...
...
Next Story

Electric bike : సింగిల్​ ఛార్జ్​తో 180+ కి.మీ రేంజ్​! ఇంకొన్ని రోజుల్లో కొత్త ఎలక్ట్రిక్​ బైక్ లాంచ్..

New electric bike : భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బెంగళూరుకు చెందిన ఓబెన్ ఎలక్ట్రిక్ మరో సంచలనానికి సిద్ధమైంది. తన కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌కు సంబంధించిన తొలి టీజర్‌ను విడుదల చేస్తూ వాహన ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తించింది. వివరాల్లోకి వెళితే..

Published on: Apr 28, 2026, 09:09:03 IST
Advertisement

Long range electric bike : దేశీయ ఈవీ రంగంలో వేగంగా విస్తరిస్తున్న ఓబెన్ ఎలక్ట్రిక్.. మార్కెట్​లోకి తన కొత్త అస్త్రాన్ని వదలడానికి రంగం సిద్ధం చేసింది. ఏప్రిల్ 30న ఈ కొత్త ఎలక్ట్రిక్​ బైక్​ని అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే ‘రోర్’, ‘రోర్ ఈజెడ్’ మోడల్స్‌తో సక్సెస్ అందుకున్న ఓబెన్.. ఈ మూడొవ బైక్‌తో మార్కెట్ వాటాను మరింత పెంచుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

కొత్త ఎలక్ట్రిక్​ బైక్- ఆకట్టుకుంటున్న టీజర్: డిజైన్ ఎలా ఉండబోతోంది?

ఓబెన్​ కొత్త ఎలక్ట్రిక్​ బైక్..
ఓబెన్​ కొత్త ఎలక్ట్రిక్​ బైక్..

కంపెనీ విడుదల చేసిన టీజర్ ఇమేజ్ ప్రకారం.. ఈ కొత్త బైక్ ముందు భాగం చాలా స్టైలిష్‌గా, అగ్రెసివ్‌గా కనిపిస్తోంది. ముఖ్యంగా:

యూ-ఆకారపు ఎల్​ఈడీ డీఆర్​ఎల్: పైన యూ-షేప్‌లో ఉన్న ఎల్‌ఈడీ డే-టైమ్ రన్నింగ్ లైట్ బైక్‌కు ప్రీమియం లుక్‌ను ఇస్తోంది.

ప్రొజెక్టర్ లెన్స్: దీనికి దిగువన అమర్చిన ప్రొజెక్టర్ లెన్స్ హెడ్‌ల్యాంప్ రాత్రి వేళల్లో మెరుగైన వెలుతురును ఇస్తుందని తెలుస్తోంది.

బోల్డ్ డిజైన్: "Unleash The Bold" (అన్‌లీష్ ద బోల్డ్) అనే స్లోగన్‌తో వస్తున్న ఈ బైక్, గత మోడల్స్ కంటే భిన్నమైన, పవర్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్‌తో ఉండబోతున్నట్లు స్పష్టమవుతోంది.

కొత్త ఎలక్ట్రిక్​ బైక్- సాంకేతిక అంశాలు, రేంజ్ (అంచనా)..

ఓబెన్ తన ఎలక్ట్రిక్ బైక్‌లలో సాధారణంగా ఎల్​ఎఫ్​పీ (లిథియం ఐయాన్ ఫాస్ఫేట్) బ్యాటరీ సాంకేతికతను ఉపయోగిస్తుంది. ఈ కొత్త బైక్ కూడా ఇదే టెక్నాలజీతో వచ్చే అవకాశం ఉంది.

కంపెనీ ప్రస్తుత మోడల్స్ 4.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో, ఒకే ఛార్జ్‌పై సుమారు 187 కిలోమీటర్ల రేంజ్ ఇస్తున్నాయి. వీటి గరిష్ట వేగం గంటకు 100 కిమీ కాగా, కేవలం 3 సెకన్లలోనే 0 నుంచి 40 కిమీ వేగాన్ని అందుకుంటాయి. కొత్త బైక్ పనితీరు దీనికి సమానంగా లేదా అంతకంటే మెరుగ్గా ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అలాగే, సుమారు 2 గంటల్లోనే బ్యాటరీని పూర్తిస్థాయిలో ఛార్జ్ చేసే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండవచ్చు.

కొత్త ఎలక్ట్రిక్​ బైక్- స్మార్ట్ ఫీచర్లు..

జియో ఫెన్సింగ్, థెఫ్ట్ అలర్ట్: దొంగతనం నుంచి రక్షణ కల్పించే అలర్ట్స్.

మల్టిపుల్ రైడింగ్ మోడ్స్: అవసరానికి తగ్గట్టుగా వేగాన్ని, రేంజ్‌ను మార్చుకునే వెసులుబాటు.

యూఎస్బీ పోర్ట్స్: మొబైల్ ఛార్జింగ్ కోసం.

రీజెనరేటివ్ బ్రేకింగ్: బ్రేక్ వేసినప్పుడు బ్యాటరీ రీఛార్జ్ అయ్యే టెక్నాలజీ.

ప్రస్తుతం 100కు పైగా నగరాల్లో అందుబాటులో ఉన్న ఓబెన్, ఈ కొత్త లాంచ్‌తో సాధారణ ప్రయాణికులతో పాటు పవర్‌ఫుల్ బైక్స్ కోరుకునే యువతను కూడా టార్గెట్ చేస్తోంది. ఏప్రిల్ 30న జరిగే ఈవెంట్‌లో ఈ బైక్ ధర, లభ్యతకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు -

1. ఓబెన్ ఎలక్ట్రిక్ కొత్త బైక్ ఎప్పుడు లాంచ్ అవుతుంది?

ఓబెన్ ఎలక్ట్రిక్ తన కొత్త ఎలక్ట్రిక్ బైక్​ని ఏప్రిల్ 30, 2026న అధికారికంగా ఆవిష్కరించనుంది.

2. ఈ బైక్ రేంజ్, వేగం ఎంత ఉండవచ్చు?

అధికారిక వివరాలు వెల్లడికావాల్సి ఉన్నప్పటికీ, ఓబెన్ గత మోడల్స్ ఆధారంగా ఇది 180+ కిలోమీటర్ల రేంజ్, గంటకు 100 కిమీ గరిష్ట వేగంతో వచ్చే అవకాశం ఉంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe