జాతీయ స్థాయి పోటీ పరీక్ష NEET UG 2026 రిజిస్ట్రేషన్ ప్రక్రియను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రారంభించింది. సిలబస్‌ను విడుదల చేసిన దాదాపు నెల రోజుల తర్వాత, తన అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.inలో నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం, నీట్ యూజీ 2026 పరీక్ష మే 3, 2026న జరగనుంది.

"భారతదేశంలోని అన్ని వైద్య విద్యా సంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశం కోసం ఎన్టీఏ ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది," అని అధికారిక నోటీసు పేర్కొంది. ఈ పరీక్ష ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్‌తో పాటు బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీఎస్ఎంఎస్ వంటి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
నీట్ యూజీ 2026 రిజిస్ట్రేషన్ ప్రక్రియ..
స్టెప్ 1: ఆన్లైన్లో నీట్ యూజీ 2026కి రిజిస్టర్ చేసుకుని, సిస్టమ్ జనరేట్ చేసిన అప్లికేషన్ నంబర్‌ను నోట్ చేసుకోవాలి.
{{/usCountry}}స్టెప్ 1: ఆన్లైన్లో నీట్ యూజీ 2026కి రిజిస్టర్ చేసుకుని, సిస్టమ్ జనరేట్ చేసిన అప్లికేషన్ నంబర్‌ను నోట్ చేసుకోవాలి.
{{/usCountry}}స్టెప్ 2: ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్‌ను నింపి, పాస్‌వర్డ్, సెక్యూరిటీ ప్రశ్న/సమాధానాలను ఎంచుకోవాలి.
స్టెప్ 3: పరీక్ష ఫీజు చెల్లించాలి.
స్టెప్ 4: భవిష్యత్తు అవసరాల కోసం కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
నీట్ యూజీ 2026- ముఖ్యమైన తేదీలు, సమయాలు..
నీట్ యూజీ 2026 రిజిస్ట్రేషన్ లింక్ ఫిబ్రవరి 8న యాక్టివేట్ అయ్యింది. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 8, 2026 అని గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు రాత్రి 9:00 గంటల వరకు రిజిస్టర్ చేసుకోవచ్చు. రాత్రి 11:50 గంటల వరకు ఫీజు చెల్లించవచ్చు. అప్లికేషన్‌లో తప్పుల సవరణ కోసం కరెక్షన్ విండో మార్చి 10న తెరుచుకుని, మార్చి 12న ముగుస్తుంది.
ఇక నీట్ యూజీ 2026 పరీక్ష మే 3న మధ్యాహ్నం 2:00 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు (3 గంటల పాటు) జరుగుతుంది.
నీట్ యూజీ 2026- పరీక్ష ఫీజు వివరాలు..
జనరల్ అభ్యర్థులు: రూ. 1700
జనరల్-ఈడబ్ల్యూఎస్/ఓబీసీ-ఎన్సీఎల్: రూ. 1600
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/థర్డ్ జెండర్: రూ. 1000
విదేశీ సెంటర్లలో రాసేవారు: రూ. 9500 (అన్ని కేటగిరీలకు)
నీట్ యూజీ దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయడం నుంచి ఫీజు చెల్లింపు వరకు అంతా ఆన్‌లైనే కాబట్టి, ఎటువంటి పేపర్లను ఎన్టీఏ కార్యాలయానికి పోస్ట్ లేదా ఈమెయిల్ ద్వారా పంపాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు.
నీట్ యూజీ 2026- ఎగ్జామ్ పాటర్న్..
నీట్ యూజీ 2026లో కెమిస్ట్రీ, ఫిజిక్స్ విభాగాల నుంచి చెరో 45 ప్రశ్నలు ఉంటాయి. బయాలజీ విభాగం నుంచి అత్యధిక వెయిటేజీతో 90 ప్రశ్నలు ఉంటాయి.