నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం తాజాగా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్స్) విభాగంలో మొత్తం 250 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఈ నేపథ్యంలో ఈ ఎన్టీపీసీ రిక్రూట్‌మెంట్ 2026 వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
ఎన్టీపీసీ రిక్రూట్‌మెంట్ 2026- ముఖ్యమైన తేదీలు..

నోటిఫికేషన్ విడుదల: 23 ఏప్రిల్ 2026
దరఖాస్తు ప్రారంభ తేదీ: 23 ఏప్రిల్ 2026
దరఖాస్తుకు చివరి తేదీ: 07 మే 2026
ఎన్టీపీసీ రిక్రూట్‌మెంట్ 2026- ఖాళీల వివరాలు..
మొత్తం పోస్టులు: 250
విభాగం: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్స్)
వేతనం: నెలకు రూ. 55,000 (స్థిర వేతనం) తో పాటు కంపెనీ నిబంధనల ప్రకారం ఇతర ప్రయోజనాలు ఉంటాయి.
ఎన్టీపీసీ రిక్రూట్‌మెంట్ 2026- అర్హత ప్రమాణాలు:
విద్యార్హత: ఈ ఎన్టీపీసీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2026 కోసం గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీఈ/ బీటెక్ పూర్తి చేసి ఉండాలి (కనీసం 40% మార్కులు ఉండాలి).
ఎక్స్‌పీరియెన్స్: 40 మెగావాట్లు లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల పవర్ ప్లాంట్ ఆపరేషన్ లేదా మెయింటెనెన్స్‌లో కనీసం ఒక సంవత్సరం పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయస్సు 35 ఏళ్లు (07 మే 2026 నాటికి). ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎన్టీపీసీ రిక్రూట్‌మెంట్ 2026- దరఖాస్తు రుసుము..
ఎన్టీపీసీ రిక్రూట్‌మెంట్ 2026 కోసం
{{/usCountry}}ఎన్టీపీసీ రిక్రూట్‌మెంట్ 2026 కోసం
{{/usCountry}}జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్: రూ. 500
ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ / మహిళా అభ్యర్థులు: ఎటువంటి ఫీజు లేదు (ఉచితం).
ఎన్టీపీసీ రిక్రూట్‌మెంట్ 2026- ఎంపిక ప్రక్రియ..
ఈ ప్రభుత్వ ఉద్యోగ కోస అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో ఉంటుంది:
- ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్ (అభ్యర్థుల సంఖ్యను బట్టి)
- షార్ట్‌లిస్టింగ్
- పర్సనల్ ఇంటర్వ్యూ
ఎన్టీపీసీ రిక్రూట్‌మెంట్ 2026- దరఖాస్తు చేయడం ఎలా?
స్టెప్ 1- అభ్యర్థులు NTPC అధికారిక వెబ్‌సైట్ careers.ntpc.co.in సందర్శించాలి.
స్టెప్ 2- 'Current Openings' విభాగంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ 3- మీ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకుని, అవసరమైన పత్రాలను (ఫోటో, సంతకం, సర్టిఫికెట్లు) అప్‌లోడ్ చేయాలి.
స్టెప్ 4- ఫీజు చెల్లించి, అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఒక ప్రింట్ అవుట్ తీసుకోవడం మర్చిపోకండి.
గమనిక: ఈ నియామకాలు ప్రారంభంలో 3 ఏళ్ల కాలపరిమితి (Fixed-term) కోసం జరుగుతాయి. పనితీరు ఆధారంగా దీనిని మరో 2 ఏళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది.
ఎన్టీపీసీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎన్టీపీసీ రిక్రూట్‌మెంట్ 2026 అప్లికేషన్ డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. ఈ ఉద్యోగం పర్మనెంట్ ప్రాతిపదికన ఉంటుందా?లేదు, ఇది ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటుంది. ప్రారంభంలో 3 ఏళ్లు ఉంటుంది, అవసరాన్ని బట్టి మరో 2 ఏళ్లు పొడిగించవచ్చు.
2. ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలా?
అవును, పవర్ ప్లాంట్ ఆపరేషన్స్‌లో కనీసం ఒక ఏడాది పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం ఖచ్చితంగా ఉండాలి.
3. వేతనం ఎంత వరకు ఉంటుంది?
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.55,000 కన్సోలిడేటెడ్ పే లభిస్తుంది. దీనితో పాటు కంపెనీ నివాసం, నైట్ షిఫ్ట్ అలవెన్స్ వంటి సౌకర్యాలు కూడా ఉండవచ్చు.
4. పరీక్ష ఎప్పుడు ఉండవచ్చు?
పరీక్ష లేదా ఇంటర్వ్యూ తేదీలను NTPC త్వరలోనే వెబ్‌సైట్‌లో ప్రకటిస్తుంది. అభ్యర్థులు మెయిల్ లేదా SMS ద్వారా కూడా సమాచారం పొందుతారు.