...
...
Next Story

మహీంద్రా XEV 9e స్పోర్టెక్ సిరీస్.. కొత్త బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లు!

ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభాగంలో దూసుకుపోతున్న మహీంద్రా వచ్చే ఏడాది ప్రారంభంలో 'ఎక్స్​ఈవీ 9ఈ స్పోర్టెక్ సిరీస్'ను తీసుకురానుంది. కొత్త 70 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్, డ్రిఫ్ట్ మోడ్, సరికొత్త రంగులతో రానున్న ఈ ఎలక్ట్రిక్ కూపే ఎస్‌యూవీ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

Published on: Nov 22, 2026, 09:15:24 IST
Advertisement

భారత ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) మార్కెట్లో తనదైన ముద్ర వేసిన దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా.. తన ప్రీమియం ఎలక్ట్రిక్ కూపే ఎస్‌యూవీ ‘ఎక్స్​ఈవీ 9ఈ’లో సరికొత్త ‘స్పోర్టెక్ సిరీస్’ను వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రవేశపెట్టనుంది. ఈ ఎలక్ట్రిక్ కూపే ఎస్‌యూవీ మార్కెట్లోకి అడుగుపెట్టి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా కంపెనీ ఈ కీలక అప్‌డేట్‌ను సిద్ధం చేస్తోంది. గత ఆగస్టులో 'బీఈ 6 స్పోర్టెక్' మోడల్‌ను విడుదల చేసిన మహీంద్రా.. ఇప్పుడు అదే బాటలో ఎక్స్​ఈవీ 9ఈ స్పోర్టెక్ సిరీస్​ని తీసుకురానుంది. రివైజ్డ్​ వేరియంట్ల జాబితా, ఆకర్షణీయమైన కొత్త ఎక్స్‌టీరియర్ రంగులు, అదనపు సాంకేతిక ఫీచర్లతో ఈ కారు రానుంది.

బీఈ 6 స్పోర్టెక్ బాటలోనే అప్‌డేట్స్.. స్పెషల్ ఎడిషన్ కూడా!

మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఈ
మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఈ

బీఈ 6 మోడల్‌లో మహీంద్రా తన ‘ఎంఏఐఏ’ ఆర్కిటెక్చర్ ఆధారిత కొత్త సాఫ్ట్‌వేర్ ఫంక్షన్లు, అదనపు పెయింట్ ఫినిష్‌లతో కలిపి ఎనిమిది వేరియంట్లలో స్పోర్టెక్ సిరీస్‌ను తీసుకొచ్చింది. ఎక్స్​ఈవీ 9ఈలో ఇప్పటికే మూడు స్క్రీన్ల డ్యాష్‌బోర్డ్ ఉండటంతో, తాజా అప్‌డేట్‌లో ఇంటర్‌ఫేస్ ఫంక్షన్లు, పర్సనలైజేషన్, వేరియంట్ల వారీగా ఫీచర్ల కేటాయింపుపై కంపెనీ ప్రధానంగా దృష్టి సారించనుంది. దీనితో పాటు ప్రత్యేక ఎడిషన్ మోడల్‌ను కూడా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

70 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్.. పవర్, రేంజ్ లెక్కలివే!

మహీంద్రా ఇప్పటికే బీఈ 6 స్పోర్టెక్, ఎక్స్​ఈవీ 9ఎస్ మోడళ్లలో 70 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను అందిస్తోంది. ఇప్పుడు ఎక్స్​ఈవీ 9ఈ స్పోర్టెక్ సిరీస్‌లోనూ ఈ 70 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అదే జరిగితే ప్రస్తుతం ఉన్న 59 కేడబ్ల్యూహెచ్, 79 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీల మధ్య కొనుగోలుదారులకు మరో మెరుగైన ప్రత్యామ్నాయం లభిస్తుంది. చిన్నదైన 59 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ 170 కేడబ్ల్యూ మోటార్‌కు శక్తినివ్వగా, పెద్దదైన 79 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ 210 కేడబ్ల్యూ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు రియర్-వీల్-డ్రైవ్ వేరియంట్లు 380 ఎన్​ఎం టార్క్‌ను అందిస్తాయి. 79 కేడబ్ల్యూహెచ్ వెర్షన్ కేవలం 6.8 సెకన్లలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

అదిరిపోయే డిజైన్.. ఇంగ్లో ప్లాట్‌ఫామ్ బలం!

ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 663 లీటర్ల విశాలమైన లగేజీ స్థలంతో పాటు ముందు భాగంలో 150 లీటర్ల ప్రత్యేక స్టోరేజీ బే ఉన్నాయి. టాప్ వేరియంట్లలో 16-స్పీకర్ల హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్-అప్ డిస్‌ప్లే, ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్ వంటి ప్రీమియం హంగులు ఉన్నాయి. ప్యాక్ త్రీ వేరియంట్‌లో అడాప్టివ్ సస్పెన్షన్, ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, అత్యాధునిక డ్రైవర్ అసిస్టెన్స్ సూట్ (అడాస్) లభిస్తాయి. స్పోర్టెక్ వేరియంట్లను విభిన్నంగా నిలబెట్టేందుకు ఫీచర్ల కలయికలో మార్పులు చేయనున్నారు.

బీఈ 6 స్పోర్టెక్‌లో ప్రవేశపెట్టిన ఎంఏఐఏ ఆధారిత సాఫ్ట్‌వేర్ మార్పులు ఎక్స్​ఈవీ 9ఈలో ఏం రాబోతున్నాయో స్పష్టం చేస్తున్నాయి. అందులో TEQ_Talk, TEQ_Play, TEQ_Drive, TEQ_Me, TEQ_Secure, TEQ_xting వంటి ఫీచర్లను తీసుకొచ్చారు. ఏఐ వాయిస్ అసిస్టెన్స్, కరోకే నుంచి డ్రిఫ్ట్ మోడ్, మెరుగైన డిజిటల్ కీలు, వాహన నిఘా, టెయిల్‌గేట్‌పై వ్యక్తిగత సందేశాలు ప్రదర్శించుకునే సదుపాయాలు ఇందులో భాగంగా ఉన్నాయి.

రంగుల విషయానికొస్తే బీఈ 6 స్పోర్టెక్‌లో రోసో ఇంపల్సో, రూబీ వెల్వెట్, గ్రాఫైట్ స్టార్మ్, ఫైర్‌స్టార్మ్ ఆరెంజ్ సాటిన్ అనే నాలుగు కొత్త షేడ్స్‌ను అందించారు. లాంచ్ ఎడిషన్‌కు ప్రత్యేకంగా గ్రాఫైట్ స్టార్మ్ పెయింట్, రేసింగ్ ట్యాన్ లెదరెట్ ఇంటీరియర్ ఇచ్చారు. ప్రస్తుతం రూ. 21.90 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విక్రయిస్తున్న ఎక్స్​ఈవీ 9ఈ లోనూ ఇవే తరహా అప్‌డేట్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆధునిక సాఫ్ట్‌వేర్, అదనపు బ్యాటరీ ఆప్షన్లతో రానున్న ఎక్స్​ఈవీ 9ఈ స్పోర్టెక్ సిరీస్, ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభాగంలో పోటీని మరింత పెంచనుంది.

 

ABOUT THE AUTHOR

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks