679 కిమీ రేంజ్​తో బీఈ 07- ఫీచర్లు..

Mahindra be 07 : భారత ఈవీ మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న మహీంద్రా అండ్ మహీంద్రా, తన సరికొత్త బాన్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'మహీంద్రా బీఈ 07'ని 2027లో లాంచ్ చేసేందుకు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యలో ఈ ఈవీపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Jul 06, 2026 07:28 AM IST
Advertisement

భారతీయ ఎస్‌యూవీ కింగ్ 'మహీంద్రా అండ్ మహీంద్రా' దేశీయ ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకునే పనిలో పడింది. ఇప్పటికే ఇంగ్లో ఆర్కిటెక్చర్‌పై ఆధారపడిన బీఈ6, ఎక్స్​ఈవీ 9ఈ, ఎక్స్​ఈవీ 9ఎస్ వంటి పవర్‌ఫుల్ బాన్-ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తున్న మహీంద్రా.. ఇప్పుడు తన తదుపరి అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది. గతంలో ప్రదర్శించిన 'మహీంద్రా బీఈ.07' కాన్సెప్ట్ మోడల్‌ను ఇప్పుడు ప్రొడక్షన్ దశకు తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ సరికొత్త ఈవీ రోడ్లపై టెస్టింగ్ జరుపుకుంటుండగా.. దీనికి సంబంధించిన డిజైన్, ఇంటీరియర్ లీకులు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

మహీంద్రా బీఈ 07 ఎలక్ట్రిక్ ఎస్​యూవీ- ఫ్యూచరిస్టిక్ డిజైన్!

మహీంద్రా బీఈ 07 ఎలక్ట్రిక్ ఎస్​యూవీ..
మహీంద్రా బీఈ 07 ఎలక్ట్రిక్ ఎస్​యూవీ..

దాదాపు 4.6 మీటర్ల పొడవుతో ఉండే మహీంద్రా బీఈ 07, తన కాన్సెప్ట్ రూపానికి ఏమాత్రం తగ్గకుండా అత్యంత ఆధునికంగా రూపుదిద్దుకుంది. ముందుభాగంలో సి-షేప్డ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, షార్ప్‌గా డిజైన్ చేసిన ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు ఈ కారుకు ప్రీమియం లుక్‌ని ఇస్తున్నాయి. ఎలక్ట్రిక్ కారు కావడం వల్ల గ్రిల్ భాగాన్ని పూర్తిగా క్లోజ్ చేశారు.

ఈ కారు సైడ్ ప్రొఫైల్‌ను గమనిస్తే.. టర్బైన్ స్టైల్‌లో ఉండే 18 లేదా 19 ఇంచుల అలాయ్ వీల్స్, ఫ్రేమ్‌లెస్ డోర్లు, ఫ్లష్-టైప్ (లోపలికి నొక్కి ఉండే) డోర్ హ్యాండిల్స్, వెనుక వైపు వాలిపోయే స్లోపింగ్ రూఫ్‌లైన్ ఆకట్టుకుంటున్నాయి. కారు ముందు బంపర్‌పై అడాస్ సెన్సార్, రాడార్, ఫ్రంట్ కెమెరాతో పాటు మల్టిపుల్ పార్కింగ్ సెన్సార్లను కూడా అమర్చారు.

మహీంద్రా బీఈ 07 ఎలక్ట్రిక్ ఎస్​యూవీ- లగ్జరీ ఇంటీరియర్!

మహీంద్రా బీఈ 07 ఇంటీరియర్ వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించనప్పటికీ, ఇది కంపెనీ టాప్ ఎండ్ మోడల్స్ అయిన ఎక్స్​ఈవీ 9ఈ తరహాలోనే అత్యంత విలాసవంతంగా ఉండబోతున్నట్లు లీకుల ద్వారా తెలుస్తోంది.

మహీంద్రా బీఈ 07 తన పవర్‌ట్రెయిన్‌ను ఎక్స్​ఈవీ 9ఎస్ మోడల్‌తో పంచుకోనుంది. ఈ కారు 59kWh, 70kWh, 79kWh అనే మూడు రకాల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో రానున్నట్లు సమాచారం.

బేస్ వేరియంట్ అయిన 59kWh బ్యాటరీ సింగిల్ ఛార్జ్‌పై 542 కిలోమీటర్ల రేంజ్ (ఎంఐడీసీ) ఇస్తుంది. మిడ్ వేరియంట్ 70kWh బ్యాటరీ 600 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఇక టాప్ ఎండ్ 79kWh బ్యాటరీ ప్యాక్ ఏకంగా 679 కిలోమీటర్ల అద్భుతమైన రేంజ్‌ను ఆఫర్ చేయనుంది.

మహీంద్రా బీఈ 07 ఎలక్ట్రిక్ ఎస్​యూవీ- మార్కెట్లో పోటీ ఎవరితో అంటే?

మహీంద్రా తన బీఈ 07 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని మిడ్-ప్రీమియం విభాగంలో లాంచ్ చేయనుంది. మార్కెట్ పొజిషనింగ్ పరంగా చూస్తే, ఇది హ్యుందాయ్ క్రెటా ఈవీ, మారుతీ సుజుకీ ఈ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ ఈబెల్లా కంటే ఒక సెగ్మెంట్ పైనే ఉండబోతోంది. భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన తర్వాత ఇది టాటా హారియర్ ఈవీ, విన్‌ఫాస్ట్ వీఎఫ్7 కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

2027లో ఈ మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ ఎస్​యూవీ లాంచ్​ అవుతుందని తెలుస్తోంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON