భారత ఫుల్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న 'టయోటా ఫార్చ్యూనర్' సరికొత్త అవతారంలో రాబోతోంది. పూర్తిగా క్యామోఫ్లేజ్ (రంగురంగుల స్టిక్కర్ల) ముసుగుతో రోడ్లపై పరీక్షలు జరుపుకుంటూ నెక్ట్స్-జనరేషన్ టయోటా ఫార్చ్యూనర్ తాజాగా అర్జెంటీనాలో కెమెరాలకు చిక్కింది. దక్షిణ అమెరికా దేశాల్లో ఈ ఏడు సీట్ల ఎస్‌యూవీని ‘ఎస్‌డబ్ల్యూ4’ పేరుతో విక్రయిస్తున్నారు. ఫార్చ్యూనర్ తన అసలైన బాడీ-ఆన్-ఫ్రేమ్ నిర్మాణాన్ని వదులుకోకుండానే, సమూల మార్పులతో కూడిన అప్‌డేట్‌కు సిద్ధమవుతోందని ఈ స్పై చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి.

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, వరంగల్ వంటి నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో టయోటా ఫార్చ్యూనర్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ ఫార్చ్యూనర్ అంటే కేవలం ఒక కారు మాత్రమే కాదు; రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులకు ఇదొక స్టేటస్ సింబల్! ధర రూ. 50 లక్షలు దాటినా, ఎన్ని కొత్త కార్లు పోటీకి వచ్చినా తెలుగు రాష్ట్రాల్లో దీని హవా ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు కొత్త తరం ఫార్చ్యూనర్ రాబోతోందన్న వార్త వాహన ప్రియుల్లో భారీ అంచనాలను పెంచుతోంది.
2027 టయోటా ఫార్చ్యూనర్- సరికొత్త ఆధునిక రూపం!
టెస్టింగ్ సమయంలో కనిపించిన వాహనాన్ని గమనిస్తే, ప్రస్తుత ఫార్చ్యూనర్‌కు గుర్తింపు తెచ్చిన ఎత్తైన బోనెట్, అప్రైట్ స్టాన్స్, విశాలమైన గ్లాస్ ఏరియాను టయోటా అలాగే కొనసాగించింది. నేటి కాలపు క్రాసోవర్ కార్ల తరహాలో కారు ఎత్తు తగ్గించి సన్నగా మార్చే ప్రయత్నం కంపెనీ చేయడం లేదు. అందుకు బదులుగా కారు ముందు భాగానికి మరింత పదునైన, ఆధునిక రూపాన్ని ఇచ్చేందుకే ప్రాధాన్యం ఇస్తోంది.
కొత్త టయోటా ఫార్చ్యూనర్‌లో మార్పులు చేసిన హెడ్‌లైట్లు, వెడల్పాటి మెష్-స్టైల్ గ్రిల్, కొత్తగా డిజైన్ చేసిన ఫ్రంట్ బంపర్ కనిపిస్తున్నాయి. గతంలో బయటకు వచ్చిన ప్రోటోటైప్ చిత్రాలను బట్టి వెనుక వైపు కొత్త టెయిల్-ల్యాంప్స్, టెయిల్‌గేట్ డిజైన్‌లో మార్పులతో పాటు సరికొత్త అల్లాయ్ వీల్స్ రానున్నాయి. బయటి రూపంలో ఇన్ని మార్పులు చేసినప్పటికీ, సాంకేతికంగా ఈ ఎస్‌యూవీ ‘హీలక్స్’ పికప్ ట్రక్కుతో తన అనుబంధాన్ని కొనసాగించనుంది.
భారత్ వంటి మార్కెట్లలో వినియోగదారులు ఎంతో ఇష్టపడే దృఢమైన నిర్మాణం, ఎత్తైన డ్రైవింగ్ పొజిషన్ కోసం పాత ‘ఐఎంవీ ల్యాడర్-ఫ్రేమ్’ ఆర్కిటెక్చర్‌నే ఇందులో వాడుతున్నారు. కారు మన్నిక, బరువులను లాగే సామర్థ్యం, కఠినమైన రహదారులపై దూసుకెళ్లే తత్వానికి ఎలాంటి ఆటంకం కలగకుండానే, ముందు వెనుక భాగాలకు ఆధునిక సొబగులు అద్దడం టొయోటాకు ఎంతో కలిసొచ్చే అంశం.
2027 టయోటా ఫార్చ్యూనర్- అడాస్ ఫీచర్!
{{/usCountry}}భారత్ వంటి మార్కెట్లలో వినియోగదారులు ఎంతో ఇష్టపడే దృఢమైన నిర్మాణం, ఎత్తైన డ్రైవింగ్ పొజిషన్ కోసం పాత ‘ఐఎంవీ ల్యాడర్-ఫ్రేమ్’ ఆర్కిటెక్చర్‌నే ఇందులో వాడుతున్నారు. కారు మన్నిక, బరువులను లాగే సామర్థ్యం, కఠినమైన రహదారులపై దూసుకెళ్లే తత్వానికి ఎలాంటి ఆటంకం కలగకుండానే, ముందు వెనుక భాగాలకు ఆధునిక సొబగులు అద్దడం టొయోటాకు ఎంతో కలిసొచ్చే అంశం.
2027 టయోటా ఫార్చ్యూనర్- అడాస్ ఫీచర్!
{{/usCountry}}బయటి డిజైన్‌కు తగ్గట్టుగానే 2027 టయోటా ఫార్చ్యూనర్ లోపలి క్యాబిన్‌లోనూ భారీ మార్పులు జరగనున్నాయి. కొత్తగా డిజైన్ చేసిన స్టీరింగ్ వీల్, సరికొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అప్‌డేట్ చేసిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇందులో కొలువుదీరనున్నాయి. తదుపరి తరం హీలక్స్‌లోని ఫీచర్లతో పాటు, ఉత్తర అమెరికా మార్కెట్లో విక్రయించే 'టయోటా టకోమా' నుంచి కొన్ని ప్రీమియం పరికరాలను ఇందులోకి తీసుకురానున్నారు.
భద్రత విషయంలోనూ టయోటా ఈసారి కీలక అడుగు వేస్తోంది. కొత్త ఫార్చ్యూనర్‌లో అధునాతన ‘అడాస్’ భద్రతా ఫీచర్లను అందించే అవకాశం ఉంది. అయితే ఇందులో ఏయే అడాస్ ఫీచర్లు ఉంటాయి, భారత మార్కెట్లోకి వచ్చే వేరియంట్లలో వేటిని అందిస్తారన్న వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
భారత్‌లో ఇంజిన్ ఆప్షన్లు.. విడుదల ఎప్పుడంటే?
భారత మార్కెట్ విషయానికొస్తే, కొత్త ఫార్చ్యూనర్‌లోనూ అందరికీ సుపరిచితమైన 2.8-లీటర్ టర్బో-డీజిల్ ఇంజిన్‌నే కొనసాగించనున్నారు. ప్రస్తుతం ఈ ఇంజిన్ 204 hp పవర్‌ని, గరిష్టంగా 500 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తోంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు లభించనున్నాయి. కఠినతరం అవుతున్న కాలుష్య నిబంధనల నేపథ్యంలో కొనుగోలుదారులకు ప్రత్యామ్నాయంగా 2.7-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను కూడా మళ్లీ ప్రవేశపెట్టే ఆలోచనలో టొయోటా ఉంది. ఈ పెట్రోల్ ఇంజిన్ 166 hp పవర్‌ని, 245 Nm టార్క్‌ను అందిస్తుంది; అయితే దీనిపై కంపెనీ ఇంకా తుది నిర్ణయం ప్రకటించలేదు.
నెక్ట్స్-జనరేషన్ టయోటా ఫార్చ్యూనర్ 2026 డిసెంబర్ 1న దక్షిణాఫ్రికా వేదికగా అంతర్జాతీయ అరంగేట్రం చేయనుంది. మన దేశీయ మార్కెట్లో 2027లో ఈ కారు విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే భారత్‌లో విడుదల తేదీపై టయోటా త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది.
ఆధునిక క్యాబిన్, అడాస్ భద్రత తోడైతే 2027లోనూ భారత ఎస్‌యూవీ మార్కెట్లో ఫార్చ్యూనర్ జైత్రయాత్ర కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.