Maruti Suzuki Cars : భారతీయ కుటుంబాల కోసం.. మారుతీ సుజుకీ నుంచి రెండు ఎంపీవీలు! ఒకటి ఈవీ..
Upcoming Maruti Suzuki Cars : మారుతీ సుజుకీ తన ఎంపీవీ లైనప్‌ను భారీగా విస్తరిస్తోంది. 2027 నాటికి రానున్న ‘వైఎంసీ’ ఎలక్ట్రిక్ ఎంపీవీ, ‘వైడీబీ’ కాంపాక్ట్ ఎంపీవీల ద్వారా ప్రీమియం, బడ్జెట్ విభాగాల్లో ఆధిపత్యం సాధించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో వీటి గురించి ఇప్పటివరకు ఉన్న వివరాలు..
భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ.. భవిష్యత్తు వాహన విపణిని శాసించేందుకు తన ‘విజన్ 3.0’ ప్రణాళికను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కంపెనీ రెండు సరికొత్త ఎంపీవీ మోడళ్లను మార్కెట్లో తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం వీటికి ‘YMC’, ‘YDB’ అనే కోడ్ పేర్లను కేటాయించారు. ఈ రెండు వాహనాలు 2027 నాటికి రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది. విభిన్న వర్గాల కస్టమర్లను ఆకట్టుకునేలా ఒకటది ప్రీమియం ఎలక్ట్రిక్ వెర్షన్ కాగా, మరొకటి నగర ప్రయాణాలకు అనువైన చౌకైన ఫ్యామిలీ కారుగా ఉండబోతున్నాయి. వీటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మారుతీ సుజుకీ వైఎంసీ- కంపెనీ తొలి ప్రీమియం ఎలక్ట్రిక్ ఎంపీవీ
రాబోయే మారుతీ సుజుకీ వైఎంసీ.. కంపెనీ నుంచి రానున్న మొట్టమొదటి పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ఎంపీవీ. దీనికి సంబంధించిన కీలక విశేషాలు ఇవే:
ప్లాట్‌ఫారమ్: ఇది మారుతీ సుజుకీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ‘ఈ విటారా’ ఆధారంగా రూపొందుతోంది. అంటే అదే ప్లాట్‌ఫారమ్, బ్యాటరీ టెక్నాలజీని ఈ ఎంపీవీలోనూ ఉపయోగించనున్నారు.
బ్యాటరీ అండ్ రేంజ్: నివేదికల ప్రకారం, ఇందులో 49కేడబ్ల్యూహెచ్, 61.1కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉండవచ్చు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 543 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వీలుంటుంది.
డిజైన్ అండ్ స్పేస్: సుమారు 4.5 మీటర్ల పొడవు ఉండే ఈ వాహనం, విశాలమైన క్యాబిన్‌తో మూడు వరుసల సీటింగ్‌ను కలిగి ఉంటుంది.
ప్రీమియం ఫీచర్లు: మారుతీ సుజుకీ లైనప్‌లోనే ఇది అత్యంత లగ్జరీ వాహనంగా నిలవనుంది. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, 360-డిగ్రీ కెమెరా, లెవల్ 2 అడాస్ వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఉండబోతున్నాయి.
Petrol diesel hike : లీటరు పెట్రోల్, డీజిల్ ధరలపై రూ. 20 పెంపు! బంకుల్లో ‘ప్యానిక్ బయ్యింగ్’..
మారుతీ సుజుకీ వైడీబీ- మధ్యతరగతికి ‘నెక్సా’ స్థాయి కాంపాక్ట్ కారు
రెండొవ ఎంపీవీ అయిన ‘వైడీబీ’, ప్రధానంగా నగరాల్లో నివసించే చిన్న కుటుంబాల కోసం రూపొందిస్తున్నారు.
డిజైన్ స్ఫూర్తి: ఇది జపాన్ మార్కెట్లో పాపులర్ అయిన ‘సుజుకీ స్పేసియా’ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. అయితే భారతీయ రోడ్లు, కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా దీని డిజైన్‌లో కీలక మార్పులు చేయనున్నారు. ఇది ‘టాల్‌బాయ్’ షేప్‌తో బాక్సీ లుక్‌లో ఉండబోతోంది.
నగర ప్రయాణాలకు అనువుగా: కేవలం 3.4 మీటర్ల పొడవు ఉండే ఈ కారు, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో నడపడానికి, పార్కింగ్ చేయడానికి చాలా సులభంగా ఉంటుంది.
ధర నియంత్రణ: ధరను సామాన్యులకు అందుబాటులో ఉంచడం కోసం, జపాన్ మోడల్‌లో ఉండే స్లైడింగ్ డోర్లు, లగ్జరీ రియర్ సీట్ల వంటి ఫీచర్లను ఇండియా వెర్షన్‌లో తొలగించే అవకాశం ఉంది.
ఇంజిన్, పర్ఫార్మెన్స్..
వైడీబీ ఎంపీవీలో మారుతి తన కొత్త 1.2-లీటర్ త్రీ-సిలిండర్ ‘Z సిరీస్’ పెట్రోల్ ఇంజిన్‌ను వాడనుంది. ఇది సుమారు 82 హెచ్‌పీ పవర్, 108 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. ఇందులో మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఈ కారును మారుతీ సుజుకీ తన ప్రీమియం డీలర్‌షిప్ నెట్‌వర్క్ ‘నెక్సా’ ద్వారా విక్రయించే అవకాశం ఉందని సమాచారం.
మారుతీ సుజుకీ తీసుకొస్తున్న ఈ రెండు వైవిధ్యమైన ఎంపీవీలు, భవిష్యత్తులో ఈ విభాగంలో కంపెనీ పట్టును మరింత పటిష్టం చేయడం ఖాయం.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


