స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ఒప్పో సంస్థ ఒక అదిరిపోయే వార్త చెప్పింది. గత నెలలో చైనా మార్కెట్లో విడుదల చేసిన తన మోస్ట్ అవేటెడ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ ‘ఒప్పో రెనో 16’ని త్వరలోనే భారత్‌లో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ సిరీస్ కింద ఒప్పో రెనో 16, ఒప్పో రెనో 16 ప్రో మోడళ్లను కంపెనీ దేశీయ మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఈ ఫోన్ల రాకను అధికారికంగా ఖరారు చేస్తూ ఒప్పో ఇండియా సాషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' లో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది.

భారతదేశంలో ఈ స్మార్ట్ఫోన్ల విక్రయాల కోసం ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో ప్రత్యేక మైక్రోసైట్లు ఇప్పటికే లైవ్ అయ్యాయి. చైనాలో ఈ ఫోన్లతో పాటు లాంచ్ చేసిన ఒప్పో ఎన్కో ఎయిర్ 5ఎస్ ఇయర్‌బడ్స్, సరికొత్త ఒప్పో బబుల్ యాక్సెసరీని కూడా భారత్‌లో విడుదల చేయనున్నట్లు కంపెనీ టీజర్ల ద్వారా హింట్ ఇచ్చింది.
చైనాలో ధరలు ఎలా ఉన్నాయి?
మే 25న చైనాలో విడుదలైన ఈ ఫోన్ల బేస్ వేరియంట్ (12జీబీ రామ్ + 256జీబీ స్టోరేజ్) ధరలను పరిశీలిస్తే.. ఒప్పో రెనో 16 ధర 3,499 యువాన్ (మన కరెన్సీలో సుమారు రూ. 49,000) గా ఉంది. అలాగే హై-ఎండ్ మోడల్ ఒప్పో రెనో 16 ప్రో ధర 4,499 యువాన్ (సుమారు రూ. 63,000) గా కంపెనీ నిర్ణయించింది. భారత మార్కెట్లోనూ ఇవే ధరల శ్రేణిలో ఈ ఫోన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఒప్పో రెనో 16 ప్రో ఫీచర్లు..
ఈ సిరీస్‌లో టాప్ మోడల్ అయిన ఒప్పో రెనో 16 ప్రో అద్భుతమైన డిస్‌ప్లే, ప్రాసెసర్‌తో వస్తోంది. ఇందులో 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కూడిన 6.78 ఇంచుల 1.5కే అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500ఎస్ ఆక్టా-కోర్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఇందులో ఏకంగా 7,000ఎంఏహెచ్ సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చడం విశేషం.
ఒప్పో రెనో 16 (స్టాండర్డ్) ఫీచర్లు..
ఇక స్టాండర్డ్ మోడల్ అయిన ఒప్పో రెనో 16 విషయానికి వస్తే.. ఇది 6.32 ఇంచుల 1.5K ఓలెడ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8550 సూపర్ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. బ్యాటరీ విషయానికొస్తే ఇది 6,700ఎంఏహెచ్ సామర్థ్యంతో వస్తోంది.
{{/usCountry}}ఇక స్టాండర్డ్ మోడల్ అయిన ఒప్పో రెనో 16 విషయానికి వస్తే.. ఇది 6.32 ఇంచుల 1.5K ఓలెడ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8550 సూపర్ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. బ్యాటరీ విషయానికొస్తే ఇది 6,700ఎంఏహెచ్ సామర్థ్యంతో వస్తోంది.
{{/usCountry}}ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు కూడా దుమ్ము, నీటి నుండి పూర్తి రక్షణ ఇచ్చే అత్యంత శక్తివంతమైన ఐపీ69కే రేటింగ్‌తో వస్తున్నాయి.
డిజిటల్ కెమెరాను తలపించేలా 200ఎంపీ కెమెరా!
ఒప్పో రెనో సిరీస్ ఫోన్లు అనగానే అందరికీ గుర్తొచ్చేది కెమెరా క్వాలిటీ. ఈసారి కూడా కంపెనీ కెమెరా విభాగంలో విప్లవాత్మక మార్పులు చేసింది. ఈ సిరీస్ ఫోన్లలో వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను ఇచ్చారు. అందులో మెయిన్ కెమెరా ఏకంగా 200 మెగాపిక్సెల్ (ఎఫ్/1.8) కావడం గమనార్హం. దీనికి తోడుగా 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, మరో 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాలను అమర్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో కూడా 50 మెగాపిక్సెల్ (ఎఫ్/2.0) హై-రెజల్యూషన్ కెమెరాను అందించారు.
కొత్త యాక్సెసరీలు కూడా..
చైనాలో ఈ ఫోన్లతో పాటు ఒప్పో ఎన్కో ఎయిర్ 5ఎస్ బడ్స్, ఒక సరికొత్త ‘ఒప్పో బబుల్’ యాక్సెసరీని లాంచ్ చేశారు. ఈ ఒప్పో బబుల్ అనేది ఫోన్ వెనుక వైపు అయస్కాంతం ద్వారా అతుక్కునే ఒక చిన్న సెకండరీ డిస్‌ప్లే స్క్రీన్. అయితే ఇండియాలో లాంచ్ చేయబోయే ఇయర్‌బడ్స్ మోడల్ ఇదేనా కాదా అనే దానిపై కంపెనీ ఇంకా స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ ఫోన్ల ఇండియా లాంచ్ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించనుంది.