NEET UG 2026 FAQs : నీట్ యూజీ రీ-ఎగ్జామ్ గైడ్‌లైన్స్! టైమ్, ఎగ్జామ్ సెంటర్ వివరాలు..
NEET UG 2026 : నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ జూన్ 21న జరగుతోందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ పరీక్షకు సంబంధించిన పలు కీలక సందేహాలను నివృత్తి చేస్తూ ఎన్టీఏ గైడ్‌లైన్స్‌ని జారీ చేసింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మే 3న జరిగిన నీట్ యూజీ (NEET UG 2026) పరీక్షను పేపర్ లీక్ కారణాల వల్ల రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మే 12న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జూన్ 21న దేశవ్యాప్తంగా నీట్ యూజీ రీ-ఎగ్జామినేషన్ నిర్వహించనున్నారు. ఎన్టీఏ విడుదల చేసిన తాజా గైడ్‌లైన్స్ ప్రకారం జూన్ 21న మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు ఈ రీ-ఎగ్జామ్ జరగనుంది. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు జూన్ 14, 2026 నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది.

కాగా పరీక్ష రద్దు నేపథ్యంలో అభ్యర్థుల్లో ఫీజు రీఫండ్, ఎగ్జామ్ సెంటర్లు, మీడియం మార్పు వంటి పలు అంశాలపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అభ్యర్థుల గందరగోళాన్ని తొలగించేందుకు ఎన్టీఏ తాజాగా ఒక సమగ్రమైన తరచుగా అడిగే ప్రశ్నల జాబితాను విడుదల చేసింది. ఆ వివరాలు ఇక్కడ చూద్దాము.
1. పరీక్ష ఫీజు రీఫండ్..
పాత పరీక్షకు కట్టిన ఫీజు రీఫండ్ గురించి ఎన్టీఏ కీలక అప్‌డేట్ ఇచ్చింది.
లింక్ ఓపెన్ అయింది: అభ్యర్థులు తమ బ్యాంక్ ఖాతా వివరాలను షేర్ చేయడానికి ఎన్టీఏ పోర్టల్‌ను ఇప్పటికే తెరిచింది. బ్యాంక్ వివరాలను సమర్పించడానికి గడువును జూన్ 22 వరకు పొడిగించారు.
13 లక్షల మంది రిజిస్ట్రేషన్: ఇప్పటివరకు దాదాపు 13 లక్షల మంది అభ్యర్థులు తమ బ్యాంక్ ఖాతా వివరాలను విజయవంతంగా అప్‌డేట్ చేశారు.
అదనపు ఫీజు లేదు: జూన్ 21న జరిగే రీ-ఎగ్జామ్ రాయడానికి అభ్యర్థులు ఎలాంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
2. ఎగ్జామ్ మీడియం మార్చవచ్చా?
మీడియం మార్పునకు నో ఛాన్స్: "నేను పరీక్ష రాసే మీడియం (తెలుగు/ఇంగ్లీష్/హిందీ మొదలైనవి) మార్చుకోవచ్చా?" అని అభ్యర్థులు అడిగిన ప్రశ్నకు ఎన్టీఏ ఖచ్చితమైన సమాధానం ఇచ్చింది. నీట్ యూజీ 2026 దరఖాస్తు ఫారమ్‌ను మొదట సమర్పించినప్పుడు ఎంచుకున్న మీడియమే ఫైనల్. రీ-ఎగ్జామ్ రాసే అభ్యర్థులు తమ క్వశ్చన్ పేపర్ మీడియాన్ని మార్చుకోవడానికి ఎలాంటి అవకాశం లేదు.
3. ఎగ్జామ్ సెంటర్, సిటీ అలాట్‌మెంట్..
గతంలో రాసిన సెంటరే మళ్లీ వస్తుందా? అనే ప్రశ్నపై ఎన్టీఏ క్లారిటీ ఇచ్చింది.
మారే అవకాశం ఉంది: అభ్యర్థులు ఎంచుకున్న సిటీ ఆధారంగా సెంటర్లను కేటాయిస్తారు. అందువల్ల, రీ-ఎగ్జామ్ కోసం కేటాయించే పరీక్షా కేంద్రం గతంలో వచ్చిన సెంటర్ లాగే ఉండాలని లేదు, మారే అవకాశం ఉంది.
సిటీ అప్‌డేట్ విండో: అభ్యర్థులకు తమ పాత సిటీ ఛాయిస్‌లను మార్చుకోవడానికి మే 15 నుంచి 21 వరకు అవకాశం ఇచ్చారు. ఎవరైతే ఈ సదుపాయాన్ని వాడుకోలేదో, వారి పాత సిటీ ఆప్షన్లే కొనసాగుతాయి. కంప్యూటర్ ఆధారిత వ్యవస్థ ద్వారా విద్యార్థులకు రాండమ్ పద్ధతిలో సెంటర్లను కేటాయిస్తారు.
4. పరీక్ష సమయం.. అదనంగా 15 నిమిషాలు ఎందుకు?
నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ మొత్తం 3 గంటల 15 నిమిషాల పాటు జరుగుతుంది.
అదనపు సమయం ఎందుకు?: అఫీషియల్ గైడ్‌లైన్స్ ప్రకారం.. అభ్యర్థుల డాక్యుమెంటేషన్, ఐడెంటిటీ వెరిఫికేషన్ (తనిఖీలు), ఇతర పరీక్ష సంబంధిత ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి ఈ అదనపు 15 నిమిషాల సమయాన్ని కేటాయించారు.
ఫిర్యాదుల కోసం ప్రత్యేక ఈమెయిల్..
మే 3న జరిగిన నీట్ యూజీ 2026 పరీక్షలో సెంటర్ల నిర్వాహణ లోపాల వల్ల లేదా ఇతర ఇబ్బందుల వల్ల అసౌకర్యానికి గురైన అభ్యర్థులు ఎవరైనా ఉంటే.. తగిన ఆధారాలు/డాక్యుమెంట్లతో కూడిన తమ ఫిర్యాదులను ఎన్టీఏ హెల్ప్‌డెస్క్ ఈమెయిల్ ఐడీ neetug2026@nta.ac.in కు పంపవచ్చని అధికారులు సూచించారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


