...
...
Next Story

NCERT Recruitment 2026 : నెలకు రూ. లక్షల్లో జీతం- ఎన్​సీఈఆర్​టీ రిక్రూట్​మెంట్​ అప్లికేషన్​కి ఈరోజే గడువు

NCERTలో ప్రొఫెసర్, లైబ్రేరియన్ వంటి 117 అకడమిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో (మార్చి 6) ముగియనుంది. అర్హత గల అభ్యర్థులు సాయంత్రం 5 గంటల లోపు ncert.nic.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Published on: Mar 6, 2026, 05:29:52 IST
Advertisement

దేశవ్యాప్తంగా విద్యా పరిశోధన, శిక్షణ రంగంలో కీలక పాత్ర పోషించే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్​సీఈఆర్​టీ)లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది ముఖ్య గమనిక. వివిధ అకాడమిక్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నేడు, మార్చ్​ 6న ముగియనుంది.

ఎన్​సీఈఆర్​టీ రిక్రూట్​మెంట్​ 2026- ముగియనున్న గడువు..

ఎన్​సీఈఆర్​టీ రిక్రూట్​మెంట్​ 2026 వివరాలు..
ఎన్​సీఈఆర్​టీ రిక్రూట్​మెంట్​ 2026 వివరాలు..

వాస్తవానికి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 20వ తేదీనే ఆఖరి గడువుగా నిర్ణయించారు. అయితే, అభ్యర్థుల సౌకర్యార్థం ఈ గడువును మార్చ్​ 6 (శుక్రవారం) వరకు పొడిగించారు. నేటి సాయంత్రం 5 గంటల తర్వాత దరఖాస్తు లింక్ క్లోజ్​ అవుతుంది. కాబట్టి, ఆసక్తి గల అభ్యర్థులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

ఎన్​సీఈఆర్​టీ రిక్రూట్​మెంట్​ 2026- మొత్తం ఖాళీలు, విభాగాలు..

ఎన్​సీఈఆర్​టీ తన దిల్లీ ప్రధాన కార్యాలయంతో పాటు అజ్మీర్, భోపాల్, భువనేశ్వర్, మైసూర్, షిల్లాంగ్‌లోని ప్రాంతీయ విభాగాల్లో మొత్తం 117 ఖాళీలను భర్తీ చేస్తోంది.

ప్రొఫెసర్

అసోసియేట్ ప్రొఫెసర్

అసిస్టెంట్ ప్రొఫెసర్

డిప్యూటీ/అసిస్టెంట్ లైబ్రేరియన్

వీటికి సంబంధించిన విద్యార్హతల వివరాలను అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోని 'Vacancy' విభాగంలో తనిఖీ చేయవచ్చు.

ఎన్​సీఈఆర్​టీ రిక్రూట్​మెంట్​ 2026- జీతభత్యాల వివరాలు

ఎంపికైన అభ్యర్థులకు పదవిని బట్టి ఆకర్షణీయమైన వేతన శ్రేణి ఉంటుంది:

ప్రొఫెసర్: నెలకు రూ. 1,44,200 ప్రారంభ వేతనంతో అకాడమిక్ లెవల్ 14 వర్తిస్తుంది.

అసోసియేట్ ప్రొఫెసర్ / డిప్యూటీ లైబ్రేరియన్: నెలకు రూ. 1,31,400 ప్రారంభ వేతనంతో అకడమిక్ లెవల్ 13ఏ వర్తిస్తుంది.

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ. 1,000 దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు (పీడబ్ల్యూడీ), మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.

ఒకసారి చెల్లించిన ఫీజును ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఇవ్వరు.

ఎన్​సీఈఆర్​టీ రిక్రూట్​మెంట్​ 2026- దరఖాస్తు చేసుకోవడం ఎలా?

స్టెప్​ 1- ముందుగా ఎన్​సీఈఆర్​టీ అధికారిక వెబ్‌సైట్ ncert.nic.in సందర్శించండి.

స్టెప్​ 2- హోమ్ పేజీలో 'Announcements' లేదా 'Vacancies' సెక్షన్‌కు వెళ్లి సంబంధిత నోటిఫికేషన్‌ను ఎంచుకోండి.

స్టెప్​ 3- మీ ఇమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ ఐడిని క్రియేట్ చేయండి.

స్టెప్​ 4- ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యా వివరాలను జాగ్రత్తగా నమోదు చేయండి.

స్టెప్​ 5- సూచించిన పరిమాణంలో ఫోటో, సంతకం, ఇతర అవసరమైన పత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి.

స్టెప్​ 6- వర్తించే అభ్యర్థులు ఫీజు చెల్లించి, దరఖాస్తును సబ్మిట్ చేయండి.

స్టెప్​ 7- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ కాపీని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.

ముఖ్య గమనిక..

అభ్యర్థులు సమర్పించిన సమాచారం ఆధారంగానే ప్రాథమికంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ సమయంలో ఒరిజినల్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుంది. అభ్యర్థి అందించిన సమాచారం తప్పు అని తేలినా లేదా అర్హత ప్రమాణాలు సరిపోకపోయినా, నియామక ప్రక్రియలో ఏ దశలోనైనా (చివరికి ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా) వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేసే అధికారం ఎన్​సీఈఆర్​టీకి ఉంటుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe