ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ అంటే క్రికెట్ ప్రపంచం మొత్తం ఊగిపోతుంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు లేకపోవడంతో ఈ చిరకాల ప్రత్యర్థులు కేవలం ఐసీసీ టోర్నీల్లోనే తలపడున్నాయి. అయితే ఇప్పుడు టీ20 ప్రపంచకప్ లో ఇండియాతో మ్యాచ్ ను పాకిస్థాన్ బాయ్ కాట్ చేసింది. కానీ టీమిండియాతో ఆడాలంటే మూడు కండీషన్లకు ఓకే చెప్పాలని ఐసీసీకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తెలిపిందనే వార్తలు వస్తున్నాయి.
మూడు కండీషన్లు
టీ20 ప్రపంచకప్ లోె ఇండియాతో మ్యాచ్ ఆడాలని పాకిస్థాన్ పై అన్ని వైపుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం (ఫిబ్రవరి 8) రాత్రి లాహోర్ లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ), ఐసీసీ ప్రతినిధి మధ్య మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లోనే టీమిండియాతో ప్రపంచకప్ లో ఆడాలంటే మూడు కండీషన్లను ఐసీసీ ముందు పీసీబీ పెట్టినట్లు తెలిసింది.
వాటా ఇవ్వాలంటూ
పీసీబీ మూడు కండీషన్లు ఇవే అంటూ క్రిక్ బజ్ తన రిపోర్ట్ లో పేర్కొంది. అందులో ఒకటేమో.. ఐసీసీ ఆదాయంలో పాకిస్థాన్ కు వచ్చే వాటాను పెంచడం. రెండోది.. భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ లను మళ్లీ నిర్వహించడం. మూడోది.. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ లో ఆటగాళ్లు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడం. ఈ మూడు కండీషన్లకు ఓకే చెప్తే ఇండియాతో టీ20 ప్రపంచకప్ మ్యాచ్ ఆడతామని పీసీబీ చెప్పినట్లు తెలిసింది.
శ్రీలంక జోక్యం
షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న శ్రీలంకలోని కొలంబో స్టేడియంలో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరగాల్సింది. కానీ బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను ఐపీఎల్ లో ఆడకుండా బీసీసీఐ వేటు వేయడం, ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ టీమ్ ను ఐసీసీ తప్పించడంతో వివాదం ముదిరింది. బంగ్లాదేశ్ కు సపోర్ట్ గా ప్రపంచకప్ లో ఇండియాతో మ్యాచ్ ను బాయ్ కాట్ చేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది.
{{/usCountry}}షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న శ్రీలంకలోని కొలంబో స్టేడియంలో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరగాల్సింది. కానీ బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను ఐపీఎల్ లో ఆడకుండా బీసీసీఐ వేటు వేయడం, ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ టీమ్ ను ఐసీసీ తప్పించడంతో వివాదం ముదిరింది. బంగ్లాదేశ్ కు సపోర్ట్ గా ప్రపంచకప్ లో ఇండియాతో మ్యాచ్ ను బాయ్ కాట్ చేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది.
{{/usCountry}}కానీ ప్రపంచకప్ అంటేనే ఇండియా వర్సెస్ పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అనేలా మారిపోయింది. ఈ దాయాదుల మధ్య మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఆత్రుతగా ఎదురు చూస్తారు. ఈ మ్యాచ్ జరిగితే శ్రీలంక క్రికెట్ బోర్డుకు పేరు, ఆదాయం వస్తాయి. అందుకే పాక్, ఇండియా మ్యాచ్ జరిగేలా శ్రీలంక జోక్యం చేసుకుంటోంది.
మరో 48 గంటల్లో
టీ20 ప్రపంచకప్ లో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ పై మరో 48 గంటల్లో నిర్ణయం ప్రకటిస్తారని తెలుస్తోంది. అయితే పీసీబీ మూడు కండీషన్లను ఐసీసీ ఒప్పుకుంటుందా? లేదా? అన్నదే ఇక్కడ కీలకం. ప్రస్తుత పరిస్థితుల్లో పాక్ తో భారత్ ద్వైపాక్షిక సిరీస్ లు ఆడటం జరగదనే చెప్పాలి. అలాగే ఆ దేశ ఆటగాళ్లతో మనవాళ్లు హ్యాండ్ షేక్ చేయరు. ఛాంపియన్స్ ట్రోఫీలో అలాగే జరిగింది.