...
...
Next Story

మహీంద్రా XUV 7XO వేరియంట్లు- వాటి ధరల వివరాలు..

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ పేరుతో ఎక్స్​యూవీ700 ఫేస్​లిఫ్ట్​ వెర్షన్ లాంచ్ అయింది. రూ. 13.66 లక్షల ప్రారంభ ధరతో వచ్చిన ఈ ఎస్​యూవీలో ఆరు వేరియంట్లు ఉన్నాయి. వీటి ధరలతో పాటు బుకింగ్​, డెలివరీ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jan 6, 2026, 10:20:24 IST
Advertisement

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. తన పాపులర్ మోడల్ ఎక్స్​యూవీ700ను భారీగా రీ-డిజైన్ చేసి, మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్​స్​ఓ పేరుతో కంపెనీ లాంచ్ చేసింది. ఈ సరికొత్త ఫ్యామిలీ ఎస్​యూవీ ప్రారంభ ధర రూ. 13.66 లక్షలు కాగా, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 24.92 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఈ నేపథ్యంలో ఈ మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ వేరియంట్లు, వాటి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ- డిజైన్‌లో ఊహించని మార్పులు..

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ ఇదిగో..
మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ ఇదిగో..

వాస్తవానికి, ఈ ఎస్​యూవీ ఫ్రంట్ లుక్ మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఎస్​ని పోలి ఉంటుందని ఆటోమొబైల్​ పరిశ్రమ వర్గాలు భావించాయి. కానీ, మహీంద్రా అందరినీ ఆశ్చర్యపరుస్తూ దీనిని తన సబ్-కాంపాక్ట్ ఎస్​యూవీ ‘ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ’ స్టైల్‌లో రూపొందించింది. అంటే, ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓలో మనం చూసిన షార్ప్ డిజైన్ ఎలిమెంట్స్ ఇప్పుడు ఈ పెద్ద ఎస్​యూవీలోను కనిపిస్తాయి.

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ- వేరియంట్లు, ఇంజిన్ సామర్థ్యం..

వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓను మొత్తం ఆరు వేరియంట్లలో (ఏఎక్స్​, ఏఎక్స్​3, ఏఎక్స్​5, ఏఎక్స్​7, ఏఎక్స్​7 టీ, ఏఎక్స్​7 ఎల్​) మహీంద్రా తీసుకువచ్చింది.

పెట్రోల్ వేరియంట్: 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్ (ధర: రూ. 13.66 లక్షల - రూ. 23.64 లక్షలు).

డీజిల్ వేరియంట్: 2.2-లీటర్ ఇంజిన్ (ధర: రూ. 14.94 లక్షల - రూ. 24.92 లక్షలు).

ఇందులో మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. సీటింగ్ లేఅవుట్ ఆధారంగా కూడా ధరల్లో మార్పులు ఉంటాయి.

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ- వేరియంట్లు, వాటి ధరలు..
ఏఎక్స్​ఏఎక్స్​3ఏఎక్స్​5ఏఎక్స్​7ఏఎక్స్​7 టీఏఎక్స్​ 7 ఎల్​
2.0-లీటర్​ టర్బో పెట్రోల్​ ఎంటీరూ. 13.66 లక్షలురూ. 16.02 లక్షలురూ. 17.52 లక్షలురూ. 18.48 లక్షలు--
2.0-లీటర్​ టర్బో పెట్రోల్​ ఏటీ-రూ. 17.47 లక్షలురూ. 18.97 లక్షలురూ. 19.93 లక్షలు

రూ. 21.97 లక్షలు (7-సీటర్​)

రూ. 22.16 లక్షలు

రూ. 23.45 లక్షలు (7-సీటర్​)

రూ. 23.64 లక్షలు (6-సీటర్​)

2.2-లీటర్​ డీజిల్​ ఎంటీరూ. 14.96 లక్షలురూ. 16.49 లక్షలురూ. 17.99 లక్షలురూ. 18.95 లక్షలు

రూ. 20.99 లక్షలు (7-సీటర్​)

రూ. 21.39 లక్షలు (6-సీటర్​)

22.47 lakh
2.2-లీటర్​ డీజిల్​ ఏటీ-రూ. 17.94 లక్షలురూ. 19.44 లక్షలురూ. 20.4 లక్షలు

రూ. 22.44 లక్షలు (7-సీటర్​)

22.84 lakh (6-seater)

రూ. 24.11 లక్షలు (6-సీటర్​)
2.2-లీటర్​ డీజిల్​ ఏటీ ఏడబ్ల్యూడీ---రూ. 21.4 లక్షలురూ. 23.44 లక్షలురూ. 24.92 లక్షలు
View All

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ బుకింగ్, డెలివరీ అప్‌డేట్..

బుకింగ్స్: గత ఏడాది డిసెంబర్ మధ్య నుంచే ఈ కారు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

డెలివరీ ఎప్పుడు?: ఇప్పటికే ప్రీ-బుక్ చేసుకున్న వారికి జనవరి 14వ తేదీ (సంక్రాంతి) నుంచి డెలివరీలు మొదలవుతాయి.

అయితే, కంపెనీ తొలుత కేవలం హై-ఎండ్ వేరియంట్లను (ఏఎక్స్​7, ఏఎక్స్​7 టీ, ఏఎక్స్​7 ఎల్​) మాత్రమే డెలివరీ చేయనుంది. మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ బేస్, మిడ్ వేరియంట్లు (ఏఎక్స్​, ఏఎక్స్​3, ఏఎక్స్​5) కొన్న వారు మాత్రం ఏప్రిల్ 2026 వరకు వేచి చూడక తప్పదు.

మహీంద్రా కార్లకు ఉండే విపరీతమైన డిమాండ్ దృష్ట్యా, ప్రారంభంలో ఈ మోడల్‌కు వెయిటింగ్ పీరియడ్ భారీగా ఉండే అవకాశం ఉందని ఆటోమొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe