టెక్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న మోటొరోలా 'సిగ్నేచర్' స్మార్ట్‌ఫోన్ ఎట్టకేలకు భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. ముంబైలో శుక్రవారం జరిగిన స్పెషల్ ఈవెంట్లో కంపెనీ ఈ గ్యాడ్జెట్‌ని ఆవిష్కరించింది. కేవలం శక్తివంతమైన ఫీచర్లే కాకుండా, గూగుల్ అసిస్టెంట్ తరహాలో ప్రత్యేకమైన సిగ్నేచర్ క్లబ్' లైవ్ ఏజెంట్ సపోర్ట్‌ను కూడా ఈ ఫోన్ ద్వారా కంపెనీ పరిచయం చేసింది. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లు వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మోటోరోలా సిగ్నేచర్- ధర, లభ్యత..

భారత్‌లో మోటొరోలా సిగ్నేచర్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి..
12GB RAM + 256GB స్టోరేజ్ ధర: రూ. 59,999
16GB RAM + 512GB స్టోరేజ్ ధర: రూ. 64,999
16GB RAM + 1TB స్టోరేజ్ (టాప్ ఎండ్) ధర: రూ. 69,999
ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ జనవరి 30 నుంచి ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి రానుంది. హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేసే వారికి రూ. 5,000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఒకవేళ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయాలనుకుంటే రూ. 5,000 వరకు అదనపు బోనస్ కూడా పొందవచ్చు.
మోటొరోలా సిగ్నేచర్- ముఖ్యమైన ఫీచర్లు..
ఈ మోటొరోలా సిగ్నేచర్ స్మార్ట్‌ఫోన్ పాంటోన్ కార్బన్, పాంటోన్ మార్టిని ఆలివ్ అనే రెండు విలక్షణమైన రంగుల్లో లభిస్తుంది. దీని వెనుక భాగం లినెన్, ట్విల్ తరహా ఫినిషింగ్‌తో ఎంతో ప్రీమియంగా ఉంటుంది.
డిస్‌ప్లే: 6.8 ఇంచ్ సూపర్ హెచ్‌డీ ఎల్టీపీఓ ఎక్స్‌ట్రీమ్ అమోలెడ్ డిస్‌ప్లేను ఇందులో అమర్చారు. 165హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, ఏకంగా 6,200 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో వెలుతురులో కూడా స్క్రీన్ ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది.
తడి వేళ్లతో కూడా ఫోన్‌ను ఆపరేట్ చేసేలా 'స్మార్ట్ వాటర్ టచ్' టెక్నాలజీని ఇందులో అందించింది మోటోరోలా సంస్థ.
{{/usCountry}}తడి వేళ్లతో కూడా ఫోన్‌ను ఆపరేట్ చేసేలా 'స్మార్ట్ వాటర్ టచ్' టెక్నాలజీని ఇందులో అందించింది మోటోరోలా సంస్థ.
{{/usCountry}}పర్ఫార్మెన్స్: క్వాల్కమ్ నుంచి వచ్చిన అత్యంత వేగవంతమైన ‘స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5’ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 16 వెర్షన్‌తో వస్తోంది. ఫోన్ మన్నిక కోసం గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ (MIL-STD 810H) కూడా ఉన్నాయి.
కెమెరా: ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఇందులో వెనుక వైపు మూడు 50 మెగాపిక్సెల్ కెమెరాలను ఇచ్చారు.
50ఎంపీ మెయిన్ కెమెరా (సోనీ ఎల్వైటీ 828, OIS సపోర్ట్‌తో)
50ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా
50ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా (3ఎక్స్ ఆప్టికల్ జూమ్, 100ఎక్స్ హైబ్రిడ్ జూమ్)
ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉండటం విశేషం.
మోటొరోలా సిగ్నేచర్- బ్యాటరీ, ఛార్జింగ్..
5,200ఎంఏహెచ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీతో వస్తున్న ఈ మోటొరోలా సిగ్నేచర్ స్మార్ట్‌ఫోన్‌ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 41 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. 90డబ్ల్యూ వైర్డ్, 50డబ్ల్యూ వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేస్తుంది.
మొత్తానికి, ప్రీమియం విభాగంలో యాపిల్, శాంసంగ్‌లకు గట్టి పోటీ ఇచ్చేలా మోటొరోలా ఈ 'సిగ్నేచర్'ను తీర్చిదిద్దింది.