ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకీ.. తన పాపులర్, బెస్ట్ సెల్లింగ్ మ్యాక్సీ-స్టైల్ స్కూటర్ 'బర్గ్‌మాన్ స్ట్రీట్'ను సరికొత్త అప్‌గ్రేడ్లతో భారత మార్కెట్లో విడుదల చేసింది. 2018 నుంచి విక్రయాల్లో ఉన్న ఈ మోడల్‌ను ఇప్పుడు మరింత షార్ప్ డిజైన్, మెకానికల్ మార్పులతో కంపెనీ తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ. 1,01,944 కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 1,13,220 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

వేరియంట్ పేరు | కలర్ ఆప్షన్స్ | ధర |
| రైడ్ కనెక్ట్ ఎడిషన్ |
| రూ. 1,01,944/- (ఎక్స్‌షోరూం) |
| రైడ్ కనెక్ట్ టీఎఫ్టీ ఎడిషన్ |
| రూ. 1,13,220 /- (ఎక్స్‌షోరూం) |
సుజుకీ బర్గ్‌మాన్ స్ట్రీట్ 2026- డిజైన్‌లో భారీ మార్పులు..
కొత్త సుజుకీ బర్గ్‌మాన్ స్ట్రీట్ స్కూటర్ చూడటానికి చాలా స్టైలిష్‌గా, స్లీక్ డిజైన్‌తో కనిపిస్తుంది. పాత మోడల్‌లోని సింగిల్ హెడ్‌ల్యాంప్‌కు బదులుగా, ఇప్పుడు స్ప్లిట్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ సెటప్‌ను అందించారు. దీనికి దిగువన ఇంటిగ్రేటెడ్ డీఆర్ఎల్స్ (డీఆర్ఎల్స్), పైన స్మోక్డ్ విండ్‌స్క్రీన్ ఉన్నాయి. వెనుక భాగంలో హార్స్ షూ ఆకారంలో ఉండే ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్, ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్లతో స్కూటర్ లుక్ అదిరిపోయింది. గ్లోబల్ మార్కెట్లో ఉండే పెద్ద కెపాసిటీ బర్గ్‌మాన్ స్కూటర్ల తరహాలోనే ఇది కనిపిస్తుంది.
మీ కొత్త కారుపై స్క్రాచెస్ పడకుండా ఉండాలంటే పీపీఎఫ్, గ్రాఫిన్ కోటింగ్‌లలో ఏది బెస్ట్ ఛాయిస్?
సుజుకీ బర్గ్‌మాన్ స్ట్రీట్ 2026- కంఫర్ట్, ఫీచర్స్..
{{/usCountry}}మీ కొత్త కారుపై స్క్రాచెస్ పడకుండా ఉండాలంటే పీపీఎఫ్, గ్రాఫిన్ కోటింగ్‌లలో ఏది బెస్ట్ ఛాయిస్?
సుజుకీ బర్గ్‌మాన్ స్ట్రీట్ 2026- కంఫర్ట్, ఫీచర్స్..
{{/usCountry}}రైడర్ సౌకర్యం కోసం ఈ సుజుకీ బర్గ్‌మాన్ స్ట్రీట్ మ్యాక్సీ స్కూటర్లో పొడవైన, వెడల్పాటి ఫుట్‌బోర్డ్‌ను కొనసాగించారు. దీనివల్ల లాంగ్ జర్నీలో కూడా హాయిగా కూర్చోవచ్చు. సీటు కూడా మెత్తటి కుషనింగ్‌తో సౌకర్యవంతంగా ఉంటుంది.
స్టోరేజ్: సీటు కింద 24.6 లీటర్ల భారీ స్టోరేజ్ స్పేస్, ముందు భాగంలో చిన్న పాకెట్స్, డ్యూయల్ యూటిలిటీ హుక్స్, యూఎస్‌బీ ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారు.
టెక్నాలజీ: 'రైడ్ కనెక్ట్ టీఎఫ్ టీ' ఎడిషన్‌లో 4.2 ఇంచ్ కలర్ టీఎఫ్టీ ఎల్‌సీడీ స్క్రీన్ ఉంటుంది. దీనిని స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే కీ-లెస్ స్టార్ట్, రిమోట్ ఫోబ్ లాస్ ప్రివెన్షన్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఇతరాలు: సుజుకీ ఈజీ స్టార్ట్ సిస్టమ్, సైడ్ స్టాండ్ ఇంటర్‌లాక్, వాటర్‌ప్రూఫ్ స్విచ్‌లు వంటి నిత్యం ఉపయోగపడే ఫీచర్లు అదనపు ఆకర్షణ.
సుజుకీ బర్గ్‌మాన్ స్ట్రీట్ 2026- పవర్‌ఫుల్ ఇంజిన్, మెరుగైన మైలేజ్..
ఇందులోని 124 సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను సుజుకీ ఎకో పెర్ఫార్మెన్స్ టెక్నాలజీతో అప్‌డేట్ చేశారు. ఇది యాక్సెస్ ప్లాట్‌ఫారమ్ నుంచి తీసుకున్నది కావడం విశేషం.
పనితీరు: ఈ మ్యాక్సీ స్కూటర్ 6,500 ఆర్పీఎం వద్ద 6.2 కేడబ్ల్యూ పవర్‌ను, 5,250 ఆర్పీఎం వద్ద 10.2 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పాత మోడల్‌తో పోలిస్తే తక్కువ ఆర్పీఎం వద్దే ఎక్కువ టార్క్‌ను ఇస్తుంది, దీనివల్ల ప్రయాణం చాలా స్మూత్‌గా ఉంటుంది.
బరువు తగ్గింది: సుజుకీ తన లేటెస్ట్ యాక్సెస్‌లో వాడిన అండర్‌బోన్ ఫ్రేమ్‌నే ఇక్కడ కూడా వాడింది. దీనివల్ల స్కూటర్ బరువు సుమారు 500 గ్రాములు తగ్గడమే కాకుండా, పటిష్టత (టార్షనల్ రిజిడిటీ) 25 శాతం పెరిగింది.
కొత్త బర్గ్‌మాన్ స్ట్రీట్ ఏప్రిల్ 8, 2026 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న సుజుకీ డీలర్‌షిప్‌లలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతానికి పాత తరం మోడల్‌తో కలిపి దీనిని విక్రయించనున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు-
1. పాత మోడల్‌తో పోలిస్తే కొత్త బర్గ్‌మాన్ స్ట్రీట్ ఇంజిన్ పనితీరులో వచ్చిన మార్పు ఏంటి?
కొత్త మోడల్‌లో టార్క్ 10.2 ఎన్ఎంకు పెరిగింది, దీనివల్ల తక్కువ వేగంలో కూడా స్కూటర్ మరింత శక్తివంతంగా, స్మూత్‌గా ప్రయాణిస్తుంది.
2. బర్గ్‌మాన్ స్ట్రీట్ రైడ్ కనెక్ట్ ఎడిషన్‌లో ఉన్న ప్రత్యేకమైన ఫీచర్ ఏది?
ఈ ఎడిషన్‌లో 4.2 ఇంచ్ కలర్ టీఎఫ్టీ స్క్రీన్‌తో పాటు ఫోన్ కనెక్టివిటీ, కీ-లెస్ స్టార్ట్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.