భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా సరికొత్త సంచలనాన్ని ఆవిష్కరించింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ‘కియా సైరోస్ ఈవీ’ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని అధికారికంగా లాంచ్ చేసింది. టెక్నాలజీ పరంగా సరికొత్త ప్రమాణాలతో దూసుకొచ్చిన ఈ కారు ప్రీ-బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల కొనుగోలుదారులు రూ.25,000 టోకెన్ అడ్వాన్స్ చెల్లించి ఈ ఎస్‌యూవీని బుక్ చేసుకోవచ్చు.

ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభమయ్యే సమయానికి ధరలను అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతానికి ఈ మోడల్ బహుళ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది.
సరికొత్త ఈవీ కారుపై మీరు డబ్బులు పెట్టే ముందు తెలుసుకోవాల్సిన టాప్ 5 ముఖ్యాంశాలు ఇవే:
1. రెండు బ్యాటరీ ఆప్షన్లు.. 526 కి.మీ రేంజ్!
వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా కియా సైరోస్ ఈవీని రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో తీసుకొచ్చారు. ఇందులో మొదటిది 42 kWh బ్యాటరీ కాగా, రెండోది పెద్దదైన 51.4 kWh బ్యాటరీ ప్యాక్. ఏఆర్ఏఐ ధృవీకరించిన ఎంఐడీసీ సైకిల్ ప్రకారం.. 42 kWh బ్యాటరీ కలిగిన బేస్ వేరియంట్ సింగిల్ ఛార్జ్‌పై 443 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇక పెద్దదైన 51.4 kWh బ్యాటరీ వేరియంట్ ఏకంగా 526 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ స్పష్టం చేసింది.
ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో ముందు భాగంలో అమర్చిన మోటార్ 170 హెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెద్ద బ్యాటరీ కలిగిన వేరియంట్ కేవలం 8.1 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. కియాకు చెందిన అధునాతన కే1 ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి తయారైన ఈ కారులో IP67 రేటింగ్ కలిగిన ఎన్ఎంసీ బ్యాటరీ ప్యాక్‌ను వాడారు. బ్యాటరీ వేడెక్కకుండా లిక్విడ్-కూల్డ్ థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ కూడా ఇందులో ఉంది.
2. సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్.. అద్భుతమైన ఈవీ ఫీచర్లు
ఛార్జింగ్ పరంగా సైరోస్ ఈవీ అదరగొట్టింది. ఇందులో 100 kW DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. దీని సాయంతో కేవలం 39 నిమిషాల్లోనే కారు బ్యాటరీని 10 నుంచి 80 శాతానికి ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. ఇంటి వద్ద ఛార్జింగ్ కోసం కారుతో పాటు 10.8 kW ఆన్‌బోర్డ్ AC ఛార్జర్‌ను కూడా ఇస్తున్నారు.
{{/usCountry}}ఛార్జింగ్ పరంగా సైరోస్ ఈవీ అదరగొట్టింది. ఇందులో 100 kW DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. దీని సాయంతో కేవలం 39 నిమిషాల్లోనే కారు బ్యాటరీని 10 నుంచి 80 శాతానికి ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. ఇంటి వద్ద ఛార్జింగ్ కోసం కారుతో పాటు 10.8 kW ఆన్‌బోర్డ్ AC ఛార్జర్‌ను కూడా ఇస్తున్నారు.
{{/usCountry}}ఎలక్ట్రిక్ వాహన ప్రియులను ఆకట్టుకునేలా బ్యాటరీ కండిషనింగ్, ఆటో మోడ్‌తో కూడిన రీజెనరేటివ్ బ్రేకింగ్, ఐ-పెడల్, వెహికల్-టు-లోడ్ (వీ2ఎల్), డిజిటల్ కీ, షిఫ్ట్-బై-వైర్ సాంకేతికతలతో పాటు వర్చువల్ ఇంజిన్ సౌండ్ సిస్టమ్‌ను కూడా ఇందులో అమర్చారు. వీటన్నింటితో పాటు హై-వోల్టేజ్ బ్యాటరీపై లైఫ్‌టైమ్ వారంటీ, అష్యూర్డ్ బైబ్యాక్ ప్రోగ్రామ్, బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (బీఏఏఎస్) వంటి ఆకర్షణీయమైన ఆఫర్లను కియా అందిస్తోంది.
3. లగ్జరీ క్యాబిన్.. అధునాతన సౌకర్యాలు..
కియా సైరోస్ ఈవీ లోపలి భాగం (ఇంటీరియర్) అత్యంత విలాసవంతంగా ఉంది. ఇందులో కియాకు చెందిన 30-ఇంచుల ట్రినిటీ పనోరమిక్ డిస్‌ప్లే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ భారీ స్క్రీన్‌లో 12.3-ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3-ఇంచుల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, 5-ఇంచుల క్లైమేట్ కంట్రోల్ డిస్‌ప్లేలు కలిసి ఉంటాయి.
వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే సపోర్ట్‌తో పాటు 95కు పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్లు ఉన్న కియా కనెక్ట్ 2.0, ఓవర్ ది ఎయిర్ (ఓటీఏ) అప్‌డేట్స్ ఇందులో ఉన్నాయి. 8 స్పీకర్లు గల హర్మాన్ కార్డన్ ఆడియో సిస్టమ్, డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, ముందు, వెనుక సీట్లకు వెంటిలేషన్ సౌకర్యం, 4-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. కారు ముందు భాగంలో 16 లీటర్ల స్టోరేజ్ స్పేస్ (ఫ్రంక్) లభిస్తుంది.
4. అత్యున్నత రక్షణ.. లెవెల్ 2 అడాస్ సేఫ్టీ..
రక్షణ విషయంలో కియా ఎక్కడా రాజీ పడలేదు. సైరోస్ ఈవీలో 16 రకాల డ్రైవర్ అసిస్టెన్స్ ఫంక్షన్లతో కూడిన లెవెల్ 2 అడాస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) టెక్నాలజీని అందించారు. ఇందులో ఫార్వర్డ్ కొలిజన్ అగైడెన్స్ అసిస్ట్, స్టాప్ అండ్ గో ఫీచర్ ఉన్న స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీపింగ్ అసిస్ట్, లేన్ ఫాలోయింగ్ అసిస్ట్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ వంటి కీలక ఫీచర్లు ఉన్నాయి.
స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లుగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్-స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, అన్ని చక్రాలకు డిస్క్ బ్రేకులు, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్, 360-డిగ్రీల కెమెరా, పార్కింగ్ సెన్సార్లను ఏర్పాటు చేశారు.
5. వేరియంట్లు- ఆకర్షణీయమైన రంగులు..
వినియోగదారుల బడ్జెట్, అవసరాలకు తగ్గట్టుగా కియా సైరోస్ ఈవీని హెచ్టీకే, హెచ్టీకే+, హెచ్‌టీఎక్స్, హెచ్టీకే+ ఈఆర్, హెచ్‌టీఎక్స్ ఈఆర్, హెచ్‌టీఎక్స్+ ఈఆర్, ఎక్స్-లైన్ ఈఆర్ వంటి పలు వేరియంట్లలో తీసుకువస్తున్నారు.
ఇక కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే.. గ్లేసియర్ వైట్ పర్ల్, ఫ్రాస్ట్ బ్లూ, గ్రావిటీ గ్రే, ప్యూటర్ ఆలివ్, మాగ్మా రెడ్, ఐవరీ సిల్వర్ మ్యాట్, ఐవరీ సిల్వర్ గ్లోస్, అరోరా బ్లాక్ పర్ల్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో ఇది లభించనుంది. టాప్ ఎండ్ వేరియంట్ అయిన ఎక్స్-లైన్ ఈఆర్ కోసం ప్రత్యేకంగా అరోరా బ్లాక్ పర్ల్‌తో కూడిన ఎక్స్‌క్లూజివ్ మ్యాట్ గ్రాఫైట్ కలర్ కాంబినేషన్‌ను కియా ఆఫర్ చేస్తోంది.