...
...
Next Story

Maruti Suzuki WagonR : కొత్త అవతారంలో మారుతీ సుజుకీ వాగన్​ఆర్​- ఫేస్​లిఫ్ట్​ మోడల్​ హైలైట్స్ ఇవే..

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటైన మారుతీ సుజుకీ వ్యాగన్​ఆర్ సరికొత్త డిజైన్, ఇంజిన్ మార్పులతో రాబోతోంది. ఇటీవల రహదారులపై రహస్యంగా పరీక్షలు జరుపుతుండగా కెమెరాలకు చిక్కిన ఈ మారుతీ సుజుకీ వ్యాగన్​ఆర్​ ఫేస్​లిఫ్ట్​ విశేషాలను ఇక్కడ చూసేయండి..

Published on: Sep 13, 2026, 17:02:51 IST
Advertisement

తెలుగు రాష్ట్రాల్లో మధ్యతరగతి కుటుంబాలకు, మొదటిసారి కారు కొనాలనుకునే వారికి మారుతీ సుజుకీ ‘వ్యాగన్ఆర్’ దశాబ్దాలుగా నమ్మకమైన వాహనంగా నిలిచింది. హైదరాబాద్ పాతబస్తీ సందుల నుంచి విజయవాడ నేషనల్ హైవే వరకు ఎక్కడ చూసినా కనిపించే ఈ టాల్-బాయ్ హ్యాచ్‌బ్యాక్ త్వరలోనే సరికొత్త రూపంలోకి మారబోతోంది!. తాజాగా ఈ కారుకు సంబంధించిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ రోడ్లపై టెస్టింగ్ జరుపుతుండగా తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మారుతీ సుజుకీ వాగన్​ఆర్​..
మారుతీ సుజుకీ వాగన్​ఆర్​..

ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ వాగన్​ఆర్​ ఫేస్​లిఫ్ట్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

మారుతీ సుజుకీ వాగన్​ఆర్​ ఫేస్​లిఫ్ట్- డిజైన్‌లో ఆకర్షణీయమైన మార్పులు..

మారుతీ సుజుకీ సంస్థ ఇప్పటికే తన లైనప్‌లోని బ్రెజ్జా, బలెనో వంటి మోడళ్లలో మార్పులు చేసింది. అదే బాటలో తమ అత్యధిక విక్రయాల వ్యాగన్​ఆర్‌ను కూడా ఆధునీకరిస్తోంది. లీకైన సమాచారం ప్రకారం, కొత్త వ్యాగన్​ఆర్ ముందు భాగంలో రీ-డిజైన్ చేసిన హెడ్‌లైట్లు, కొత్త ఫ్రంట్ గ్రిల్, వెనుక వైపు ఆకర్షణీయమైన టెయిల్-లైట్లను అందించనున్నారు. కారు సిగ్నేచర్ స్టైల్ అయిన టాల్-బాయ్ లుక్, డోర్ హ్యాండిల్స్ స్టైల్‌ను అలాగే కొనసాగించారు.

ప్రస్తుతం టెస్టింగ్ దశలోనే ఉన్నందున ఈ వాహనానికి స్టీల్ వీల్స్ అమర్చారు.

మారుతీ సుజుకీ వాగన్​ఆర్​ ఫేస్​లిఫ్ట్- సరికొత్త ఇంజిన్!

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వ్యాగన్​ఆర్ ప్రారంభ ధర రూ. 4.99 లక్షల నుంచి రూ. 7.24 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. రానున్న మారుతీ సుజుకీ వాగన్​ఆర్​ ఫేస్​లిఫ్ట్ ధరలో స్వల్ప మార్పులు మాత్రమే ఉండవచ్చని ఆటోమొబైల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇక మైలేజ్ విషయానికి వస్తే వ్యాగన్​ఆర్ సీఎన్జీ మోడల్ కేజీకి 34.05 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తూ సెగ్మెంట్‌లోనే అగ్రస్థానంలో నిలుస్తోంది. కొత్త మోడల్‌లో డిక్కీ (బూట్ స్పేస్) స్పేస్ ఖాళీగా ఉండేందుకు బ్రెజ్జాలో మాదిరిగా కారు కింద భాగంలో అమర్చే ‘అండర్‌బాడీ సీఎన్జీ ట్యాంక్’ సాంకేతికతను తీసుకువస్తారా లేదా అనే అంశంపై ఆటోమొబైల్ ప్రియుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

25 ఏళ్ల ప్రస్థానం.. 35 లక్షల మంది నమ్మకం!

1999లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన వ్యాగన్​ఆర్, గత 25 ఏళ్లుగా సేల్స్ రికార్డులను తిరగరాస్తూనే వస్తోంది. ఇప్పటివరకు దాదాపు 35 లక్షలకు పైగా వ్యాగన్​ఆర్ కార్లు అమ్ముడవడం విశేషం. క్యాబ్ రంగానికి, సొంత కుటుంబ అవసరాలకు తక్కువ నిర్వహణ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే చిన్న కారుగా ఇది పేరుగాంచింది.

ఇండియాలో ప్రస్తుతం ఎస్‌యూవీల హవా నడుస్తున్నప్పటికీ, వ్యాగన్​ఆర్ క్రేజ్ తగ్గకపోవడంతో మారుతీ సుజుకీ ఈ మోడల్‌ను మరింత అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో మార్కెట్లోకి తేవడానికి సిద్ధమవుతోంది.

ఈ మారుతీ సుజుకీ వాగన్​ఆర్​ ఫేస్​లిఫ్ట్ లాంచ్ డేట్, ధర, ఫీచర్లు వంటి వివరాలపై సంస్థ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks