Volkswagen Taigun : ఇట్స్ అఫీషియల్- వోక్స్‌వ్యాగన్ టైగన్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ డేట్ ఇదే..
Volkswagen Taigun 2026 : వోక్స్‌వ్యాగన్ ఇండియా తన పాపులర్ ఎస్‌యూవీ ‘టైగన్’ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఏప్రిల్ 9న విడుదల చేయనుంది. కొత్త డిజైన్, అత్యాధునిక టెక్నాలజీ, అప్‌డేటెడ్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో రానున్న ఈ కారుపై వాహన ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
వోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీలో త్వరలో భారీ మార్పులు రాబోతున్నాయి. అటు లుక్స్ పరంగా, ఇటు మెకానికల్ పరంగా కీలక అప్‌డేట్లతో వస్తున్న ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను కంపెనీ అధికారికంగా టీజ్ చేసింది. భారత రోడ్లపై ఇప్పటికే పరీక్షలు పూర్తి చేసుకున్న ఈ కారును ఏప్రిల్ 9వ తేదీన అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు వోక్స్‌వ్యాగన్ ధృవీకరించింది. ఈ నేపథ్యంలో ఈ వోక్స్‌వ్యాగన్ టైగన్ ఫేస్‌లిఫ్ట్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

వోక్స్‌వ్యాగన్ టైగన్- డిజైన్ మార్పులు ఎలా ఉండబోతున్నాయి?
టీజర్‌లో కనిపిస్తున్న వివరాల ప్రకారం.. కారు బాడీ షెల్‌లో ఎలాంటి మార్పులు లేవు. అయితే, ఎక్స్‌టీరియర్ డిజైన్ మరింత ఆకర్షణీయంగా మారనుంది. కొత్త హెడ్‌ల్యాంప్ సెటప్, రీడిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, కొత్త బంపర్ ఈ కారుకు ఫ్రెష్ లుక్‌ను ఇస్తాయి. సైడ్ ప్రొఫైల్‌లో కొత్త డిజైన్ కలిగిన అలాయ్ వీల్స్, వెనుక భాగంలో సరికొత్త టెయిల్ ల్యాంప్స్, స్వల్పంగా మార్పులు చేసిన బంపర్ ఉండనున్నాయి.
వోక్స్‌వ్యాగన్ టైగన్- ఇంటీరియర్, ఫీచర్లు..
ఈ ఎస్‌యూవీ క్యాబిన్ లోపల డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌లో మార్పులు లేకపోయినా, కొత్త కలర్ థీమ్స్ అందుబాటులోకి రానున్నాయి. ఫీచర్ల జాబితా కూడా గణనీయంగా పెరగనుంది. ఇటీవల విడుదలైన 'స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్' తరహాలోనే టైగన్‌లో కూడా బేస్ మోడల్ నుంచే ఎక్కువ ఫీచర్లను అందించే అవకాశం ఉంది.
వోక్స్‌వ్యాగన్ టైగన్- ఇంజిన్, పవర్‌ట్రెయిన్..
మెకానికల్ పరంగా చూస్తే, టైగన్ తన ప్రస్తుత ఇంజిన్ ఆప్షన్లనే (1.0లీటర్ టీఎస్ఐ, 1.5లీటర్ టీఎస్) కొనసాగించనుంది. అయితే గేర్‌బాక్స్ విషయంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి:
1.0లీటర్ టీఎస్ఐ ఇంజిన్: దీనికి 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు, పాత 6-స్పీడ్ ఆటోమేటిక్ (ఏటీ) స్థానంలో కొత్త 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ రానుంది.
1.5లీటర్ టీఎస్ఐ ఇంజిన్: ఇది కేవలం 7-స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభించే అవకాశం ఉంది.
ఈ సందర్భంగా వోక్స్‌వ్యాగన్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ నితిన్ కోహ్లీ మాట్లాడుతూ.. "కొత్త టైగన్ ఎస్‌యూవీ ప్రియులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. బోల్డ్ డిజైన్, బెస్ట్-ఇన్-సెగ్మెంట్ టెక్నాలజీ, అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో ఇది డ్రైవింగ్ డైనమిజంను సరికొత్తగా నిర్వచిస్తుంది. స్థానికంగా ఇంజనీరింగ్ చేసిన ఈ కారు ప్రతిరోజూ ఉత్సాహాన్ని, నమ్మకాన్ని అందిస్తుంది," అని పేర్కొన్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


