...
...
Next Story

T20 World Cup: 12 ఏళ్ల కోహ్లి రికార్డును బ్రేక్ చేసిన పాకిస్థాన్ క్రికెటర్..కానీ ఏం లాభం? పాక్ పై సొంత ఫ్యాన్స్ ట్రోల్స్

T20 World Cup: ఇండియా లెజెండ్ విరాట్ కోహ్లి రికార్డు బద్దలైంది. పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ కొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు. కానీ ఏం లాభం? ప్రపంచకప్ నుంచి టీమ్ నిష్క్రమించిందంటూ సొంత జట్టుపై పాక్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ట్రోల్స్ మోత మోగిస్తున్నారు.

Published on: Mar 1, 2026, 08:30:10 IST
Advertisement

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి 12 ఏళ్ల రికార్డు బద్దలైంది. ఒక టీ20 ప్రపంచకప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా కోహ్లి రికార్డును పాకిస్థాన్ ఆటగాడు సాహిబ్జాదా ఫర్హాన్ తిరగరాశాడు. టీ20 ప్రపంచకప్ 2026లో కొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు. కానీ ఏం లాభం? టీమ్ సెమీస్ చేరలేదని పాక్ జట్టుపై సొంత ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

విరాట్ కోహ్లి రికార్డు

సాహిబ్జాదా ఫర్హాన్ (AP)
సాహిబ్జాదా ఫర్హాన్ (AP)

ఒక టీ20 ప్రపంచకప్ లో అత్యధిక పరుగుల చేసిన రికార్డు నిన్నటి వరకూ విరాట్ కోహ్లి పేరు మీద ఉండేది. 2014 టీ20 ప్రపంచకప్ లో కోహ్లి 319 పరుగులు చేశాడు. ఇప్పుడు 12 ఏళ్ల రికార్డును ఫర్హాన్ బ్రేక్ చేశాడు. 2026 టీ20 ప్రపంచకప్ లో ఫర్హాన్ 383 రన్స్ చేశాడు. నమీబియా, శ్రీలంకపై సెంచరీలు బాదాడు. ఇంగ్లాండ్ పై హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కానీ ఇండియాపై మాత్రం డకౌట్ అయ్యాడు.

పాకిస్థాన్ ఔట్

పాక్ ఓపెనర్ ఫర్హాన్ రికార్డు క్రియేట్ చేశాడు కానీ ఆ టీమ్ టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. సెమీస్ చేరకుండానే ఇంటి ముఖం పట్టింది. తమ సూపర్ 8 చివరి మ్యాచ్ లో శ్రీలంకపై 5 పరుగుల తేడాతో గెలిచినప్పటికీ నెట్ రన్ రేట్ లో వెనుకబడి పాక్ టోర్నీ నుంచి ఔట్ అయింది. ఘోర పరాభవాన్ని ఖాతాలో వేసుకుంది.

ఫ్యాన్స్ ఫైర్

టీ20 ప్రపంచకప్ లో సెమీస్ చేరకుండానే పాకిస్థాన్ క్రికెట్ జట్టు నిష్క్రమించడంతో సొంత టీమ్ పై పాక్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. బిల్డప్ తప్ప ఆట లేదంటూ మండిపడుతున్నారు. పాకిస్థాన్ క్రికెట్ ను నాశనం చేస్తున్నారంటూ ఆవేశం వ్యక్తం చేస్తున్నారు.

సెమీస్ చేరిందంటూ

టీ20 ప్రపంచకప్ సెమీస్

టీ20 ప్రపంచకప్ 2026 సెమీస్ కు ఇప్పటికే ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా అర్హత సాధించాయి. ఈ రోజు (మార్చి 1) ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ లో గెలిచిన టీమ్ సెమీస్ చేరుతుంది. వెస్టిండీస్ పై ఇండియా గెెలిస్తే సెమీస్ లో ఇంగ్లాండ్ తో తలపడాల్సి ఉంటుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks