...
...
Next Story

Petrol diesel price hike : మళ్లీ పెరిగిన ఇంధన​ రేట్లు- ఏపీలో రూ. 120కి చేరువలో లీటరు పెట్రోల్​ ధర!

Petrol price today : దేశంలో పెట్రోల్​, డీజిల్​ ధరలు మరోసారి పెరిగాయి. ఫలితంగా దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్​ ధర తొలిసారి రూ. 100 దాటింది. ఇక ఏపీలో లీటరు పెట్రోల్​ రేటు రూ. 120కి చేరువ అవుతోంది.

Published on: May 25, 2026, 06:32:11 IST
Advertisement

దేశవ్యాప్తంగా పెట్రోల్​, డీజిల్​ ధరలు మరోసారి పెరిగాయి. లీటరు పెట్రోల్​పై రూ. 2.61, లీటరు డీజిల్​పై ఈసారి రూ. 2.71 పెంచాలని చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయించాయి. అమెరికా- ఇరాన్ యుద్ధం, స్ట్రెయిట్ ఆఫ్​ హర్ముజ్​ వద్ద అనిశ్చితి కారణంగా మన దేశంలో ఇంధన ధరలు పెరగడం 10 రోజుల్లో ఇది 4వసారి.

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. (Pitamber Newar)
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. (Pitamber Newar)

తాజా పెంపుతో దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్​ ధర తొలిసారి రూ. 100 దాటింది. ఇక ఇంధన ధరలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లు నిలుస్తున్నాయి.

దిల్లీలో ప్రస్తుతం లీటరు పెట్రోల్​ ధర రూ. 99.51 నుంచి రూ. 102.12కి చేరింది. ఇక లీటరు డీజిల్​ ధర రూ. 92.49 నుంచి రూ. 95.20కి పెరిగింది.

కోల్​కతాలో పెట్రోల్​, డీజిల్​ ధరలు వరుసగా రూ. 113.51, రూ.99.82గాను, చెన్నైలో రూ. 111.21, రూ. 99.82గాను ఉన్నాయి.

ఇక చెన్నైలో లీటరు పెట్రోల్​ ధర రూ. 107.77గా, లీటరు డీజిల్​ ధర రూ. 99.55గా కొనసాగుతున్నాయి.

దేశ ఐటీ హబ్​ బెంగళూరులో లీటరు డీజిల్​ ధర రూ. 98.54గా, లీటరు పెట్రోల్​ ధర రూ. 110.61గా ఉన్నాయి.

మరోవైపు హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ. 115.73గాను, లీటరు డీజిల్​ ధర రూ .103.82గాను ఉన్నాయి. ఇక విజయవాడలో లీటరు పెట్రోల్​ ధర రూ. 117.75గాను, లీటరు డీజిల్​ ధర రూ. 105.43గాను ఉన్నాయి.

దేశంలోనే అత్యధికంగా హైదరాబాద్‌లో పెట్రోల్ ధరలు: ఢిల్లీలో తక్కువ.. ఎందుకీ భారీ తేడా?

సామాన్యుడి జేబుకు చిల్లు..

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks