Mutual Fund Investments : భారతదేశంలో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు ఇప్పుడు ఎన్ఏసీహెచ్ (నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌజ్) మాండేట్ ద్వారా ఆటోమేటిక్‌గా జరుగుతున్నాయి. సిప్ (సిస్టెమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) నిర్వహించే ఈ వ్యవస్థ ద్వారా, ప్రతి నెలా నిర్ణీత తేదీన మీ బ్యాంకు ఖాతా నుంచి డబ్బు కట్ అయి మ్యూచువల్ ఫండ్ హౌజ్ (ఏఎంసీ) కి చేరుతుంది. ఇది ఇన్వెస్టర్లకు అత్యంత సౌకర్యవంతమైన ఆప్షన్. డబ్బులు ఆటోమేటిక్‌గా కట్ అవుతాయి కాబట్టి సిప్ తేదీని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఒక్కో సారి ఇదే మైనస్ కూడా అవ్వొచ్చు! బ్యాంకు ఖాతాలో తగినంత డబ్బులు లేకపోతే సిప్ మిస్ అవుతుంది. మరి దీని మీద పెనాల్టీ ఉంటుందా? ఎంత ఛార్జీలు వసూలు చేస్తారు? ఇక్కడ వివరంగా తెలుసుకోండి..
రూ. 1,000 సిప్‌కి రూ. 590 జరిమానా? పెనాల్టీల మోత తప్పదా?

మీ మ్యూచువల్ ఫండ్ సిప్ ఇన్‌స్టాల్‌మెంట్ విఫలమైన ప్రతిసారీ బ్యాంకులు పెనాల్టీలు విధిస్తాయి. సాధారణంగా ఈ ఛార్జీలు రూ. 250 నుంచి రూ. 750 వరకు ఉండటమే కాకుండా, దీనిపై అదనంగా 18% జీఎస్టీ కూడా వర్తిస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఈ జరిమానా రోజుకు కాదు, ఫెయిల్ అయిన ప్రతి ట్రాన్సాక్షన్‌కు పడుతుంది.
ఉదాహరణకు.. ఒక ఇన్వెస్టర్ ఒకే తేదీన 5 వేర్వేరు సిప్‌లను షెడ్యూల్ చేశారనుకుందాం. బ్యాంకు ఒక్కో ఫెయిల్యూర్‌కు రూ. 500 ఛార్జీ చేస్తే, ఆ ఒక్క రోజే రూ. 2,500 జరిమానా పడుతుంది! దీనికి జీఎస్టీ కలిపితే మొత్తం రూ. 2,950 అవుతుంది. అంటే రూ. 1,000 సిప్ కట్టలేకపోయినందుకు, దాదాపు రూ. 590 పెనాల్టీ రూపంలో పోతోంది. ఇది మీ పెట్టుబడి ఉద్దేశ్యాన్ని దెబ్బతీస్తుంది.
ఎన్ఏసీహెచ్ మాండేట్ అంటే ఏంటి?
ఇది మీరు మీ బ్యాంకుకు ఇచ్చే ఒక వన్-టైమ్ అనుమతి పత్రం. దీని ద్వారా నిర్దేశించిన పరిమితి వరకు మీ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా డబ్బు తీసుకోవడానికి బ్యాంకుకు అధికారం లభిస్తుంది. దీనికి ఒక యూనిక్ రిజిస్ట్రేషన్ నంబర్ (యూఎంఆర్ఎన్) ఉంటుంది. ఇందులో రెండు రకాలు ఉన్నాయి:
{{/usCountry}}ఇది మీరు మీ బ్యాంకుకు ఇచ్చే ఒక వన్-టైమ్ అనుమతి పత్రం. దీని ద్వారా నిర్దేశించిన పరిమితి వరకు మీ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా డబ్బు తీసుకోవడానికి బ్యాంకుకు అధికారం లభిస్తుంది. దీనికి ఒక యూనిక్ రిజిస్ట్రేషన్ నంబర్ (యూఎంఆర్ఎన్) ఉంటుంది. ఇందులో రెండు రకాలు ఉన్నాయి:
{{/usCountry}}ఈ-ఎన్ఏసీహెచ్ : నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా పేపర్ లెస్ గా పూర్తవుతుంది.
ఫిజికల్ మాండేట్: సంతకం చేసిన ఫారమ్ ద్వారా జరుగుతుంది, దీనికి సమయం పడుతుంది.
FASTag : మీ ఫాస్టాగ్‌లో ఉచితంగా రూ. 1000 క్రెడిట్ చేస్తారు! ఇలా చేస్తే చాలు..
మ్యూచువల్ ఫండ్ సిప్ మిస్- నష్ట నివారణ ఎలా?
ఈ అనవసరపు ఖర్చుల నుంచి తప్పించుకోవడానికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు:
బఫర్ బ్యాలెన్స్: మ్యూచువల్ ఫండ్ సిప్ తేదీకి రెండు మూడు రోజుల ముందే ఖాతాలో తగినంత నగదు ఉండేలా చూసుకోవాలి.
తేదీల మార్పు : అన్ని సిప్‌లను ఒకే తేదీన కాకుండా, నెలలో వేర్వేరు తేదీల్లో (ఉదాహరణకు 5, 10, 20 తేదీలు) షెడ్యూల్ చేయాలి.
రిమైండర్లు: డెబిట్ తేదీకి ముందే ఫోన్లో రిమైండర్లు పెట్టుకోవడం మంచిది.
హయర్ మాండేట్ లిమిట్: భవిష్యత్తులో సిప్ మొత్తాన్ని పెంచాలనుకుంటే, ముందే ఎక్కువ లిమిట్‌తో మాండేట్ సెట్ చేసుకోవడం వల్ల మళ్లీ మళ్లీ పేపర్ వర్క్ ఉండదు.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. సిప్ ఫెయిల్ అయితే క్రెడిట్ స్కోర్ తగ్గుతుందా?
సాధారణంగా సిప్ ఫెయిల్యూర్ వల్ల క్రెడిట్ స్కోర్‌పై నేరుగా ప్రభావం ఉండదు. కానీ బ్యాంకుతో మీ సంబంధాలు దెబ్బతినవచ్చు, పెనాల్టీల వల్ల ఆర్థికంగా నష్టపోతారు.
2. వరుసగా సిప్‌లు ఫెయిల్ అయితే ఏమవుతుంది?
వరుసగా మూడు లేదా అంతకంటే ఎక్కువ నెలలు పేమెంట్స్ ఫెయిల్ అయితే, మ్యూచువల్ ఫండ్ సంస్థ మీ సిప్‌ని రద్దు చేసే అవకాశం ఉంది.
3. బ్యాంకు ఛార్జీల నుంచి తప్పించుకోవడం ఎలా?
మీ ఖాతాలో బ్యాలెన్స్ లేదని ముందే తెలిస్తే, కనీసం వారం రోజుల ముందే మీ సిప్‌ని 'పాజ్' చేసే ఆప్షన్‌ను వాడుకోవచ్చు.