NEET UG 2026 results : నీట్ యూజీ రీ-ఎగ్జామ్ ఫలితాలు త్వరలోనే! ఇలా చెక్ చేసుకోండి..
NEET UG results 2026 : దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ రాసిన మెడికల్ అస్పిరెంట్లకు అలర్ట్. ఈ పరీక్షకు సంబంధించిన ప్రొవిజినల్ ఆన్సర్ కీ, రికార్డెడ్ రెస్పాన్స్‌ల ఇప్పటికే విడుదలవ్వగా, త్వరలోనే ఫలితాలు కూడా వెలువడే అవకాశం ఉంది.
భారతదేశంలో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్ష వివాదాల నడుమ రద్దు కావడం, ఆ తర్వాత జూన్ 21న దేశవ్యాప్తంగా రీ-ఎగ్జామ్ నిర్వహించడం తెలిసిందే. ఈ క్రమంలోనే నీట్ యూజీ రీ-ఎగ్జామినేషన్‌కు సంబంధించిన ప్రొవిజినల్ ఆన్సర్ కీని ఇటీవలే రిలీజ్ చేసిన ఎన్టీఏ.. ఇప్పుడు ఫలితాలను విడుదల చేసే పనిలో పడింది. అనేక నివేదికల ప్రకారం నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ ఫలితాలు త్వరలోనే విడుదలకానున్నాయి.

నీట్ యూజీ ఫలితాలు 2026 డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?
ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు తమ స్కోర్‌కార్డులను సులువుగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ కింది పద్ధతిని అనుసరించవచ్చు:
స్టెప్ 1- మొదట నీట్ అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in ను ఓపెన్ చేయాలి.
స్టెప్ 2- హోమ్‌పేజీలో కనిపించే 'NEET UG Result 2026' లింక్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ 3- ఆ తర్వాత మీ లాగిన్ వివరాలైన అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, స్క్రీన్‌పై కనిపించే సెక్యూరిటీ పిన్‌ను ఎంటర్ చేయాలి.
స్టెప్ 4- వివరాలన్నీ సరిచూసుకున్న తర్వాత ‘సబ్‌మిట్’ బటన్‌పై క్లిక్ చేయాలి. వెంటనే మీ నీట్ యూజీ 2026 స్కోర్‌కార్డ్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది.
స్టెప్ 5- భవిష్యత్తులో కౌన్సిలింగ్, అడ్మిషన్ల అవసరాల కోసం ఆ స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ఒక ప్రింటవుట్ దగ్గర పెట్టుకోవడం మంచిది.
నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ ఆన్సర్ కీ..
నీట్ యూజీ 2026 ఆన్సర్ కీపై అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు అభ్యర్థులకు 'కీ ఛాలెంజ్' విండోను కూడా ఎన్టీఏ అందుబాటులోకి తెచ్చింది.
పరీక్ష రాసిన విద్యార్థులు ప్రొవిజినల్ ఆన్సర్ కీలో ఏవైనా తప్పులు ఉంటే, వాటిని సవరించాలని కోరుతూ జూన్ 28, 2026 రాత్రి 11:50 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అయితే, అభ్యంతరం వ్యక్తం చేసే ప్రతి ప్రశ్నకు రూ. 200 చొప్పున నాన్-రిఫండబుల్ ఫీజు (తిరిగి ఇవ్వని రుసుము) చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలన్నింటినీ సబ్జెక్ట్ నిపుణులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఆ తర్వాతే ఎన్టీఏ తుది ఆన్సర్ కీని విడుదల చేస్తుంది. దీని ఆధారంగానే నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ ఫలితాలు, ర్యాంకులను జులై మొదటి లేదా రెండో వారంలో అధికారికంగా వెల్లడిస్తారు.
భారతదేశంలో అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటిగా భావించే నీట్‌ను ఈసారి ఎన్టీఏ పటిష్టమైన భద్రతా చర్యల మధ్య నిర్వహించింది. పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో మే 3న జరిగిన పరీక్ష రద్దు కాగా, జూన్ 21న దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు మళ్లీ పరీక్షకు హాజరయ్యారు.
ఇక ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు ఎప్పటికప్పుడు అప్‌డేట్ల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వాలని అధికారులు సూచించారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


